MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక

Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక

Cheapest EV Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు అధికంగానే అమ్ముడవుతున్నాయి. వీటి ధర తక్కువగా ఉండడం, మెయింటెనెన్స్ సులువుగా ఉండటంతో ఎక్కువ మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చవకగా వచ్చే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 10 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాటా పంచ్ ఈవీ
Image Credit : Tata Motors website

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో (25kWh, 35kWh) లభిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేశారంటే 365 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు దీని సొంతం. ఇది మనదేశంలోని అత్యంత సురక్షితమైన ఈవీ కార్లలో ఒకటిగా మంచి పేరు పొందింది. ఇక దీని ధర రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది.

25
టాటా టియాగో ఈవీ
Image Credit : TATA MOTORS

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీలో 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 293 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.  ప్రస్తుతం ఇండియాలో టాటా టియాగో ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది ఈ కారునే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇదే తక్కువ ధరకు లభిస్తోంది.

Related Articles

Related image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Related image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
35
ఎంజీ కామెట్
Image Credit : Gemini

ఎంజీ కామెట్

ఎంజీ కామెట్ ఈవీ కారు చూసేందుకు చిన్నగా ఉంటుంది.  17.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి మొదలవుతుంది. అంటే ఆన్ రోడ్ ధర ఆరు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ కారు 56.3 bhp పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

45
సిట్రోయెన్ eC3
Image Credit : our own

సిట్రోయెన్ eC3

సిట్రోయెన్ ఈసీ3 కొంచెం ఖరీదైన కారే.  ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది 29.2 kWh బ్యాటరీతో 246 కి.మీ పరిధిలో పనిచేస్తుంది.  కేవలం 6.8 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 107 కి.మీ. దీని లుక్ కూడా ఎంత మందిని ఆకట్టుకునేలా ఉంటుంది.

55
టాటా నెక్సాన్ ఈవీ
Image Credit : our own

టాటా నెక్సాన్ ఈవీ

మన దేశంలో ఎక్కువ మంది మెచ్చిన కారు టాటా నెక్సాన్ ఈవీ. ఇది 30 kWh, 45 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 489 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. అంటే మీరు విజయవాడలో మొదలుపెడితే హైదరాబాద్ వెళ్లిపోవచ్చు.  ఈ మోడల్ 214.5 bhp పవర్, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర 13 లక్షల రూపాయలు దాటిపోవడం ఖాయం. కాబట్టి ఇది కాస్త ఖరీదైనదే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved