Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Thrice Married Actresses: సౌత్ హీరోయిన్లు కొంతమంది వ్యక్తిగత కారణాలతో ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్ల సినిమా కెరీర్ బాగున్నా, పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు?

వనిత విజయకుమార్
తమిళ నటుడు విజయకుమార్ కూతురు వనిత. ఆమె తెలుగులో దేవి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తరువాత కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఈమె జీవితంలో మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె కెరీర్ కన్నా వ్యక్తిగత జీవితమే ఎక్కువ వార్తల్లో నిలిచింది. మొదట నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకొని, ఒక కొడుకు, కూతురికి జన్మనిచ్చారు. ఐదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆనంద్ జయరాజన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది. అతనితో కూడా విడిపోయాక, పీటర్ పాల్ అనే మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కానీ అతనితో కూడా విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది.
నటి లక్ష్మీ
ప్రముఖ నటి లక్ష్మి కూడా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదట భాస్కర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య అనే కూతురు పుట్టింది. అతనితో విడాకుల తర్వాత, నటుడు మోహన్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. ఈమె తెలుగులో, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలు చేశారు.
రాధికా శరత్‌కుమార్
నటి రాధికా శరత్‌కుమార్ ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్నారు. మొదట ఈమె నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. తర్వాత విదేశీయుడైన రిచర్డ్ హార్డీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వీరిద్దరూ ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకొని, ప్రస్తుతం ఆయనతోనే సంతోషంగా జీవిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు.
సరితా
కన్నడ, తమిళ నటి సరిత. మరో చరిత్ర సినిమాతో ఆమె చాలా పెద్ద హిట్ అందుకుంది. ఈమె కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అంటారు. ఆమె మొదట వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకొని, మలయాళ నటుడు ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు మరో పెళ్లి జరిగిందని చెబుతారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

