జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా జుట్టు ఫాస్ట్ గా పెరగాలంటే కొబ్బరినూనెలో ఈ ఒక్కటి కలిపితే చాలు. జుట్టు సూపర్ గా పెరుగుతుంది. అదెంటో.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

జుట్టు రాలడం, విరగడం, నెమ్మదిగా పెరగడం చాలా మందికి చిరాకు తెప్పించే సమస్యలు. ఇందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ పరిష్కారాలు ఉన్నాయి. కరివేపాకు, కొబ్బరి నూనె జుట్టుకు చాలా మంచివి. ఈ రెండూ కలిపి వాడితే జుట్టు బాగా పెరుగుతుంది.

కరివేపాకు ప్రయోజనాలు:

కరివేపాకులో ఉండే ప్రోటీన్, బీటా-కెరోటిన్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. ఐరన్, ఇతర విటమిన్లు జుట్టు రాలడాన్ని, చిట్లడాన్ని ఆపుతాయి. సహజ నూనెలు జుట్టుకు మెరుపు, నునుపు తెస్తాయి. కరివేపాకులోని పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు జుట్టును రక్షిస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. అమైనో ఆమ్లాలు జుట్టును మృదువుగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు తలలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

కొబ్బరి నూనె ప్రయోజనాలు:

కొబ్బరి నూనెలోని లారిక్ ఆమ్లం జుట్టు ప్రోటీన్ నిర్మాణాన్ని కాపాడుతుంది. జుట్టు లోపలి వరకూ చేరి తేమను నిలుపుతుంది. జుట్టు వేర్లను బలపరుస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు చిక్కు పడకుండా చేస్తుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎండ, గాలి వల్ల జుట్టు పాడవకుండా కాపాడుతుంది.

కరివేపాకు కొబ్బరి నూనె తయారీ:

కొబ్బరి నూనెను కడాయిలో వేడి చేసి, కరివేపాకు వేసి కలపాలి. ఆకులు నల్లగా అయ్యేవరకూ వేడి చేయాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేసి, గంట తర్వాత షాంపూతో కడగాలి.

కరివేపాకు హెయిర్ మాస్క్: కరివేపాకు పేస్ట్‌తో కొబ్బరి నూనె/ పెరుగు కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత కడగాలి.

రెండూ కలిపి వాడితే ప్రయోజనాలు:

కొబ్బరి నూనెలో కరివేపాకు వేస్తే, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు నూనెలోకి చేరతాయి. ఇది జుట్టుకు మరింత పోషణను అందిస్తుంది. నూనె తలలోకి సులభంగా చేరుతుంది. కరివేపాకు నూనెతో మసాజ్ చేయడం చాలా మంచిది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు నూనె పాడవకుండా చూస్తాయి. ఇంట్లో తయారు చేసుకున్న నూనెలో కెమికల్స్ ఉండవు. కరివేపాకు, కొబ్బరి నూనె చుండ్రు, పొడిబారడం, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కరివేపాకు నూనెకు మంచి సువాసనను కూడా ఇస్తుంది.