MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • MLA Disqualification: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోతుందా.? ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సంచ‌ల‌న తీర్పు.

MLA Disqualification: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోతుందా.? ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సంచ‌ల‌న తీర్పు.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం దేశ అత్యున్న‌త న్యాయం స్థానం దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 31 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడు నెలల్లో అనర్హతపై స్పీకర్ నిర్ణయం తప్పనిసరి
Image Credit : Asianet News

మూడు నెలల్లో అనర్హతపై స్పీకర్ నిర్ణయం తప్పనిసరి

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో పరిష్కరించాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

25
అస‌లు వివాదం ఏంటి.?
Image Credit : ANI

అస‌లు వివాదం ఏంటి.?

2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు వీరిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరినా, స్పందన లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

Related Articles

Related image1
Trump Tariff India: భార‌త్ పాకిస్థాన్‌పై ఆధార‌ప‌డే రోజు వ‌స్తుందా.? ట్రంప్ కుట్ర‌, అస‌లేం జ‌రుగుతోంది.?
Related image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
35
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు
Image Credit : X-@TheScribeNow

హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు

2024 ఏప్రిల్‌లో హైకోర్టులో మొదలైన ఈ న్యాయపోరాటం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌ను షెడ్యూల్ ఖరారు చేయమని ఆదేశించగా, ఆ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అనంతరం బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2025 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన వాదనల అనంతరం జూలై 31న తుది తీర్పు వెలువడింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

3 నెలల్లో 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశం....

ఈ రోజు నుండి 90 రోజులు సరిగ్గా... pic.twitter.com/6EXe2a80t1

— Dharani (@DharaniBRS) July 31, 2025

45
“ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్” విధానం సరికాదు: ధర్మాసనం వ్యాఖ్య
Image Credit : ANI

“ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్” విధానం సరికాదు: ధర్మాసనం వ్యాఖ్య

తీర్పు వెలువరిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వలన ఫిరాయింపుదారులకు లాభం చేకూరుతుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. “ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఇక జరగకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆలస్యం జరిగితే పార్టీలు అన్యాయానికి గురవుతాయని, ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమగ్ర చట్టం తీసుకురావాలని సూచించింది.

55
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ
Image Credit : Telangana Assembly Official Website

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అసెంబ్లీలో బలాబలాల విషయంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు అటు ఇటు అయినా ప్రభుత్వంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడినా కాంగ్రెస్ కు సంఖ్యా పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని మరికొందరు అంటున్నారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
Trump Tariff India: భార‌త్ పాకిస్థాన్‌పై ఆధార‌ప‌డే రోజు వ‌స్తుందా.? ట్రంప్ కుట్ర‌, అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved