MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • సాయి పల్లవి కళ్లు చెదిరే రెమ్యునరేషన్, రజినీకాంత్ సినిమా కోసం ఎంత తీసుకుంటుందంటే?

సాయి పల్లవి కళ్లు చెదిరే రెమ్యునరేషన్, రజినీకాంత్ సినిమా కోసం ఎంత తీసుకుంటుందంటే?

Sai Pallavi Remuneration : సైలెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సాయి పల్లవి. ఎటువంటి హడావిడి లేకుండా భారీ సినిమాలు చేసుకుంటూ.. వెళ్తోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట తండేల్ భామ. రజినీకాంత్ సినిమా కోసం ఎంత తీసుకుంటుందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకుపోతున్న సాయి పల్లవి
Image Credit : facebook.com/SaiPallavi.S

దూసుకుపోతున్న సాయి పల్లవి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా.. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా సాయిపల్లవి పేరుమాత్రమే వినిపిస్తుంది. టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ తో దూసుకుపోతోన్న ఈ హీరోయిన్.. ఎవరితో పోటీ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పెద్దగా టెక్షన్ తీసుకోకుండా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ.. క్రేజ్ ను కొనసాగిస్తోంది. యాక్టింగ్, డాన్స్, గ్లామర్ విషయంలో తగ్గేదే లేదంటోంది సాయి పల్లవి. హిట్ లేదా ఫ్లాప్‌ తో సంబంధం లేకుండా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది.

25
సీత పాత్రలో సాయి పల్లవి
Image Credit : facebook.com/SaiPallavi.S

సీత పాత్రలో సాయి పల్లవి

ఈ ఏడాది టాలీవుడ్‌లో రిలీజ్ అయిన తండేల్ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సాయి పల్లవి కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో భారీ స్థాయిలో, రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయన్ సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related Articles

Related image1
అప్పుడే ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా, రెండో రోజు రామ్ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Related image2
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
35
రజినీకాంత్ సినిమాలో సాయి పల్లవి
Image Credit : facebook.com/SaiPallavi.S

రజినీకాంత్ సినిమాలో సాయి పల్లవి

ఇక తాజాగా సాయి పల్లవి ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరినట్టు ఫిల్మ్ ఇండస్టరీలో టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ నిర్మాణంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్‌లో నిర్మించబోతున్న ఈసినిమాకు ముందుగా సుందర్ సి డైరెక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్‌ నుంచి తప్పకున్నట్టు తెలిసింది. ఇక ఈమూవీని పార్కింగ్ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ.. దాదాపు బాలకృష్ణన్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

45
సాయి పల్లవి పాత్ర చాలా ప్రత్యేకం
Image Credit : facebook.com/SaiPallavi.S

సాయి పల్లవి పాత్ర చాలా ప్రత్యేకం

ఇక ఈసినిమాకు సబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో సాయి పల్లవిని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సాయి పల్లవి కథ, పాత్ర బలం ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది. కథ బాగోలేకపోయినా, హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకుపోయినా.. ఆమె సినిమాలు చేయదు. ఎంత పెద్ద హీరో అయినా.. ఆసినిమాను రిజెక్ట్ చేస్తుంది సాయిపల్లవి. అయితే ఈసినిమా కథ నచ్చడంతో పాటు, సాయి పల్లవి పాత్ర కూడా నచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

55
సాయి పల్లవికి భారీగా రెమ్యునరేషన్
Image Credit : facebook.com/SaiPallavi.S

సాయి పల్లవికి భారీగా రెమ్యునరేషన్

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం సాయి పల్లవికి ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సీనియర్లుగా వెలుగు వెలుగుతున్న నయనతార, త్రిష, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇంత భారీ పారితోషికం అందుకోవడంలేదు. సాయి పల్లవి బ్రాండ్ వాల్యూ.. ఆమె ఫ్యాన్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడలేదనేది ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే.. కమల్ టీమ్.. సాయి పల్లవి విషయం నిజమో కాదో అనౌన్స్ చేసే వరకూ వేచి చూడాల్సిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
అప్పుడే ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా, రెండో రోజు రామ్ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image2
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved