MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Real Estate: హైద‌రాబాద్‌కు కాస్త‌ దూరంగా, అభివృద్ధికి చాలా ద‌గ్గ‌ర‌గా.. ఇక్క‌డ ఈరోజు భూమి కొంటే రేపు బంగార‌మ‌వుతుంది!

Real Estate: హైద‌రాబాద్‌కు కాస్త‌ దూరంగా, అభివృద్ధికి చాలా ద‌గ్గ‌ర‌గా.. ఇక్క‌డ ఈరోజు భూమి కొంటే రేపు బంగార‌మ‌వుతుంది!

భూమిపై పెట్టుబ‌డి పెట్టిన వారు ఎప్ప‌టికీ న‌ష్ట‌పోర‌ని చాలా మంది చెబుతుంటారు. పెరుగుతోన్న జ‌నాభాకు అనుగుణంగా భూమి పెర‌గ‌దు అనేది లాజిక్‌. అయితే ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాల‌నే విష‌యంలో చాలా మందికి ఓ క్లారిటీ ఉండ‌దు. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 31 2025, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఔట‌ర్ రింగ్ రైలుతో మారుతోన్న భ‌విత‌వ్యం
Image Credit : Google Gemini AI

ఔట‌ర్ రింగ్ రైలుతో మారుతోన్న భ‌విత‌వ్యం

తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన ఔట‌ర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ రియ‌ల్ ఎస్టేట్‌కు ఊపునిస్తోంది. రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు స‌మాంత‌రంగా ప్ర‌తి పాదించిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో రవాణా రంగానికే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మలుపు తిప్పబోతోంది. వంగపల్లి–ఆలేరు, గుట్లగూడ–చిట్టిగడ్డ, బూర్గుల–బాలానగర్, మాసాయిపేట–శ్రీనివాసనగర్, వలిగొండ–రామన్నపేట, గజ్వేల్–కొడకండ్ల మార్గాల గుండా ఈ ప్రాజెక్టు సాగనుంది. వీటిలో గ‌జ్వేల్ హాట్ స్పాట్‌గా మార‌నుంది.

DID YOU
KNOW
?
భారీగా పెరిగిన ధరలు
గజ్వేల్ ప్రాంతంలో భూమి ధరలు గత రెండేళ్లలో ఎకరానికి రూ.1.2 కోట్లు నుంచి రూ.2.2 కోట్ల వరకు పెరిగాయి. ప్రజ్ఞాపూర్ లో చదరపు గజానికి రూ.15,000-28,000 వరకు ధరలు నమోదయ్యాయి.
25
ప్రజ్ఞాపూర్‌లో భూముల ధరలు పెరుగుతాయా?
Image Credit : Google Gemini AI

ప్రజ్ఞాపూర్‌లో భూముల ధరలు పెరుగుతాయా?

ప్రజ్ఞాపూర్ పరిసరాల్లో ఇప్పటికే భూముల రేట్లు స్థిరంగా పెరుగుతున్నాయి. రాబోయే రైలు మార్గం ఈ ప్రాంతానికి చేరువ‌లో ఉండ‌డంతో ధ‌ర‌లు మరింత పెరిగే అవకాశముంది. గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న మౌలిక స‌దుపాయాలు హైద‌రాబాద్‌కు క‌నెక్టివిటీ, ఇక్క‌డ ఉన్న కంపెనీలు వంటివి ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ పెరుగుదలకు ఊత‌మివ్వ‌నున్నాయి. రియల్ ఎస్టేట్ ఈగురూ అనే రియల్ ఎస్టేట్ ఈ పేపర్ తెలిపిన వివరాల ప్రకారం. గజ్వేల్ ప్రాంతంలో భూమి ధరలు గత రెండేళ్లలో ఎకరానికి రూ.1.2 కోట్లు నుంచి రూ.2.2 కోట్ల వరకు పెరిగాయి. ప్రజ్ఞాపూర్ లో చదరపు గజానికి రూ.15,000-28,000 వరకు ధరలు నమోదయ్యాయి.

Related Articles

Related image1
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే
Related image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
35
మెట్రో కనెక్టివిటీతో ప్రయాణం సులభం
Image Credit : Google Gemini AI

మెట్రో కనెక్టివిటీతో ప్రయాణం సులభం

హైదరాబాద్‌లో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అలాగే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న రాజీవ్ ర‌హ‌దారిని కూడా విస్త‌రించే ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. ఈ కార‌ణంగా గ‌జ్వేల్‌-ప్ర‌జ్ఞాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా సులభంగా రాకపోకలు చేయగలుగుతారు. ఇది కూడా ఈ ప్రాంతంలో భూముల విలువ పెర‌గ‌డానికి ఒక కార‌ణంగా చెప్పొచ్చు.

45
కంపెనీల విస్తరణకు అవకాశాలు
Image Credit : Google Gemini AI

కంపెనీల విస్తరణకు అవకాశాలు

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ (ORR), రీజియన్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కంపెనీలు స్థాపనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విస్తరణ గజ్వేల్ ప్రాంతానికి మల్టీపుల్ ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు తీసుకురావడంతో పాటు, భూముల విలువను కూడా పెంచబోతోంది.

55
పెట్టుబడిదారులకు గజ్వేల్ ఎందుకు బెస్ట్?
Image Credit : Google Gemini AI

పెట్టుబడిదారులకు గజ్వేల్ ఎందుకు బెస్ట్?

అత్యంత తక్కువ ధరల్లో ఇప్పుడే భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాబోయే రవాణా ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ కంపెనీల విస్తరణ కలిపి చూస్తే గజ్వేల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వ‌చ్చే ఐదేళ్ల‌లో భారీగా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ప్రధాన హాట్‌స్పాట్‌గా మారనుందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది లాభ, నష్టాలతో కూడుకున్న అంశం. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఈ రంగంలో నిపుణులను సంప్రదించడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
స్థిరాస్తి
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే
Recommended image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved