MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డ‌నున్న కొత్త అల్ప‌పీడ‌నం ఏర్ప‌డ‌నుంద‌ని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరిక జారీ చేసింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 20 2025, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలు
Image Credit : AI Gemini

బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎల్లుండి నాటికి అల్పపీడనంగా మార‌నుంద‌ని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనా వేసింది.

25
వాయుగుండం మరింత బలపడే అవకాశం
Image Credit : Generated by google gemini AI

వాయుగుండం మరింత బలపడే అవకాశం

అల్పపీడనం ముందుకు కదులుతున్నకొద్దీ దాని తీవ్రత పెరిగి, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత శక్తివంతమైన వాయుగుండంగా మారవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుసంధానంగా వాతావరణం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Related Articles

Related image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Related image2
కాలు మీద కాలు వేసుకొని బిందాస్‌గా ఉండొచ్చు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 3.7 ల‌క్ష‌లు మీ సొంతం
35
నవంబర్ 27–29 మధ్య భారీ వర్షాలు
Image Credit : Generated by google gemini AI

నవంబర్ 27–29 మధ్య భారీ వర్షాలు

ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని విపత్తుల సంస్థ తెలిపింది. మూడు రోజుల పాటు మబ్బులు కమ్మి, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

45
రైతులకు సూచనలు
Image Credit : Asianet News

రైతులకు సూచనలు

వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ పనులను ముందుగానే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా కోతకు సిద్ధమై ఉన్న ధాన్యాన్ని భద్రంగా నిల్వచేసి, ఎండబెట్టే ప్రదేశాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వర్షాలు పండిన ధాన్యానికి నష్టం కలిగించే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

55
అత్యవసర సహాయానికి హెల్ప్‌లైన్ నంబర్లు
Image Credit : social media

అత్యవసర సహాయానికి హెల్ప్‌లైన్ నంబర్లు

వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే ప్రాంతాల ప్రజలు అవసరమైన సమాచారానికి లేదా ఎమర్జెన్సీ సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు: 112, 1070, 1800 425 0101. అలాగే శుక్ర‌వారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా సంస్థ వెల్లడించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Recommended image2
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image3
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related Stories
Recommended image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Recommended image2
కాలు మీద కాలు వేసుకొని బిందాస్‌గా ఉండొచ్చు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 3.7 ల‌క్ష‌లు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved