Sridevi: 9 కోట్లు పెట్టి భార్య, తమ్ముడితో సినిమా.. 1993లో అతిపెద్ద డిజాస్టర్
అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' విడుదలై 31 ఏళ్లు పూర్తయ్యాయి. 1993 ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజైంది. నిర్మాత నీళ్లలా డబ్బు ఖర్చుపెట్టి, తన భార్య, తమ్ముడిని హీరోహీరోయిన్లుగా పెట్టి ఈ సినిమా తీశారు.

రూప్ కీ రాణీ చోరోం కా రాజా
1993లో వచ్చిన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' సినిమా నిడివి 177 నిమిషాలు. నిర్మాత బోణీకపూర్ ఈ సినిమాలో తన భార్య శ్రీదేవిని హీరోయిన్గా, తమ్ముడు అనిల్ కపూర్‌ను హీరోగా తీసుకున్నారు. సినిమాలో భారీ, ఖరీదైన సెట్లు ఉన్నప్పటికీ, కథలో దమ్ము లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.
అనిల్ కపూర్, శ్రీదేవిలతో
బోణీకపూర్ 1987లో అనిల్ కపూర్, శ్రీదేవిలతో 'మిస్టర్ ఇండియా' సినిమా తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే జోడీని ఆయన తన 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా'లో రిపీట్ చేశారు. కానీ, ఆయన ప్లాన్ వర్కవుట్ కాలేదు. సినిమా రిలీజైన మొదటి రోజే ప్రేక్షకులు తిరస్కరించారు.
శేఖర్ కపూర్ దర్శకుడు
నిజానికి, బోణీకపూర్ 'మిస్టర్ ఇండియా' విడుదలైన 1987లోనే 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా' సినిమాను ప్రకటించారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు శేఖర్ కపూర్ దర్శకుడు. 'మిస్టర్ ఇండియా'కు కూడా శేఖర్ కపూరే దర్శకత్వం వహించారు.
అతిపెద్ద డిజాస్టర్
ఆరేళ్ల సమయం
నటీనటులు
'రూప్ కీ రాణీ చోరోం కా రాజా'లో అనిల్ కపూర్, శ్రీదేవిలతో పాటు అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్, ఆకాశ్ ఖురానా, పరేష్ రావల్, బిందు, అజిత్ వచానీ, దలీప్ తాహిల్, అంజన్ శ్రీవాస్తవ్, రజాక్ ఖాన్, రామ్ సేఠీ వంటి వారు నటించారు.

