MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?

Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?

ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా ఉండబోతోంది. సీజన్ 9 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. సీజన్ 10 పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారట టీమ్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 18 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షో..
Image Credit : instagram.com/bigbossverse

బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షో..

తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. నిజానికి ఈ కాన్సెప్ట్ మనది కాదు... హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి.. తెలుగు తెరపైకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. వచ్చీ రావడంతోనే ఫస్ట్ సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బిగ్ బాస్... ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

26
భారీ స్థాయిలో బిగ్ బాస్ సీజన్ 10
Image Credit : Youtube/Star Maa

భారీ స్థాయిలో బిగ్ బాస్ సీజన్ 10

ఈసారి ఆడియన్స్ ను మరింతగా ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ టీం సీజన్ 10ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా ‘అగ్ని పరీక్ష’ పెట్టి.. కొంత మంది సామాన్యులకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే త్వరలో అగ్నిపరీక్ష 2 ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.

Related Articles

Related image1
Now Playing
Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
Related image2
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
36
బిగ్ బాస్ 10 లోకి సింగర్ మంగ్లీ..?
Image Credit : Asianet News

బిగ్ బాస్ 10 లోకి సింగర్ మంగ్లీ..?

గత 9 సీజన్లలో లేనంత రేంజ్ లో సెలబ్రిటీలను ఈ సీజన్ లోకి తీసుకునేందుకు ట్రై చేస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యునరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 9 బ్లాక్ బస్టర్ అవ్వడం.. బిగ్ బాస్ టీమ్ లో ఉత్సాహం రెట్టింపుఅయ్యింది. దాంతో ఈసారీ సీజన్ ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. 

ఈక్రమంలోనే పలువురు ప్రముఖులను ఇప్పటికే సంప్రదించినట్టు సమాచారం. అందులో ఫోక్ సింగర్ మంగ్లీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. జానపద పాటలతో ఉర్రూతలూగించిన మంగ్లీ.. సినిమా పాటలతో మరింత పాపులర్ అయ్యింది. యూత్ లో భారీగా ఫాలోయింగ్ కూడా సాధించింది.

46
భారీ వివాదంలో సింగర్ మంగ్లీ.
Image Credit : instagram/@iammangli

భారీ వివాదంలో సింగర్ మంగ్లీ.

మంగ్లీ ఎంత పాపులర్ అయ్యిందో.. అంత కాంట్రవర్సీలను కూడా మూటగట్టుకుంది. గతంలో చిన్న చిన్న వివాదాలు మాత్రమే మంగ్లీ ఫేస్ చేసింది. కానీ ఆసారి 10 కోట్ల స్కాం ఆరోపణలతో పాటు.. హత్యా ప్రయత్నం కేసు కూడా ఉండటంతో.. మరింత చిక్కుల్లో పడింది మంగ్లీ. అయితే బిగ్ బాస్ టీమ్ ముందు నుంచే మంగ్లీ పేరును పరిశీలిస్తోందట. ఆమె హౌస్ లో ఉంటే సీజన్ అంతా రసవత్తరంగా సాగుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ బిగ్ బాస్ 10 స్టార్ట్ అయ్యే వరకూ.. మంగ్లీ పై ఉన్న కేసు ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

56
మంగ్లీ రెమ్యునరేషన్ ఎంత?
Image Credit : instagram

మంగ్లీ రెమ్యునరేషన్ ఎంత?

అయితే గత రెండు మూడు సీజన్‌లుగా వివాదాస్పద వ్యక్తులను కూడా కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ టీమ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగ్లీని తీసుకోవడం వల్ల షో సూపర్ సక్సెస్ అవుతుందని టీమ్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ షోలో పాల్గొనేందుకు మంగ్లీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారానికి రూ.5 లక్షల వరకూ అడుగుతుందట. ఒకవేళ ఆమె 15 వారాల పాటు హౌస్‌లో కొనసాగితే మొత్తం రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

66
బిగ్ బాస్ టీమ్.. మంగ్లీ మధ్య చర్చలు?
Image Credit : Asianet News

బిగ్ బాస్ టీమ్.. మంగ్లీ మధ్య చర్చలు?

ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ విషయంలో బిగ్ బాస్ టీమ్ కు.. మంగ్లీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఎవరు ప్రకటించలేదు కూడా. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. మరి నిజంగా మంగ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతోందా? మంగ్లీ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ ఎలా మారబోతోంది. చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Love And War: విజువల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న రణ్‌బీర్‌, వీక్కీ కౌశల్‌, అలియా మూవీ.. లవ్‌ అండ్‌ వార్‌ రిలీజ్‌ డేట్‌
Recommended image2
SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే
Recommended image3
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Related Stories
Recommended image1
Now Playing
Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
Recommended image2
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved