MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే

Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే

Mahesh Bang: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31 రాత్రి 11:30 ప్రాంతంలో కవలలు జన్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రసవానికి ముహూర్తం పెట్టిన వ్యక్తి మహేష్ బాంగ్. ఉపాసన షేర్ చేసిన వీడియో ద్వారా ఈయన గురించి తెలిసింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 10 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు
Image Credit : Upasanakonidelakamineni/Instagram

సెలెబ్రిటీ జ్యోతిష్యుడు

రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆసుపత్రిలో జనవరి 31న రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే దానికి సంబంధించి ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఇలా షేర్ చేయగానే ఆ వీడియో అలా వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఆ పిల్లలకు ప్రసవం చేసిన వైద్యులు, పనిచేసిన నర్సులు, ఆసుపత్రి యాజమాన్యం అందరూ కనిపించారు. అలాగే మహేష్ బాంగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ తానే జనవరి 31 రాత్రి 11:30 గంటల తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించి చెప్పినట్టు వివరించారు. దీంతో ఆ మహేష్ బాంగ్ ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రామ్ చరన్ అభిమానులు. ఆయన గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉందంటోంది ఇంటర్నెట్. మహేష్ బాంగ్ పెద్ద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. రామ్ చరణ్ ఉపాసన మాత్రమే కాదు, బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ హీరో హీరోయిన్లకు ఈయనే వ్యక్తిగత జ్యోతిష్యుడు. అలాగే ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. బాలీవుడ్ సెలెబ్రిటీ పెళ్లిళ్లకు కూడా ముహూర్తాలను చూసి చెప్పారు.

24
ఏ రాష్ట్రానికి చెందినవారు?
Image Credit : Mahesh bang/Instagram

ఏ రాష్ట్రానికి చెందినవారు?

మహేష్ బాంగ్ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆయన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ ప్రాంతంలో జన్మించినట్టు తెలుస్తోంది. చిన్నప్పటినుంచే జ్యోతిష్యం, ఆధ్యాత్మిక విషయాల పై ఆయనకు మేథస్సు ఎక్కువ. దాంతో జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ న్యూమరాలజీ, పాల్ మిస్త్రీ (హస్త జ్యోతిష్యం) వంటివి కూడా అభ్యసించారు. ప్రస్తుతం ఆయన దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడ నుంచే ఇండియాకు ఇతర దేశాలకు కూడా జ్యోతిష్య సేవలు అందిస్తున్నారు. అక్కడ పత్రికల్లో ఆయన ప్రత్యేకంగా జ్యోతిష్యకాలమ్స్ కూడా రాస్తారు.

Related Articles

Related image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Related image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
34
రామ్ చరణ్ కుటుంబంతో అనుబంధం
Image Credit : Upasanakonidelakamineni/Instagram

రామ్ చరణ్ కుటుంబంతో అనుబంధం

ఇక రామ్ చరణ్ ఉపాసన కుటుంబానికి సంబంధించి కవల పిల్లల ప్రసవానికి ముహూర్తం పెట్టింది ఆయనేనని వీడియోలో చెప్పారు. మహేష్ బాబు జ్యోతిష్యాన్ని అతి ముఖ్యమైన శాస్త్రంగా భావిస్తారు. జ్యోతిష్యపరంగా ముహూర్తాలు పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని ఆయన నమ్మకం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే రంగంలో పనిచేస్తున్నారు. మన దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ హీరో హీరోయిన్లు నిత్యం ఈయనను సంప్రదిస్తూ ఉంటారు. రామ్ చరణ్ కుటుంబంతో కూడా ఆయనకి ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంది.

44
ఇవన్నీ నిజమయ్యాయి
Image Credit : mahesh Bang/ Instagram

ఇవన్నీ నిజమయ్యాయి

ప్రపంచంలో రాబోయే ఉత్పత్తులను కూడా ముందే ఊహించి ఎన్నోసార్లు ఈయన హెచ్చరించినట్టు వార్తలు పబ్లిష్ అయ్యాయి. కోవిడ్ 19 గురించి కూడా ఆయన ముందే హెచ్చరించారని, అలాగే అలాగే సౌత్ఈస్ట్ ఏషియాలో 2004లో వచ్చిన సునామీ గురించి కూడా ఆయన ముందే ఊహించి చెప్పారని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్, ఇండియాలో 2005లో వచ్చిన పెద్ద భూకంపాన్ని కూడా ఆయన ముందుగానే పసిగట్టారు. 2018లో నరేంద్ర మోడీ గెలుస్తారని ముందే అంచనా వేసి వివరించారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image3
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved