MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?

Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?

 Cumin Water: అధిక బరువు తగ్గించుకోవాలని అనుకునేవారు, జీర్ణ క్రియను మెరుగుపరుచుకోవాలి అనుకునే వారు జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు. కానీ, కొందరు ఈ నీరు తాగకూడదని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Cumin Water
Image Credit : Getty

Cumin Water

నిజానికి జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ.. కొందరు మాత్రం ఈ జీలకర్ర నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి, ఎవరు తాగకూడదో తెలుసా?

1.మధుమేహం ఉన్నవారు..

జీలకర్ర నీళ్లు శరీరంలోని రక్తంలో చెక్కర స్థాయిలను ( Blood Sugar Levels) వేగంగా తగ్గిస్తాయి. అందుకే.. మధుమేహంతో ఉన్నవారు ఈ జీలకర్ర నీళ్లు తాగకూడదు. ఎందుకంటే.. మీరు ఇప్పటికే షుగర్ మందులు వాడుతూ ఉండే వారు. దానికి తోడు జీలకర్ర నీళ్లు కూడా తాగడం వల్ల షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ పేషెంట్స్ వైద్యులను సంప్రదించకుండా జీలకర్ర వాటర్ తాగకూడదు.

2. గర్భిణీ స్త్రీలు (Pregnant Women)

గర్భధారణ సమయంలో జీలకర్ర నీళ్లు అతిగా తాగడం మంచిది కాదు. ఎందుకంటే... జీలకర్ర గర్భాశయ సంకోచాలకు దారితీయవచ్చు. అతిగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ఇది గర్భస్రావం (Miscarriage) అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

22
ఈ సమస్యలు ఉన్నవారు కూడా...
Image Credit : Getty

ఈ సమస్యలు ఉన్నవారు కూడా...

3. గ్యాస్ట్రిక్ , గుండెల్లో మంట (Heartburn)

జీలకర్ర జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, కొంతమందిలో ఇది రివర్స్ అవ్వొచ్చు. జీలకర్ర వాయువును బయటకు పంపడానికి సహాయపడుతుంది, కానీ కొందరికి ఇది గ్యాస్ రిఫ్లక్స్ లేదా తీవ్రమైన గుండెల్లో మంటను (Heartburn) కలిగించవచ్చు.

4. శస్త్రచికిత్స జరగబోయే వారు (Before Surgery)

మీకు ఏదైనా సర్జరీ జరగాల్సి ఉంటే, దానికి కనీసం 2 వారాల ముందు నుండే జీలకర్ర నీళ్లు తాగడం ఆపేయాలి.ఎందుకంటే, ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సర్జరీ సమయంలో లేదా తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

5. పాలిచ్చే తల్లులు (Breastfeeding Mothers)

బాలింతలు తక్కువ మోతాదులో తీసుకుంటే పాలు పడటానికి మంచిదే, కానీ అతిగా తాగకూడదు. ఎందుకంటే, ఇది పాలు ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి (అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు).

గమనిక..

మోతాదు: ఏదైనా సరే పరిమితిలో ఉంటేనే ఔషధం. రోజుకు ఒక గ్లాసు (సుమారు 200ml) కంటే ఎక్కువ జీలకర్ర నీళ్లు తాగకపోవడమే మంచిది.

ఎప్పుడు తాగాలి?: పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, కానీ పైన చెప్పిన సమస్యలు ఉంటే మాత్రం మానేయడం ఉత్తమం.

Related Articles

Related image1
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Related image2
Chanakya Niti: ‘అతి వినయం ధూర్త లక్షణం’కి అర్థమేంటి? చాణక్యుడు ఏం చెప్పాడు..?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Recommended image2
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Recommended image3
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Related Stories
Recommended image1
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Recommended image2
Chanakya Niti: ‘అతి వినయం ధూర్త లక్షణం’కి అర్థమేంటి? చాణక్యుడు ఏం చెప్పాడు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved