Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Lucky dates: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వాళ్లు జీవితంలో ధనవంతులు అవుతారు. సంపద, కీర్తిప్రతిష్టలను సులభంగా సంపాదిస్తారు. మొదట పేదరికంలో పుట్టినా తరువాత విపరీతంగా డబ్బు సంపాదించే వారు ఏ తేదీల్లో పుడతారో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు
ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారు. వీరి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. వీరిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో వీరికి మంచి గౌరవం, ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఎక్కువ. వీళ్లు డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తారు. కాబట్టి వీరు పేదరికంలో పుట్టినా తరువాత ధనవంతులుగా మారుతారు.
రాడిక్స్ సంఖ్య 5
ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. వీరిని పాలించేది బుధ గ్రహం. ఈ తేదీలలో పుట్టిన వాళ్లు చాలా తెలివైన వాళ్లు, మంచిగా మాట్లాడగలరు. వ్యాపార రంగంలో అడుగుపెడితే అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఏదైనా కొత్త విషయాలను చాలా వేగంగా నేర్చుకుంటారు. తమ తెలివితేటలతో బోలెడంత డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక కష్టాలు వీళ్ల దరిదాపుల్లోకి కూడా రావు.
రాడిక్స్ సంఖ్య 6
ఈ నెలలోనైనా 6,15, 24 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 6. ఈ అంకె ఉన్నవారిపై శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే వీరికి విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఈ తేదీలలో పుట్టిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. కళలు, సినిమా, ఫ్యాషన్ రంగాల్లో రాణిస్తారు. ఖరీదైన ఇళ్లు, కార్లు వీరికి సహజంగానే లభిస్తాయి.
రాడిక్స్ సంఖ్య 9
ఈ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. ఈ అంకెను పాలించేది కుజ గ్రహం. ఈ తేదీలలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, పట్టుదల ఉన్నవాళ్లు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే, అది సాధించే వరకు నిద్రపోలేరు. రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో వీరు సంపదను ఆర్జిస్తారు. వీరి ధైర్యమే వీరిని కోటీశ్వరులను చేస్తుంది.

