స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాయపడ్డ సింహం. ఈ సినిమా టీజర్ లాంచ్ రీసెంట్ గా జరిగింది. ఈ వెంట్ లో సంచలన కామెంట్స్ చేశారు రైటర్ సూర్య ప్రకాష్ జోశ్యుల. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

వైవిధ్యమైన పొలిటికల్ క్రైమ్ కామెడీ మూవీ

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి హీరోగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. కాశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై యూత్ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. డోంట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, ఒక వైవిధ్యమైన పొలిటికల్ క్రైమ్ కామెడీగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఈసినిమా టీజర్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

ఎవరూ ఊహించని కథతో ..

పొలిటికల్ సెటైర్స్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమాకు మూల కథను సూర్య ప్రకాష్ జోశ్యుల అందించగా .. కాశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్టు టీజర్ చూస్తేనె తెలిసిపోతుంది. అమెరికా వీసా కోసం తపించే యువకుడి పాత్రలో.. పరిస్థితులకు తలవొగ్గని వ్యక్తిగా తరుణ్ కనిపించబోతున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి వంటి హీరోయిన్లు సినిమాకు మరింత అందం తీసుకొచ్చారు. అంతే కాదు ఈమూవీకి విష్ణు ఓయి కామెడీ హైలెట్ కాబోతోంది.

సూర్య ప్రకాష్ జోశ్యుల కామెంట్స్ వైరల్..

ఈ సినిమాకు మూల కథను అందించిన సూర్య ప్రకాష్ జోశ్యుల మాట్లాడుతూ.. తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. '' ఈ సినిమాకు మూల కథ అందించినందుకు మూలన కూర్చో బెట్టకుండా పిలిచారు చాలా సంతోషంగా ఉంది. పవన్ గారితో నాకు ముందు నుంచే పరిచయం ఉంది... ఇక తరుణ్ భాస్కర్ గారితో కూడా పరిచయం అవుతందని అనుమానంగా ఉంది. ఫరియా గారితో జాతిరత్నాలు టైమ్ లో కాస్త అనుబంధం ఉంది. ఆ సినిమాకు నేను కో డైరెక్టర్ గా పనిచేశాను. ఇక ఈసినిమా ట్రాంప్ మీద సాగే కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. మీ పిల్లల్ని అమెరికా పంపించాలంటే ఆలోచిస్తారు.. నన్ను పక్కాగా తిట్టుకుంటారు.'' అని తన మార్క్ సెటైర్లతో సందడి చేశారు సూర్య ప్రకాష్ జోశ్యుల.

గాయపడ్డ సింహం టీజర్ రెస్పాన్స్.

తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సాధించింది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే.. ఒక సీరియస్ విషయాన్ని అందరికి అర్ధం అయ్యేలా చూపించింది. అందరిలో ఒక ఆలోచన కలిగించే విధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధనల వల్ల ఇబ్బందులకు గురైన యువత ఆవేదనను వివరిస్తూనే.. ట్రంప్ పై సెటైర్లు పేల్చారు. సినిమా టీమ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌ను చూస్తుంటే, ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద గర్జిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.