- Home
- Entertainment
- అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?
అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?
అల్లు అర్జున్ హైదరాబాద్ ను వీడబోతున్నాడా? పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. బాలీవుడ్ ఆఫర్లు కూడా వరుసగా వస్తుండటంతో బన్ని మకాం మార్చబోతున్నాడా? ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో ఎక్కడికి షిప్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత..?

అల్లు అర్జున్ తో సినిమా అంటే 1000 కోట్లు ఉండాల్సిందే..?
ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ వేరు. బన్నితో సినిమా అంటే బడ్జెట్ 1000 కోట్లు ఉండాల్సిందే.. సబ్జెక్ట్ పాన్ ఇండియాదై ఉండాల్సిందే. ఆ రేంజ్ ప్రొడ్యూసర్లు అయితేనే ఆయన ఇమేజ్ ను తట్టుకోగలరు. లాభాలు కూడా అంతే మూటగట్టుకుంటారు. ఇక పుష్ప రెండు సినిమాలతో బన్ని రేంజ్ మారిపోయింది. అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ రాకా మూవీ చేస్తున్నాడు.
తమిళ్, హిందీపై బన్ని ఫోకస్..
ఈసినిమా తరువాత లోకేష్ కనకరాజ్ తో మరో భారీ మూవీని బన్నీ సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈమధ్యలోనే బన్ని.. సంజయ్ లీలా బన్సాలితో ఓ మూవీ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. దాంతో అల్లు అర్జున్.. కొన్నేళ్లు.. టాలీవుడ్ మూవీస్ కాకుండా.. బయట మూవీస్ చేయబోతున్నట్టు అర్ధం అవుతోంది. దాంతో తన మాకాం కూడా హైదరాబాద్ నుంచి మార్చబోతున్నారట.
హైదరాబాద్ కు బన్ని బైబై చెప్పబోతున్నాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై హైదరాబాద్‌లో కనిపించరనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి పూర్తిగా ముంబైకి షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనను కలవాలంటే ముంబైకి వెళ్లాల్సిందే అని అంటున్నారు. ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ బర్త్ డేకి అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఆయన ముంబైకి పూర్తిగా షిఫ్ట్ అయితే ఈ సంప్రదాయం మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ముంబయ్ లో ఐకాన్ స్టార్ ఇల్లు కొన్నాడా?
ఇప్పటికే రాకా షూటింగ్ కోసం.. ఎక్కువగా ముంబయ్ లోనే ఉంటున్నాడు అల్లు అర్జున్. అక్కడ ప్లాట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇక వరుసగా బన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే ఆలోచనలో ఉన్నాడని.. అందుకే పూర్తిగా ముంబయ్ కి మారే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్స్ అంతా సౌత్ వైపు చూస్తుంటే.. అల్లు అర్జున్ బాలీవుడ్ వెళ్లి ఏం చేస్తారనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
ముంబయ్ నుంచే చక్రం తిప్పబోతున్న అల్లు అర్జున్..
ముంబైపై అల్లు అర్జున్‌కు మొదటి నుంచే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి వాతావరణం, జీవనశైలి ఆయనకు నచ్చిన కారణంగా ఎప్పటికైనా అక్కడ స్థిరపడాలనే లక్ష్యం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ కూడా ముంబైకి వెళ్లనున్నారని సమాచారం. రాకా మూవీ తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ముంబై పరిసరాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ తో బన్ని..
అదేవిధంగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తే.. అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ముంబైలోనే జరగనుంది కాబట్టి.. ఫ్యామిలీతో అక్కడికే వెళ్లాలని ఆయన నిర్ణించుకున్నారని టాక్. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది.
రాకా లుక్ తో రచ్చ రచ్చ చేసిన బన్ని..
ఈమధ్య అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ మూవీ నుంచి రాకా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఊహకి అందని విధంగా ఉంది. ఫస్ట్ లుక్ లో బన్నీ వింత జంతువు తరహాలో కనిపించాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా డెడికేషన్ తో పనిచేస్తున్నాడు.
స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ ఆ పేరుకు పూర్తి భిన్నంగా ఫస్ట్ లుక్ లో బట్టతల, భయంకరమైన చేతులు, గోర్లతో కనిపించాడు. రాకా మూవీ స్పేస్ సైన్స్, ఫిక్షనల్ అంశాలతో రూపొందుతోంది అని గతంలో వార్తలు వచ్చాయి. అంటే బన్నీ ఈ మూవీలో ఏలియన్ తరహా పాత్ర పోషిస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఫస్ట్ లుక్ తో అందరిలో క్యూరియాసిటీ మరింతగా పెంచాడు అల్లు అర్జున్.

