MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌందర్య మరణం, రజినీకాంత్ భయపడి హిమాలయాలకు వెళ్ళారా.. సరిగ్గా రిలీజ్ కి ముందే వారిద్దరూ..

సౌందర్య మరణం, రజినీకాంత్ భయపడి హిమాలయాలకు వెళ్ళారా.. సరిగ్గా రిలీజ్ కి ముందే వారిద్దరూ..

సౌందర్య మరణించిన తర్వాత రజినీకాంత్ విషయంలో ఊహించని పుకార్లు మొదలయ్యాయి. అసలేం జరిగింది, ఆ పుకార్లు ఎందుకు వచ్చాయి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 28 2025, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

చిత్ర పరిశ్రమలో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. అదే విధంగా నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. తమ విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొన్ని సంచలన పుకార్లు వినిపించాయి. చంద్రముఖి చిత్రం తర్వాత ఈ పుకార్లు వ్యాపించాయి.

25
Image Credit : Film

చంద్రముఖి చిత్రం ముందుగా మలయాళంలో తెరకెక్కింది.ఆ తర్వాత 2004లో ఈ చిత్రాన్ని కన్నడలో ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో సౌందర్య నటించారు. ప్రధాన పాత్రలో కన్నడ స్టార్ విష్ణువర్ధన్ నటించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ కి కొన్ని నెలల ముందు సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Related Articles

Related image1
పవిత్ర లోకేష్, ప్రగతిలని ఒక ప్రాపర్టీ లాగా వాడుకున్నారు..చిరంజీవితో మాత్రమే అలా చేయలేదు, నటి సుధ కామెంట్స్
Related image2
'మిరాయ్' ట్రైలర్ రివ్యూ.. తేజ సజ్జాకి మరో 300 కోట్ల చిత్రం అవుతుందా, పీపుల్ మీడియా జాతకం మారుతుందా ?
35
Image Credit : Twitter

ఆ తర్వాత 2005లో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో చంద్రముఖి చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కానీ ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని పుకార్లు వచ్చాయి. ఆప్తమిత్ర తర్వాత సౌందర్య మరణించడంతో.. రజినీకాంత్ విషయంలో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు.

45
Image Credit : Soundarya

2009లో విష్ణువర్ధన్ ఆప్త మిత్ర చిత్రానికి సీక్వెల్ గా ఆప్తరక్షక్ అనే చిత్రంలో నటించారు. ఇది కూడా చంద్రముఖి పాత్ర ఆధారంగా రూపొందించిన చిత్రమే. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ కి కొన్ని నెలల ముందు హీరో విష్ణువర్ధన్ మరణించారు. సౌందర్య, విష్ణువర్ధన్ మరణాలకు కారణం చంద్రముఖి అంటూ పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ పుకార్లు ఆప్తరక్షక్ చిత్ర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. సినిమాలో కంటెంట్ అంత బాగాలేకపోయినప్పటికీ పుకార్ల వల్ల వచ్చిన పబ్లిసిటీతో సినిమా సూపర్ హిట్ అయింది.

55
Image Credit : IMDB

ఆ సమయంలో రజనీకాంత్ కుటుంబ సభ్యుల సలహాతో మైసూరులో మహా హోమం చేయించారని, హిమాలయాలకు వెళ్లి పూజలు కూడా చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఆత్మ గురించి వచ్చిన వార్తలు మొత్తం అవాస్తవాలే అని ఆప్త మిత్ర చిత్రానికి పనిచేసిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ తేల్చేశారు. మేమంతా ఆ చిత్రానికి పనిచేశాం కదా.. మేము బాగానే ఉన్నాం. కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ రూమర్స్ వచ్చాయి. అంతే కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని స్వర్ణ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆప్త రక్షక్ చిత్రాన్ని తెలుగులో నాగవల్లి పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
సౌందర్య

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Recommended image2
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image3
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Related Stories
Recommended image1
పవిత్ర లోకేష్, ప్రగతిలని ఒక ప్రాపర్టీ లాగా వాడుకున్నారు..చిరంజీవితో మాత్రమే అలా చేయలేదు, నటి సుధ కామెంట్స్
Recommended image2
'మిరాయ్' ట్రైలర్ రివ్యూ.. తేజ సజ్జాకి మరో 300 కోట్ల చిత్రం అవుతుందా, పీపుల్ మీడియా జాతకం మారుతుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved