MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 10 Heroes: విజయ్‌కి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. పడిపోయిన చరణ్‌, పవన్‌.. నెం 1 ఎవరంటే?

Top 10 Heroes: విజయ్‌కి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. పడిపోయిన చరణ్‌, పవన్‌.. నెం 1 ఎవరంటే?

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్‌ 10 హీరోల జాబితా వచ్చింది. మార్చి నెలకు సంబంధించిన ఇండియా టాప్‌ 10 లిస్ట్ లో అల్లు అర్జున్‌.. దళపతి విజయ్‌కి పెద్ద షాక్‌ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2026, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియా టాప్‌ 10 హీరోలు
Image Credit : IBTimes

ఇండియా టాప్‌ 10 హీరోలు

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలో మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాని ప్రకటిస్తుంది. తాజాగా మార్చి నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చింది. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు హీరోలు సత్తా చాటుతున్నారు. విజయ్‌కి అల్లు అర్జున్‌ షాక్‌ ఇవ్వగా, `ధురంధర్‌ 2` హీరో మొదటిసారి ఈ జాబితాలోకి వచ్చారు. టాప్‌ 10లో ఆయన చోటు సంపాదించారు. మరి టాప్‌లో ఎవరున్నారు. టాప్‌ 10 హీరోలు ఎవరనేది చూస్తే.

26
నెంబర్‌ 1 హీరో ప్రభాస్‌
Image Credit : Asianet News

నెంబర్‌ 1 హీరో ప్రభాస్‌

డార్లింగ్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మొదటి స్థానాన్ని మరోసారి కైవసం చేసుకున్నారు. ఆయన ప్రతి నెల టాప్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. తన ఇమేజ్‌, ఫాలోయింగ్‌, భారీ పాన్‌ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్నారు. మార్చిలో కూడా తనే నెంబర్‌ 1గా నిలిచారు.

Related Articles

Related image1
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Related image2
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
36
విజయ్‌కి అల్లు అర్జున్‌ షాక్‌
Image Credit : Asianet News

విజయ్‌కి అల్లు అర్జున్‌ షాక్‌

ఇక ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే విజయ్‌కి పెద్ద షాక్‌ తగిలింది. మార్చి నెలలో మూడో స్థానానికి పడిపోయారు. ఆయన్ని దెబ్బ కొట్టింది ఎవరో కాదు అల్లు అర్జున్‌. ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్‌.. `రాకా` మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ బాగా నడుస్తోంది. దీంతో ఆయన ఇమేజ్‌, ఫాలోయింగ్‌ మరింత పెరిగింది.  విజయ్‌ మూడో స్థానంలో నిలిచారు.

46
ఒక్క మెట్టు ఎక్కిన మహేష్‌ బాబు
Image Credit : youtube/@ColliderInterviews

ఒక్క మెట్టు ఎక్కిన మహేష్‌ బాబు

నాల్గో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు. ఆయన ఎక్కువగా మూడో స్థానంలో నిలుస్తున్నారు. గత ఫిబ్రవరిలో నాల్గో స్థానంలోనే ఉండగా, ఇప్పుడు కూడా అదే స్థానానికే పరిమితమయ్యారు. ఐదో స్థానంలోకి మహేష్‌ బాబు వచ్చారు. ఫిబ్రవరిలో ఆయన ఆరోస్థానానికి పడిపోగా, మళ్లీ ఇప్పుడు పుంజుకున్నారు. మార్చిలో తన సత్తా చాటారు. 

56
రామ్‌ చరణ్‌ స్థానం ఇదే
Image Credit : our own

రామ్‌ చరణ్‌ స్థానం ఇదే

ఇక ఆరో స్థానం రామ్‌ చరణ్‌ దక్కించుకున్నారు. ఆయన ఫిబ్రవరిలో ఐదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఊహించని విధంగా పడిపోయారు. ఆరో స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఏడో స్థానంలో నిలిచారు. `ధురంధర్‌ 2` హీరో రణ్‌వీర్‌ సింగ్‌ టాప్‌ 10లోకి వచ్చాడు. ఆయన ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

66
ఒక్క స్థానం పడిపోయిన ఎన్టీఆర్‌
Image Credit : X/@AmardeepKushw20

ఒక్క స్థానం పడిపోయిన ఎన్టీఆర్‌

తొమ్మిదో స్థానంలో ఎన్టీఆర్‌ ఉన్నారు. ఆయన ఫిబ్రవరిలో ఎనిమిదో స్థానంలో ఉండగా, మార్చిలో డౌన్‌ అయ్యారు. ఇక పదో స్థానంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. ఫిబ్రవరిలో పవన్‌ టాప్‌ 10లో ఉండగా, ఇప్పుడు ఆయన లిస్ట్ లోనే లేరు. అలాగే ఎప్పుడూ లిస్ట్ లో ఉండే అజిత్‌ కూడా ఈ సారి జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇలా ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 హీరోల జాబితాలో ఐదుగురు తెలుగు హీరోలు ఉండగా, ఒక్క కోలీవుడ్‌ హీరో, నలుగురు బాలీవుడ్‌ హీరోలున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
బాలీవుడ్
ప్రభాస్
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి వల్ల 60 లక్షలు నష్టపోయిన నాగబాబు.. కోటి పెడితే కనీసం టీ ఖర్చులు కూడా రాని మెగా మూవీ ఏంటో తెలుసా?
Recommended image2
Dasari Narayana Rao: అప్పట్లో అరటిపళ్లు అమ్మేవాడిని.! ఆకలిని చూశా.. పేదరికాన్ని జయించా..
Recommended image3
జీవితంలో కచ్చితంగా సక్సెస్ కావాలని రూల్‌ ఏం లేదు బాసూ.. పూరీ చెప్పిన జీవిత స‌త్యం
Related Stories
Recommended image1
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Recommended image2
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved