MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి వల్ల 60 లక్షలు నష్టపోయిన నాగబాబు.. కోటి పెడితే కనీసం టీ ఖర్చులు కూడా రాని మెగా మూవీ ఏంటో తెలుసా?

చిరంజీవి వల్ల 60 లక్షలు నష్టపోయిన నాగబాబు.. కోటి పెడితే కనీసం టీ ఖర్చులు కూడా రాని మెగా మూవీ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వల్ల మెగా బ్రదర్ నాగబాబు భారీగా నష్టపోయిన సినిమా ఏదో తెలుసా? దాదాపు కోటి రూపాయిలు బడ్జెట్ పెడితే.. కనీసం టీ ఖర్చులు కూడా కలెక్ట్ చేయని మూవీ ? కమర్షియల్ గా ప్లాప్ అయినా.. జాతీయ అవార్డులు సాధించి మూవీ ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిర్మాతలుగా రాణించిన మెగా హీరోలు..
Image Credit : Instagram/Sai Dharam Tej

నిర్మాతలుగా రాణించిన మెగా హీరోలు..

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. స్వయంకృషితో ఎదిగాడు చిరంజీవి. ఒక్కోమెట్టు ఎక్కుతూ.. మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఆయన తరువాత మెగా బ్రదర్ నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో రాణించారు. నాగబాబు నటుడిగా,నిర్మాతగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ మాత్రంమెగా ఇమేజ్ ను మించి.. అభిమానులను సాధించాడు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. మెగా హీరోలు నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. నాగబాబు, రామ్ చరణ్ , నిహారిక, పవన్ కళ్యాణ్ నిర్మాతలు గా చాలా సినిమాలు చేశారు.

25
మాస్ ఇమేజ్ పక్కన పెట్టి చిరంజీవి నటించిన సినిమా..
Image Credit : our own

మాస్ ఇమేజ్ పక్కన పెట్టి చిరంజీవి నటించిన సినిమా..

చిరంజీవి హీరోగా నాగబాబు కొన్ని సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నాయి.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కమర్షియల్ గా ప్లాప్ అయ్యి.. మూడు జాతీయ అవార్డులు సాధించిన మెగా మూవీ గురించి మీకు తెలుసా? భారీగా నష్టాలు తీసుకొచ్చిన ఈసినిమాకు అంతకు మించిన అభిమానులు ఉన్నారు. మొదటి సారి మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. క్లాస్ హీరోగా.. చిరంజీవి నటించిన ఆమూవీ మరేదో కాదు రుద్రవీణ.

Related Articles

Related image1
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తో పాటు సర్ప్రైజ్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి భారీ అప్ డేట్..
Related image2
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
35
బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన మూవీ..
Image Credit : our own

బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన మూవీ..

అవును నాగబాబు నిర్మాతగా కె.బాలచందర్ డైరెక్షన్ లో తెరెక్కిన ఈమూవీ 1988 మార్చ్ 4న రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీరో ఇమేజ్ కు భిన్నంగా చిరంజీవి చేసిన సినిమా. ప్రొడ్యూసర్ గా నాగబాబు డెబ్యూ మూవీ ఇదే. దాదాపు 80 లక్షల నుంచి కోటి వరకూ బడ్జెట్ తెరకెక్కిన ఈసినిమా.. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు.. బాక్సా ఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. 20 లక్షల కలెక్షన్స్ మాత్రమే సాధించగలిగింది. కానీ సినిమా పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించింది.

45
ప్లాప్ అయినా..నేషనల్ అవార్డ్స్ సాధించిన సినిమా..
Image Credit : our own

ప్లాప్ అయినా..నేషనల్ అవార్డ్స్ సాధించిన సినిమా..

ముఖ్యంగా ఈసినిమా సంగీతం ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. అంటరాని తనం, సంగీత ప్రధానంగా సాగే రుద్రవీణ సినిమాలో చిరంజీవి క్లాస్ లుక్ లో మాస్ ఫైట్స్ తో అలరించాడు. ఈ అద్భుతమైన దృశ్యకావ్యానికి మూడు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఆర్ధికంగా నాగబాబుకు దాదాపు 60 లక్షల వరకూ లాస్ వచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయం లో నిజం ఎంతో మాత్రం తెలియాల్సి ఉంది. అఫీషియల్ గా వారు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించలేదు.  ఆతరువాత సింగిల్ గా ఇలాంటి సినిమాల జోలికి వెళ్లలేదు చిరంజీవి.

55
70 ఏళ్ల వయసులో తగ్గేదిలేదంటున్న చిరు..
Image Credit : Asianet News

70 ఏళ్ల వయసులో తగ్గేదిలేదంటున్న చిరు..

ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ట్రిపుల్ రోల్ చేసిన చిరంజీవి.. అందులో ఒకటి మాస్, మకొకటి పోలీస్ పాత్రలతో పాటు.. మూడోది క్లాస్ క్యారెక్టర్ చేశాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లేదంటున్నాడు. వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకర వరప్రసాద్ సినిమాతో హిట్ కొట్టిన చిరు.. విశ్వంభర మూవీతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. బాబీ డైరెక్షన్ లో మరో సినిమా సెట్స్ పై ఉండగా.. మరి కొన్ని కథలను చిరు వింటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dasari Narayana Rao: అప్పట్లో అరటిపళ్లు అమ్మేవాడిని.! ఆకలిని చూశా.. పేదరికాన్ని జయించా..
Recommended image2
జీవితంలో కచ్చితంగా సక్సెస్ కావాలని రూల్‌ ఏం లేదు బాసూ.. పూరీ చెప్పిన జీవిత స‌త్యం
Recommended image3
విజయ్ - సంగీత మళ్లీ కలిశారా? దళపతి సీఎం అయితే.. ప్రమాణ స్వీకారానికి కలిసే వస్తారా?
Related Stories
Recommended image1
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తో పాటు సర్ప్రైజ్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి భారీ అప్ డేట్..
Recommended image2
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved