MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రతీ టీచర్ చదవాల్సిన వార్త ఇది.. పదో తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్‌లో విస్తుపోయే విష‌యాలు

ప్రతీ టీచర్ చదవాల్సిన వార్త ఇది.. పదో తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్‌లో విస్తుపోయే విష‌యాలు

Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. ఆత్మ‌హ‌త్య‌కు ముందు కుర్రాడు రాసిన లెట‌ర్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 21 2025, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీచర్ల వేధింపులే కార‌ణ‌మా.?
Image Credit : Generated by google gemini AI

టీచర్ల వేధింపులే కార‌ణ‌మా.?

ఢిల్లీలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న షార్యా పాటిల్ అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న కలిగించింది. సూసైడ్ లెట‌ర్‌లో స్కూల్‌లో టీచర్లు చేస్తున్న మానసిక వేధింపులే తన నిర్ణయానికి కారణమ‌ని రాసుకొచ్చాడు. ఈ విషయం బయటకు రాగానే, సెంట్ కొలంబా స్కూల్ హెడ్‌మాస్టర్‌తో పాటు ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు

24
ఆత్మహత్యా లేఖలో ఏం ఉంది.?
Image Credit : Asianet News

ఆత్మహత్యా లేఖలో ఏం ఉంది.?

పోలీసులకు లభించిన స్కూల్ బ్యాగ్‌లో సూసైడ్ లెట‌ర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ లెట‌ర్‌లో తనపై స్కూల్‌లో జరుగుతున్న అవమానాలు, టీచర్లు చేస్తున్న మానసిక వేధింపులు, తనను తరచూ అందరి ముందు అవమానించటం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే, ఇలాంటి బాధ మరెవరికీ రాకూడదని టీచర్లపై చర్య తీసుకోవాలి అని కూడా బాలుడు రాసిన‌ట్లు స‌మాచారం.

Related Articles

Related image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Related image2
అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
34
సంఘటన ఎలా జరిగింది?
Image Credit : Getty

సంఘటన ఎలా జరిగింది?

నవంబర్ 18న షౌర్యా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లాడు. అయితే కొద్దిసేపటికే దిల్లీ మెట్రో రైలుకు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తొలుత ప్ర‌మాదంగా భావించినా ఆ త‌ర్వాత బాలుడి స్కూల్ బ్యాగ్‌లో ఉన్న లెట‌ర్ చూసిన త‌ర్వాత ఆత్మ‌హ‌త్య అనే విష‌యం తెలిసింది.

44
తండ్రి ఆవేద‌న‌..
Image Credit : unsplash

తండ్రి ఆవేద‌న‌..

విద్యార్థి తండ్రి ప్రదీప్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఏడాది నుంచి టీచ‌ర్లు త‌న కుమారుడిని అవమానిస్తున్నార‌ని ఆరోపించారు. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా తిట్టే వార‌ని, అందరి ముందు అవమానిస్తూ మానసికంగా బాధ పెట్టార‌న్నారు. స్కూల్‌లో ఫిర్యాదు చేసినా మార్పు లేదని, కంప్లైట్ ఇచ్చిన త‌ర్వాత వేధింపులు మ‌రింత ఎక్కువ‌య్యాయ‌ని అన్నారు. ఆత్మహత్య జరిగిన రోజున, స్టేజ్‌పై డాన్స్ ప్రాక్టీస్‌లో జారిపడగా టీచర్లు అందరి ముందు అతడిని తీవ్రంగా నిందించారని బాలుడి తండ్రి ఆరోపించారు.

గ‌మ‌నిక‌: ఈ విశ్వంలో అన్నింటికంటే విలువైంది ఏదైనా ఉందంటే అది ప్రాణ‌మే. జీవితంలో క‌ష్టాలు, అవ‌మానాలు లాంటివి ఎదురు కావ‌డం చాలా సాధార‌ణం. అంత‌దానికి జీవితాన్ని ముగించాల‌నుకోవ‌డం మూర్ఖులు చేసే ప‌ని. ఎంత‌టి క‌ష్టాన్నైనా క‌ష్టంతో ఎదురించాలి. అప్పుడే విజయం సాధిస్తాం. జీవితానికి అస‌లైన అర్థం జీవించ‌డం మాత్ర‌మే. ఆ త‌ర్వాతే గెలుపోట‌ములు అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 డేటా సెంటర్ పార్కులు, ఎక్కడో తెలుసా?
Recommended image2
Bank Strike : గురువారం బ్యాంకులు బందా..? నడుస్తాయా?
Recommended image3
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Related Stories
Recommended image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Recommended image2
అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved