MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..

కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనూజ మధ్య మళ్లీ సమ్ థింగ్ .. సమ్ థింగ్ స్టోరీలు స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఏకంగా కళ్యాణ్ కు రింగు తోడిగేసింది తనూజ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 11 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా?
Image Credit : StarMaa

కళ్యాణ్ పడాల - తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయిపోయి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. అయినా సరే సోషల్ మీడియా కళ్యాణ్, తనూజ పై వార్తలు ఆగడంలేదు. అసలే ఈసారి సీజన్ చాలా స్పెషల్ గా నిలిచింది. ఈ సీజన్ లో విన్నర్, రన్నర్ మధ్య లవ్ రూమర్స్ అందుకు కారణం అయ్యాయి.. హౌస్ మొత్తంలో పవన్, రీతూ జంట సందడి చేస్తే.. బిగ్ బాస్ అయిపోయిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఆడియన్స్ వాళ్లను వదిలేసి.. విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల, రన్నర్ గా నిలిచిన తనూజ పై పడ్డారు. వీరిద్దిరపై ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చలు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్, రీతూ చౌదరి పేర్లు ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి.

25
విన్నర్, రన్నర్ మధ్య అనుబంధం అరుదు..
Image Credit : Jiohotstar

విన్నర్, రన్నర్ మధ్య అనుబంధం అరుదు..

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో విన్నర్, రన్నర్ ఒకరికోసం ఒకరు సపోర్ట్ గా నిలబడిన సందర్భాలు చాలా తక్కువ. తెలుగు బిగ్ బాస్ లో అయితే అసలు ఇలాంటి ఉదాహరణలు లేనే లేవు. మొదటి సారిగా ఈ సీజన్‌లో కళ్యాణ్ పడాల, తనూజ మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, లేక ప్రేమా అనే విషయంలో స్పష్టత లేకపోయినా, స్నేహానికి మించిన అనుబంధమేనని మాత్రం అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది.

Related Articles

Related image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
35
కళ్యాణ్ - తనూజ అభిమానుల ఫైట్..
Image Credit : Starmaa

కళ్యాణ్ - తనూజ అభిమానుల ఫైట్..

తనూజ వల్లే తన విజయం సాధ్యం అయ్యిందని కళ్యాణ్ చెప్పడం.. బయట ఈ విషయంలో రక్చ రచ్చ జరిగింది. కానీ బిగ్ బాస్ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తనూజ ఇద్దరూ బయట కలవలేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి అభిమానుల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. తనూజకు కళ్యాణ్‌పై నిజమైన అభిమానం లేదని, హౌస్‌లో తన అవసరాల కోసం మాత్రమే అతన్ని ఉపయోగించుకుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపించారు. మరోవైపు తనూజ అభిమానులు కళ్యాణ్ కోసం తనూజను విన్నర్ కాకుండా ఆపారని విమర్శించారు.

45
మళ్లీ మొదలయ్యిందా..?
Image Credit : StarMaa

మళ్లీ మొదలయ్యిందా..?

ఇక ఈమధ్య కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి తగ్గింది.. కళ్యాణ్, తనూజ పేర్లు కూడా జనాలు మర్చిపోయే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో.. మరోసారి వీరి పేర్లు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ‘BB ఉత్సవం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, తనూజ కూడా ఈ ఈవెంట్‌లో కలిసి సందడి చేశారు. ఇటీవల ఈ కార్యక్రమం షూటింగ్ పూర్తయింది. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో అందులో షాకింగ్ విషయం బయటపడింది.

55
కళ్యాణ్‌కు ఉంగరం తొడిగిన తనూజ..
Image Credit : StarMaa

కళ్యాణ్‌కు ఉంగరం తొడిగిన తనూజ..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తనూజ, పవన్ కళ్యాణ్‌కు ఉంగరం తొడగడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా, ఈ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి ‘చుట్టమల్లే చుట్టేశావే’ పాటకు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. BB ఉత్సవం కార్యక్రమం ప్రసారానికి ముందే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image2
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Recommended image3
నా కెరీర్‌లో అవి రెండే పరమ వేస్ట్ సినిమాలు.. ఓపెన్‌గా చెప్పేసిన కృష్ణవంశీ
Related Stories
Recommended image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved