MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?

Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?

Billionaires Street: బెంగళూరును మన ఐటీ రాజధానిగా చెప్పుకుంటారు. బెంగళూరులోనే బిలియనీర్ స్ట్రీట్ కూడా ఉంది. ఈ వీధిలో ఉండే వాళ్లంతా వందల కోట్లకు అధిపతులే. ఇది ఎక్కడుందో? ఎవరెవరు అక్కడ నివసిస్తారో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 11 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్
Image Credit : ChatGpt

బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్

బెంగళూరు పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఐటీ సెక్టార్. ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు, పెద్ద పెద్ద వ్యాపారాలు జరిగేదంతా బెంగళూరులోనే. అయితే ఈ నగరంలో ఒక ప్రత్యేకమైన వీధి ఉంది. ఆ వీధికి బిలియనీర్ స్ట్రీట్ అని పేరు. ఎక్కడా ఈ వీధికి అధికారికంగా ఈ పేరు నమోదు అవ్వలేదు కానీ అందరూ ఆ వీధిని బిలియనీర్ స్ట్రీట్ అని మాత్రం పిలుచుకుంటారు. ఇది కోరమంగల ప్రాంతంలోని మూడో బ్లాక్ లో ఉంది. దేశంలోనే అత్యంత ధనికులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఐటీ రంగంలో కోట్లు గడించిన వారంతా ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. అందుకే అందుకే దీన్ని బిలియనీర్ స్ట్రీట్ గా చెప్పుకుంటారు. బెంగళూరులో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఇది ఒకటి. కేవలం బెంగళూరులోనే కాదు దేశంలోనే ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

24
ఈ వీధి ఎందుకంత ఖరీదు?
Image Credit : Getty

ఈ వీధి ఎందుకంత ఖరీదు?

ఈ వీధికి బిలియనీర్ స్ట్రీట్ గా పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటగా ఇది బెంగళూరులోని ఐటీ వ్యాపార కేంద్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ, బెల్లందూర్, సర్జాపూర్ వంటి ఉద్యోగ కేంద్రాలకు ఈ ప్రాంతం నుంచి సులభంగా చేరుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ సెంటర్లు కూడా దగ్గర్లోనే ఉంటాయి. ఈ ఏరియాలోనే పెద్ద పెద్ద ఫ్లాట్లు, విలాసవంతమైన లగ్జరీ ఇళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ తో నిండిన బంగ్లాలు ఉంటాయి. ధనికులు ఇక్కడ నివసించడానికి అధికంగా ఆసక్తి చూపిస్తారు.

Related Articles

Related image1
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Related image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
34
ఎవరు నివసిస్తారు?
Image Credit : Getty

ఎవరు నివసిస్తారు?

ఈ బిలియనీర్ స్ట్రీట్ లోనే ఫ్లిప్ కార్ట్‌ను స్థాపించిన సచిన్, బిన్నీ బన్సాల్ నివసిస్తారు. అలాగే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, క్రిష్ గోపాలకృష్ణ కూడా ఉంటారు. నారాయణ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్ దేవి శెట్టి, బిలియనీర్ అజిత్ ఐసాక్, ప్రముఖ రాజకీయ వేత్త రాజీవ్ చంద్రశేఖర్ వంటి వారు ఇక్కడే నివసిస్తారు. ఇంకా ఎంతోమంది వ్యాపారులు, కోటీశ్వరులు ఈ వీధిలోనే నివసిస్తున్నారు. అందుకే ఈ వీధిని బిలియనీర్ స్ట్రీట్ గా పిలుచుకుంటారు.

44
ఇళ్ల ధరలు ఎంతో తెలుసా?
Image Credit : Getty

ఇళ్ల ధరలు ఎంతో తెలుసా?

ఈ బిలియనీర్ స్ట్రీట్ లో ఇళ్ల స్థలాలు ధరలు చూస్తే షాక్ అవుతారు పదివేల చదరపు అడుగుల స్థలం 67 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అంటే ఒక్క చదరపు అడుగు ధర 70 వేల రూపాయలకు పైగా ఉండటం అనేది ఈ ప్రాంతం ఎంత విలువైనదో తెలిసేలా చేస్తుంది. ఇక్కడ స్థలాలు అంత ఈజీగా దొరకవు. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ధరలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గడం అనేది ఉండదు. ఈ ప్రాంతంలో ఇల్లు కొనడం అంటే కేవలం వందల కోట్ల వారసులైన వారికి మాత్రమే సాధ్యం. కోటీశ్వరులైన స్టార్టప్ వ్యవస్థాపకులు, ప్రముఖులు ఒకే చోట నివసించడం వల్ల ఈ వీధి పేరు బిలియనీర్ స్ట్రీట్ గా మారిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Recommended image2
Copper: రాగి ధ‌ర‌లు పెరుగుతున్నాయి స‌రే.. ఇంత‌కీ రాగిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.?
Recommended image3
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Related Stories
Recommended image1
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved