Amazon Great Summer Sale: ఆపిల్ ఎయిర్ పాడ్స్ 4 కేవలం రూ.9,999లకే..
Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అదిరిపోయే ఆఫర్స్ తో అదరగొడుతోంది. ముఖ్యంగా మంచి డిస్కౌంట్లతో గ్యాడ్జెట్స్ అందిస్తోంది. అందులో భాగంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 ని కేవలం రూ.9,999కే అందిస్తోంది. ఈ ఇయర్‌ఫోన్ అసలు ధర, డిస్కౌంట్, ఫీచర్లు, సౌండ్ క్వాలిటీ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

ఆపిల్ కంపెనీ ప్రోడెక్ట్స్ ని ఇష్టపడే వారికి ఇది నిజంగా సూపర్ ఆఫర్! అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 ఇయర్‌ఫోన్‌లు ఇప్పటివరకు లేని విధంగా కేవలం రూ.9,999కే లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర డిస్కౌంట్‌లను కూడా ఉపయోగించి మీరు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరకు బెస్ట్ క్వాలిటీ ఫీచర్స్ తో లభించే ఎయిర్‌పాడ్స్ ఇవే కావడం విశేషం.
సౌకర్యంగా ఉండే డిజైన్!
పాత మోడల్స్ తో పోలిస్తే ఎయిర్‌పాడ్స్ 4 చాలా చక్కగా, సౌకర్యవంతమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఎక్కువసేపు ఉపయోగించినా ఇబ్బంది కలిగించదు. ముఖ్యంగా సిలికాన్ టిప్స్ ఇష్టపడని వారికి ఇది మంచి సెలెక్షన్ అవుతుంది. మెరుగైన డిజైన్ కారణంగా నడుస్తున్నప్పుడు లేదా తేలికపాటి ప్రయాణాలలో కూడా చెవులకు గట్టిగా ఉంటుంది.
నాణ్యమైన సౌండ్!
ఈ ఇయర్ ఫోన్స్ లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆపిల్ H2 చిప్ ఉపయోగించడం వల్లఎయిర్‌పాడ్స్ 4 స్పష్టమైన ఆడియో, శక్తివంతమైన బాస్ సౌండ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌లలో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో, అడాప్టివ్ EQ వంటి ఫీచర్లు ఆడియో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి.
ఇతర ఫీచర్లు
ఎయిర్‌పాడ్స్‌లో వాల్యూమ్ కంట్రోల్ లేదు. కానీ వాయిస్ ఐసోలేషన్, బీమ్ ఫార్మింగ్ మైక్రోఫోన్లు, పర్సనలైజ్డ్ వాల్యూమ్, ఫైండ్ మై ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, హెడ్ జెస్చర్ కంట్రోల్‌లను కలిగి ఉంది. దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. కేస్‌తో కలిపి 30 గంటల వరకు దీన్ని కంటిన్యూగా ఉపయోగించవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 5 గంటల వరకు పనిచేస్తుంది. USB-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు.
ఎవరికి బెస్ట్?
మీరు ఐఫోన్ కలిగి ఉంటే ఎయిర్‌పాడ్స్ 4 కరెక్ట్ సెలెక్షన్. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఆడియో క్వాలిటీ, ఆపిల్ ఎకోసిస్టమ్ కనెక్షన్ తదితర ఫీచర్లు కలిగిన ఇయర్ ఫోన్స్ ఈ ధరకు లభించడం గొప్ప అవకాశం. వైర్‌లెస్ ఛార్జింగ్, ANC వంటి ఫీచర్లు కొన్ని చౌకైన మోడళ్లలో ఉన్నప్పటికీ మొత్తం డిజైన్, సౌకర్యం, నమ్మకత్వంలో ఎయిర్‌పాడ్స్ 4కు సాటిలేదు.