అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Avocado: అవకాడో సాగు బెస్ట్ బిజినెస్ ఐడియా ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఎకరానికి రూ. 20 లక్షల నుంచి 45 లక్షల వరకు అధిక ఆదాయాన్ని అందిస్తుంది. సరైన సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులు, తక్కువ నీటి వినియోగం అవకాడో పంటను లాభసాటిగా మారుస్తాయి.

రైతులకు లాభదాయక పంట
అవకాడో సాగు ప్రస్తుతం దేశంలో విస్తారంగా రైతులకు లాభదాయక పంటగా మారుస్తోంది. సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో రైతులను కోటీశ్వరులను చేసిన ఈ పంటను గ్రీన్ గోల్డ్ గా పిలుస్తారు.
అవకాడో సాగుకు అనుకూలం
భారతీయ ట్రాపికల్ క్లైమేట్కు అవకాడో సాగు అనుకూలంగా ఉంటుంది. అవకాడో మొక్కలకు నీళ్లు నిల్వ ఉండే పొలాలు, ఉప్పు నీరు సరిపోవు. మట్టి pH స్థాయి 5 నుంచి 7 మధ్య ఉండాలి.
నర్సరీ బ్యాగులలో 6 నెలలు పెంచి
విత్తనాలను ముందుగా నర్సరీ బ్యాగులలో 6 నెలలు పెంచి, ఆ తర్వాత పొలంలో నాటాలి. మొక్కల మధ్య 20 అడుగుల దూరం పాటించాలి. ఒక ఎకరానికి 140 నుంచి 160 మొక్కలు సరిపోతాయి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఉత్తమమైనది. మొక్కలు నాటిన ఐదు సంవత్సరాల తర్వాత కాయలు కాస్తాయి. ఏడో సంవత్సరం నుంచి ఒక్కో చెట్టు సుమారు 200 కిలోల కాయలను ఇస్తుంది.
మార్కెట్లో కిలో అవకాడో ధర
ప్రస్తుతం మార్కెట్లో కిలో అవకాడో ధర రూ. 80 నుంచి రూ. 150 వరకు, నాణ్యతను బట్టి రూ. 250 వరకు ఉంటుంది. అవకాడో సాగు ద్వారా సంవత్సరానికి ఎకరానికి రూ. 20 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
ఈ రాష్ట్రాల్లో అధికం..
తక్కువ ఎరువులు, పురుగుమందుల అవసరం వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి. తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, మహారాష్ట్రలో ఈ పంటను అధికంగా పండిస్తున్నారు.

