మీ చేతిలో రూ. 5 లక్షలున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెలకు రూ. 30 వేలు సంపాదించండి.
Business Ideas: ఉద్యోగంతో పోల్చితే వ్యాపారం చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఎక్కడికో వెళ్లి అరకోర సంపాదన కంటే ఉన్ని ఊరిలోనే ఉంటూ మంచి ఆదాయం పొందాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్ ఐడియా బాగా ఉపయోగపడుతుంది.

మినీ డెయిరీ వ్యాపారం
గ్రామం లేదా పట్టణాల్లో చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం డెయిరీ. ఉదయం నిద్ర లేచిన వెంటనే పాలు కావాల్సిందే. ఒక్క ఇంట్లోనే కాకుండా హోటల్స్, రెస్టారెంట్లలో పాల వినియోగం అనివార్యం. అందుకే ఇలాంటి పాల వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు పొందొచ్చు. మధ్యవర్తులు లేకుండా ఇంటింటికి నేరుగా పాలు అందించడం ద్వారా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. నాణ్యమైన పాలు ఇచ్చే డెయిరీగా పేరు వస్తే కస్టమర్లు ఆటోమేటిక్గా పెరుగుతారు.
అవసరమైన పెట్టుబడి వివరాలు
ఈ వ్యాపారం రూ. 5 లక్షల లోపలే స్టార్ట్ చేయవచ్చు.
* 3 ఆవులు లేదా గేదెలు – సుమారు రూ. 2.7 లక్షలు ఉంటాయి.
* షెడ్ నిర్మాణం లేదా అద్దె – రూ. 50,000
* మేత, మందులు, ప్రారంభ ఖర్చులు – రూ. 40,000
* పాలు నిల్వ డబ్బాలు, కూలింగ్ క్యాన్ – రూ. 30,000
* పాలను హోమ్ డెలివరీ కోసం స్కూటీ లేదా సైకిల్ – రూ. 50,000
* మొత్తం పెట్టుబడి: సుమారు రూ. 4.7 లక్షలు అవుతుంది.
రోజువారీ పని విధానం ఎలా ఉంటుంది
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాలు పితకాలి. ఆ పాలను ముందే బుక్ చేసిన ఇళ్లకు సరఫరా చేయాలి. మిగిలిన పాలు ఉంటే స్థానిక హోటళ్లు, టీ స్టాల్స్ కు ఇవ్వొచ్చు. ఫోన్ నంబర్, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు.
నెలవారీ లాభం ఎలా ఉంటుంది.?
సగటున ఒక ఆవు రోజుకు 10 లీటర్లు పాలు ఇస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే 3 ఆవులు రోజుకు 30 లీటర్లు ఇస్తుంది. ప్రస్తుతం లీటర్ ధర సుమారు రూ. 70 వరకు ఉంది. అందులోనూ స్వచ్ఛమైన పాలు ఏకంగా రూ. 80 వరకు కూడా పలుకుతుంది. సరాసరి 70 లీటర్లు అనుకున్న రోజుకు రూ. 2000 వరకు ఆదాయం పొందొచ్చు. అంటే నెలకు రూ. 60 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులు సగానికి సగం తీసేసినా నెలకు రూ. 30 వేల ఆదాయం పొందొచ్చు. క్రమంగా ఆవుల సంఖ్య పెంచుకుంటూ పోతే ఆదాయం నెలకు రూ. లక్ష కూడా దాటుతుంది.
ఈ వ్యాపారంలో ప్రత్యేక లాభాలు
ఉన్ని ఊరిలోనే వ్యాపారం ప్రారంభించవచ్చు. డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. నగదు ప్రవాహం రోజూ ఉంటుంది. భవిష్యత్తులో పెరుగు, నెయ్యి, మజ్జిగ అమ్మకానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ డెయిరీ సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే దగ్గర్లో ఉన్న పట్టణాల్లో కూడా పంపిణీ చేసుకోగలిగితే లాభాలు మరింత పెరుగుతాయి.

