- Home
- Entertainment
- జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తో పాటు సర్ప్రైజ్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి భారీ అప్ డేట్..
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తో పాటు సర్ప్రైజ్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి భారీ అప్ డేట్..
ఎన్టీఆర్ సినిమాకోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక వారికోసమే ఎట్టకేలకు ఓ భారీ అప్ డేట్ ను అందించాడు తారక్.. ఓ షాకింగ్ న్యూస్ తో పాటు సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడు.

ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానుల ఎదురు చూపులు..
దేవర సినిమా సక్సెస్ తరువాత ఎన్టీఆర్ నుంచి మంచి సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ సినిమా స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా సరైన అప్ డేట్ ను ఇప్పటి వరకూ అందించలేకపోయారు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు చాలా కోపంగానే ఉన్నారు. భారీ బడ్జెట్ తో.. తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ ను డిఫరెంట్ లుక్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డ్రాగన్ టైటిల్ తో ప్రచారంలో ఉంది.
రెండు సార్లు వాయిదా పడిన సినిమా..
ఇక షూటింగ్ అయిపోతుందిలే.. రిలీజ్ అవుతుందిలే.. అని అభిమానులు అనుకుంటుండగానే.. షాకుల మీద షాకులిస్తున్నారు ప్రశాంత్ నీల్ టీమ్. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల కోసం భారీ సర్ప్రైజ్ తో పాటు.. ఓ షాకింగ్ న్యూస్ కూడా అనౌన్స్ చేశారు. మొదట ఈ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. షూటింగ షెడ్యూల్ లో మార్పులతో 2026 జూన్ 25న విడుదల చేస్తామని ప్రకటించారు.
రిలీజ్ డేట్ వచ్చే ఏడాదికి మార్పు..
అప్పటికీ షూటింగ్ కంప్లీట్ అవుతుందన్న నమ్మకం లేకపోవడంతో మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు టీమ్. ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పేజ్ లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ ముఖం కనిపించకుండా, కేవలం షాడో రూపంలో పవర్‌ఫుల్‌గా చూపించారు.
నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు..
ఈ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈసినిమా రిలీజ్ ను మరో ఏడాది పొడిగించడంతో.. ఈ ఏడాది కూడా తారక్ కనిపించడని తెలిసి అభిమానులు చాలా డిస్సపాయింట్ అవుతున్నారు. మొదట ప్రకటించిన తేదీతో పోలిస్తే దాదాపు సంవత్సరం ఆలస్యమవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏం అద్భుతాలు చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ మార్పుతో నిరాశలో ఉన్నవారి కోసం.. తారక్ మరో సర్ ప్రైజ్ ను కూడా ప్లాన్ చేశాడు.
HIS REIGN… HIS SOIL…
JUNE 11, 2027… IT IS…. #NTRNeelpic.twitter.com/ln9Dq4BFZs— Jr NTR (@tarak9999) April 21, 2026
ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..
తన బర్త్ డే గిప్ట్ గా ఈసినిమాకు సబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మే 20 న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే రోజు గ్లిమ్స్ తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. దాంతో అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. రిలీజ్ డేట్ లేట్ అయినా.. మంచి అప్ డేట్ వస్తున్నందకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే నెక్ట్స్ రిలీజ్ డేట్ వరకూ.. వరుసగా ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్నారు.
భారీగా బరువు తగ్గి షాక్ ఇచ్చిన తారక్..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. KGF, సలార్ వంటి భారీ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్స్ నుంచి విడుదలైన కొన్ని ఫోటోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌లో మార్పులు చేసి, బాడీ పెంచి మరింత పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ.. కాంతారా ఫేమ్.. రుక్మిణి వసంత్ నటిస్తోంది.

