MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?

Car Burial: కోటిన్నర బెంజ్ కారును మరణించిన వ్యక్తితో పాటూ పాతి పెట్టిన కుటుంబం.. ఎందుకో తెలుసా?

Car Burial: ఒక కుటుంబం చనిపోయిన కుటుంబ సభ్యునితో పాటూ అతను వాడిన కారును కూడ పాతిపెట్టేశారు. కానీ ఈ పని వాళ్లను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. అసలు కారును ఎందుకు పూడ్చిపెట్టారు? ఆ తర్వాత ఏం జరిగింది?

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 19 2026, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వింత అంత్యక్రియలు
Image Credit : @shanghaidaily x

వింత అంత్యక్రియలు

ఇంట్లోని వారు చనిపోయినప్పుడు వారికి ఆ కుటుంబానికి ఎంతో బాధ. అంత్యక్రియల సమయంలో అతడికి ఇష్టమైన ఆహారాలు వడ్డించడం వంటివి చేస్తారు. అలాగే ఇష్టమైన వస్తువులను కూడా పెట్టడం వంటివి చూస్తుంటాం.  చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, చనిపోయిన వ్యక్తితో పాటు అతని కారును పాతిపెట్టి ఓ కుటుంబం చిక్కుల్లో పడింది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. అతనికి కార్లంటే ప్రాణం. ఎంతో కష్టపడి మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నాడు. ఎప్పుడూ అదే కారులో తిరిగేవాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అందుకే అతను చనిపోయాక, కుటుంబ సభ్యులు అతని ఇష్టమైన కారును కూడా పాతిపెట్టారు. 

23
సమాధి పక్కనే కారు
Image Credit : @shanghaidaily

సమాధి పక్కనే కారు

కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని పాతిపెట్టిన ప్రదేశం పక్కనే, సమాధి పక్కనే జేసీబీతో మరో పెద్ద గొయ్యి తవ్వించారు. ఆ తర్వాత కోటిన్నర విలువైన మెర్సిడెస్ బెంజ్ కారుకు అంత్యక్రియలు నిర్వహించారు.  కారుకు ఎర్రటి బట్ట కప్పి, జేసీబీ సాయంతో గుంతలోకి దించి మట్టితో కప్పేశారు. దీన్ని ఎంతో మంది చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఇది వైరల్ గా మారింది.

Related Articles

Related image1
Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Related image2
Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం
33
కోటిన్నర విలువైన కారు
Image Credit : @shanghaidaily

కోటిన్నర విలువైన కారు

పాతిపెట్టిన కారు విలువ కోటిన్నర రూపాయలు కావడంతో ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసింది. వెంటనే వాళ్లు స్మశానానికి చేరుకున్నారు. కారును పాతిపెట్టిన కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకున్నారు. 

స్మశానంలో మృతదేహాలను మాత్రమే ఖననం చేయాలి. మట్టిలో సులభంగా కలిసిపోని వస్తువులను పాతిపెట్టకూడదు. చనిపోయిన వ్యక్తి బట్టలు తప్ప, పర్యావరణానికి హాని కలిగించే ఇతర వస్తువులను పూడ్చడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. కారులోని ఇనుము, ప్లాస్టిక్ భాగాలు మట్టిలో కలవడానికి ఏళ్లు పడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు అధికారులు ఆ కుటుంబాన్ని మందలించారు. దీంతో ఆ కుటుంబం అధికారులకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వీడియోను షేర్ చేయవద్దని.. తాము ఇప్పటికే  మనిషి పోయిన బాధలో ఉన్నామని ఆ కుటుంబం ప్రజలను కోరింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
చైనా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Pressmeet:మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet Telugu
Recommended image2
Now Playing
PM Modi Speech: రౌడీలు, గూండాలు మర్యాదగా లొంగిపోండి బెంగాల్లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
Recommended image3
Now Playing
Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Recommended image2
Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved