ఏసీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో 50 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్
Flip Cart Discount Sale: ఇది వేసవి కాలమా? వర్షాకాలమా? అర్థం కాకుండా ఉంది. ఏసీతో పనేముందిలే ఈ సమ్మర్ ఎలాగోలా అయిపోతుందిలే అనుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఒకరోజు విపరీతంగా ఎండ కాస్తే, మర్నాడే భారీగా వర్షం పడుతోంది. అందువల్ల ఏసీ తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న 50 శాతం డిస్కౌంట్ ఆఫర్స్ ఉపయోగించుకుంటే మీరు రూ.30 వేల లోపే మంచి ఏసీ కొనుక్కోవచ్చు. ఏ కంపెనీలు ఈ ఆఫర్లు అందిస్తున్నాయో తెలుసుకుందామా?

వోల్టాస్ 123 వెక్ట్రా ప్లాటినా(Voltas 123 Vectra Platina)
వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ విండో AC ఫ్లిప్‌కార్ట్‌లో 27 % తగ్గింపుతో కేవలం రూ.25,999కి లభిస్తోంది. 1 టన్ సామర్థ్యం కలిగిన ఈ AC 3 స్టార్ BEE రేటింగ్‌తో వస్తుంది. ఇందులో స్లీప్ మోడ్ ఉంది. ఇది మీ నిద్ర సమయంలో ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
వోల్టాస్ 123 వెక్ట్రా పెర్ల్(Voltas 183 Vectra Pearl)
వోల్టాస్ 1.5 టన్ సామర్థ్యం కలిగిన 3 స్టార్ విండో AC ఫ్లిప్‌కార్ట్‌లో 30 % తగ్గింపుతో రూ.29,999కే లభిస్తోంది. ఇందులో స్లీప్ మోడ్ ఉంది. ఇది మీ నిద్ర సమయంలో ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. సంవత్సరానికి దీని విద్యుత్ వినియోగం 4750W మాత్రమే ఉంటుంది.
వోల్టాస్ 123 వెక్ట్రా పర్ల్ కాపర్(Voltas 183 Vectra Pearl copper)
వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ విండో AC ఫ్లిప్‌కార్ట్‌లో 31% తగ్గింపుతో రూ.29,600కి లభిస్తోంది. ఇందులో ఆటో రీస్టార్ట్ ఫీచర్ ఉంది. దీనివల్ల విద్యుత్తు పోయిన తర్వాత సెట్టింగ్‌లను మాన్యువల్‌గా రీసెట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో టర్బో మోడ్, స్లీప్ మోడ్, ఎనర్జీ సేవర్ మోడ్ ఉన్నాయి.
వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్(Voltas 1.5 Ton Split AC)
వోల్టాస్ 183V ADS 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC 50 % తగ్గింపుతో కేవలం రూ.29,729కి లభిస్తోంది. ఇది నాన్ ఇన్వర్టర్ AC కంటే 15 % ఎక్కువ విద్యుత్తును ఆదా చేస్తుంది. ఇందులో హై యాంబియంట్ కూలింగ్ ఉంది. ఇది 50°C వరకు ఉష్ణోగ్రత వద్ద కూడా తక్షణ చల్లదనాన్ని అందిస్తుంది.
మీడియా 2025 మోడల్ ఏసీ(Midea 2025 Model AC)
మీడియా కంపెనీకి చెందిన 4 ఇన్ 1 కన్వర్టిబుల్ AC 43% తగ్గింపుతో రూ.29,990కి లభిస్తోంది. 3 స్టార్ రేటింగ్, 1 టన్ సామర్థ్యం గల ఈ ACలో ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది నెలకు రూ.3333 నో కాస్ట్ ఈఎంఐలో కూడా లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఉపయోగించుకొని మీ అవసరానికి తగిన ఏసీని ఎంచుకోండి.