MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే

Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే

Google Data Center: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను టెక్ రంగంలో అగ్ర‌గామిగా నిలుపుతాం.. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నాయుడు చెప్పిన మాట ఇది. తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే ఈ దిశ‌గా వేగంగా అడుగులు ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 31 2025, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కీల‌క పరిణామం
Image Credit : Google Gemini AI

సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కీల‌క పరిణామం

ఐటీ శాఖ‌మంత్రి నారా లోకేష్ ఇటీవ‌ల సింగ‌పూర్ పర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం గూగుల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. వార్తా సంస్థ రాయిట‌ర్స్ ఇందుకు సంబంధించి ఒక కీల‌క క‌థ‌నాన్ని అందించింది.

DID YOU
KNOW
?
రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు
గూగుల్ విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ కోసం సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చుచేయనుంది. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
25
విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ప్రణాళిక
Image Credit : Google Gemini AI

విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ప్రణాళిక

రాయిటర్స్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం, అమెరికా వెలుపల అతి పెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖలో నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1 గిగావాట్‌గా ఉండనుంది. దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి (భారత కరెన్సీ ప్రకారం సుమారు 50 వేల కోట్ల రూపాయలు)తో దీనిని నిర్మించ‌నున్నారు. ఇందులో 2 బిలియన్ డాలర్లు కేవలం పునర్వినియోగ విద్యుత్‌ (రిన్యూవబుల్ ఎనర్జీ) కేంద్రాల అభివృద్ధికి వినియోగించనున్నారు.

లోకేష్ సింగపూర్ టూర్..
గూగుల్ నుంచి గుడ్ న్యూస్..
విశాఖలో 1GW డేటా సెంటర్ 

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో గూగుల్ క్లౌడ్ డైరక్టర్‌తో భేటీ సత్ఫలితాలను ఇస్తోంది. సింగపూర్ టూర్ ముగించుకుని లోకేష్ తిరుగు ప్రయాణంలో ఉండగా... గూగుల్ గుడ్ న్యూస్ బయటకు… pic.twitter.com/SdlwL3Bon4

— Telugu Desam Party (@JaiTDP) July 30, 2025

Related Articles

Related image1
MLA Disqualification: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోతుందా.? ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సంచ‌ల‌న తీర్పు.
Related image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
35
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రత్యేకతలు
Image Credit : Google Gemini AI

ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రత్యేకతలు

విశాఖలో రూపుదిద్దుకోబోయే ఈ సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా, అమెరికా వెలుపల అత్యంత భారీ డేటా మౌలిక సదుపాయంగా గుర్తింపు పొందనుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో కొనసాగుతున్న గూగుల్ డేటా నెట్‌వర్క్ విస్తరణలో ఇది కీలక భాగమవుతుందని సమాచారం.

45
కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ప్రాధాన్యం
Image Credit : Getty

కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ప్రాధాన్యం

డేటా సెంటర్ పనితీరుకు అనుగుణంగా మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను విశాఖలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సముద్ర గర్భ కేబుళ్ల ద్వారా వచ్చే డేటాను స్వీకరించి నిల్వ చేయడానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. ప్రస్తుత ముంబై సదుపాయాల కంటే రెండింతల సామర్థ్యంతో వీటిని నిర్మించాల‌ని ల‌క్ష్యంతో ఉన్నారు. భవిష్యత్తులో 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరాన్ని అంచనా వేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

55
టెక్ హబ్‌గా మారుతున్న మధురవాడ
Image Credit : gemini

టెక్ హబ్‌గా మారుతున్న మధురవాడ

మధురవాడ పరిసరాల్లో 500 ఎకరాల టెక్నాలజీ క్లస్టర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గూగుల్ ఇప్పటికే ఇక్కడ 80 ఎకరాలు సొంతం చేసుకుంది. ఆనందపురం–భీమిలి ప్రాంతంలో భారీ AI క్యాంపస్ ఏర్పాటు ప్రణాళికలో ఉంది. భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం లాజిస్టిక్స్ దృష్ట్యా అనుకూలంగా ఉంది. ఈ పెట్టుబడి దేశంలో మౌలిక సదుపాయాల రంగంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image2
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Recommended image3
ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
Related Stories
Recommended image1
MLA Disqualification: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోతుందా.? ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సంచ‌ల‌న తీర్పు.
Recommended image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved