MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. కానీ ఎప్పుడూ డైరెక్ష్ వైపు దృష్టి పెట్టలేదు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. చిరు తన కెరీర్ లో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.. ఇంతకీ ఏంటా సినిమా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 09 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా చిరంజీవి...
Image Credit : ChiranjeeviKonidela/Instagram

ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా చిరంజీవి...

మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో మాత్రమే కాదు, సినిమాకు సబంధించిన అన్ని విభాగాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కూడా. ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే.. స్క్రిప్ట్ ఎంపిక నుంచి డైరెక్షన్ వరకు తన అభిప్రాయాలను దర్శకులతో పక్కాగా పంచుకుంటారని.. కొంత మంది డైరెక్టర్లు.. పలు పలు సందర్భాల్లో వెల్లడించారు. 

రీసెంట్ గా మెగాస్టార్ నటించి హిట్ అయిన.. మనశంకర వరప్రసాద్ గారు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈవిషయంపై మాట్లాడారు. తన సినిమా సందర్భంగా చిరంజీవి ఇచ్చిన సూచనల గురించి వివరించారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఒక సినిమాలో కొంత భాగాన్ని స్వయంగా డైరెక్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? ఇంతకీ ఎంటా సినిమా?

25
తనికెళ్ల భరణి వెల్లడించిన విషయం..
Image Credit : X/@Shine_Screens

తనికెళ్ల భరణి వెల్లడించిన విషయం..

చిరంజీవి డైరెక్టర్ గా మారిన విషయాన్ని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.." చిరంజీవి కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో.. ఒక సినిమా చేశాము.. అదే బిగ్ బాస్. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. 

బిగ్ బాస్ సినిమాలో నాది నెగటివ్ పాత్ర , ఆ సినిమాకు విజయ బాపినీడు దర్శకుడిగా వ్యవహరించారు. చెన్నైలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, సినిమాలో ఒక కీలక సన్నివేశం చిత్రీకరణ దశలో అనూహ్య పరిస్థితి ఏర్పడింది. దాంతో దర్శకుడు కొన్ని రోజులు వేరే ఊరు వెళ్లాళ్సిన పరిస్థితి వచ్చింది.

Related Articles

Related image1
జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన డ్యాన్సర్ ఎవరో తెలుసా? తారక్ కంటే బాగా డ్యాన్స్ చేస్తాడా..?
Related image2
నాగబాబు వల్ల చిరంజీవి కి చీవాట్లు పెట్టిన తల్లి అంజనా దేవి.. కారణం ఏంటంటే?
35
డైరెక్టర్ లేకపోవడంతో.. రంగంలోకి చిరంజీవి..
Image Credit : Asianet News

డైరెక్టర్ లేకపోవడంతో.. రంగంలోకి చిరంజీవి..

ఆ సమయంలో దర్శకుడు విజయ బాపినీడు క్లోజ్ ఫ్రెండ్‌కు హార్ట్ అటాక్ రావడంతో ఆయన వెంటనే వెళ్లాల్సి వచ్చింది. కానీ షూటింగ్ ఆపే అవకాశం లేకపోవడం, చిరంజీవి డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్ నిలిపివేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో చిరంజీవి రంగంలోకి దిగారు. అప్పుడు చేయాల్సిన ఆ సీన్‌లో చిరంజీవి అయ్యప్ప మాల ధరించి ఉంటారు, తన పాత్ర చిరంజీవి మాల తెంపే సన్నివేశంతో పాటు ఆ తర్వాత ఫైట్ ఉంటుంది.. అదే తన పాత్ర ఇంట్రడక్షన్ సీన్ అని'' తనికెళ్ళ భరణి తెలిపారు.

45
నిర్మాతకు నష్టం రాకూడదని..
Image Credit : Asianet News

నిర్మాతకు నష్టం రాకూడదని..

ఆర్టిస్టుల డేట్స్, నిర్మాత పెట్టుబడి వృథా కాకుండా ఉండేందుకు డైరెక్షన్ బాధ్యత ఎవరు చేపట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు, చిరంజీవే ముందుకు వచ్చి ఆ సన్నివేశాలను డైరెక్ట్ చేశారని తనికెళ్ళ భరణి వెల్లడించారు. ఫైట్ సీన్‌తో పాటు సంబంధిత సన్నివేశాలన్నింటినీ చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేశారని తెలిపారు. చిరంజీవి సాంకేతిక పరిజ్ఞానం చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు భరణి. మొత్తం మూడు రోజుల పాటు చిరంజీవి ఆ సినిమాకు డైరెక్షన్ చేశారని తనికెళ్ళ భరణి వెల్లడించారు.

55
చిరంజీవిని దెబ్బ కొట్టిన మోహన్ బాబు..
Image Credit : Asianet News

చిరంజీవిని దెబ్బ కొట్టిన మోహన్ బాబు..

1995లో విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన బిగ్ బాస్ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏంటంటే.. బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయిన రోజే.. మోహన్ బాబు పెదరాయుడు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. 

ఆ సినిమా కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బిగ్ బాస్ లో మెగా స్టార్ స్టైల్, హెయిర్ స్టైల్, మాస్ లుక్ ప్రేక్షకుల్లో గుర్తుండిపోయాయి. బిగ్ బాస్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ హైలైట్‌గా నిలిచింది. కానీ పెదరాయుడు సినిమా సాధించిన విజయం మాత్రం ఈ మూవీ సాధించలేకపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు
Recommended image2
50 ఏళ్ల అభిషేక్ కు భార్య ఐశ్వర్య రాయ్ స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్, ఫిదా చేసిందిగా?
Recommended image3
వెంకటేష్ మిస్ అయ్యాడు.. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, రికార్డులు తిరగరాసిన మూవీ ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన డ్యాన్సర్ ఎవరో తెలుసా? తారక్ కంటే బాగా డ్యాన్స్ చేస్తాడా..?
Recommended image2
నాగబాబు వల్ల చిరంజీవి కి చీవాట్లు పెట్టిన తల్లి అంజనా దేవి.. కారణం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved