MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?

పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?

తెలుగులో చిన్న హీరోలు, పెద్ద హీరోలందరితో సినిమాలు చేసిన రాజమౌళి.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఇక వీరి కాంబోలో సినిమాలు రావడం కష్టమేనా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2025, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళితో సినిమా అంటే పండగే
Image Credit : facebook.com/AlluArjun

రాజమౌళితో సినిమా అంటే పండగే

రాజమౌళితో సినిమా అంటే ఏహీరోకి అయినా పండగే... ఎందుకంటే జక్కన్న సినిమా చేసిన తరువాత ఆ హీరో రేంజ్ ఎక్కడికో వెళ్తిపోతుంది మరి. ప్రస్తుతం పాన్ఇండియా సినిమాల ఊపులో ఉన్న రాజమౌళి.. టాలీవుడ్ లో దాదాపు టప్ స్టార్స్ అందరితో సినిమాలు చేశాడు. కానీ తెలుగులో టైర్ 1 హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రమే జక్కన్న సినిమాలు రాలేదు. చిన్న హీరోలు అయిన నానీ, నితిన్, సునిల్ తో కూడా మూవీస్ చేసిన రాజమౌళి.. అంత పెద్ద స్టార్స్ అల్లు అర్జున్, పవన్ తో ఎందుకు సినిమాలు చేయలేకపోయాడు.

25
పవన్ - రాజమౌళి కాంబోలో మిస్సైన సినిమా?
Image Credit : facebook.com/powerstarpawankalyan

పవన్ - రాజమౌళి కాంబోలో మిస్సైన సినిమా?

రాజమౌళి సినిమా చేయని స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. చిరంజీవి కూడా చరణ్ మగధీర సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి.. రాజమౌళి సినిమాలో నటించాను అనిపించుకున్నారు. అయితే పవర స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని రాజమౌళి ప్రయత్నించాడట. పవన్ కళ్యాణ్ కోసం రాజమౌళి ఓ కథను కూడా రాసుకున్నాడట. ఈ కథను పవన్  కు వినిపించాడట కూడా రాజమౌళి. వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్న టైమ్ లోనే.. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వచ్చిందట. రాజమౌళితో సినిమా అంటే చాలా టైమ్ కేటాయించాల్సి వస్తుంది. అటు పాలిటిక్స్ ను.. ఇటు జక్కన్న సినిమాను మెయింటేన్ చేయడం కష్టం కాబట్టి.. ఈసినిమా సెట్స్ వరకూ వెళ్లలేదని తెలుస్తోంది. కానీ విరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే.. అది వేరే లెవల్లో ఉండేది. పవర్ స్టార్ అభిమానులకు ఈ కాంబినేషన్ ఓ లోటుగానే ఉండిపోయింది.

Related Articles

Related image1
అల్లు అర్జున్ తాతను జీవితాంతం వెంటాడిన సూపర్ స్టార్ కృష్ణ పాట ఏదో తెలుసా?
Related image2
చిరంజీవి మీద పిచ్చి ప్రేమతో.. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
35
అల్లు అర్జున్ కు కథ చెప్పిన జక్కన్న
Image Credit : facebook.com/AlluArjun

అల్లు అర్జున్ కు కథ చెప్పిన జక్కన్న

ఇక రాజమౌళి కాంబినేషన్ లో అభిమానులు  ఎక్స్ పెక్ట్ చేసిన మరో హీరో అల్లు అర్జున్. జక్కన్న , బన్నీ కాంబోలో ఇంత వరకూ సినిమా ఎందుకు రాలేదు అని అందరికి ఉన్న అనుమానమే. కానీ వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది. అది కూడా అనుకోని కారణాల వల్ల ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో వినిపించిన వార్తల ప్రకారం.. అల్లు అర్జున్, అజిత్ తో కలిపి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నాడట. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. అంతే కాదు అల్లు అర్జున్ కోసం రాజమౌళి ఓ కథను కూడా వినిపించాడని.. కానీ అది నచ్చక బన్నీ రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ టాక్. ఆతరువాత వీరి కాంబోకు ఎక్కడా స్కోప్ దొరకలేదు

45
రాజమౌళితో ఇద్దరు హీరోల సినిమాలకు ఛాన్స్ ఉందా?
Image Credit : facebook.com/AlluArjun

రాజమౌళితో ఇద్దరు హీరోల సినిమాలకు ఛాన్స్ ఉందా?

రాజమౌళితో పవన్, బన్నీ సినిమాలకు ఛాన్స్ ఉందా అంటే.. పవన్ తో ఇక కష్టమనే చెపాలి. ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం పనిపాలనలో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా.. రాజమౌలి ప్రాజెక్ట్ లకు కేటాయించేంత టైమ్ ఆయన దగ్గర ఉండదు. సో ఇక పవర్ స్టార్ సినిమాలు చేసినా.. జక్కన్నతో మాత్రం కష్టం. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అట్లీ మూవీతో పాన్ వరల్డ్ ను టచ్ చేయాలని ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. సో ఫ్యూచర్ లో బన్నీతో రాజమౌళి సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు కలుస్తుందా అని అభిమానులు  ఎదురు చూడాల్సిందే.

55
వారణాసి పై భారీ అంచనాలు.
Image Credit : facebook.com/SSRajamouli

వారణాసి పై భారీ అంచనాలు.

ప్రస్తుతం మహేష్ బాబు తో పార్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. వారణాసి టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి హాలీవుడ్ ను జక్కన్న గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు టీమ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
పవన్ కళ్యాణ్
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ తాతను జీవితాంతం వెంటాడిన సూపర్ స్టార్ కృష్ణ పాట ఏదో తెలుసా?
Recommended image2
చిరంజీవి మీద పిచ్చి ప్రేమతో.. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved