MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే

SPB Ilaiyaraaja: ఈ పాట రికార్డింగ్‌ అయ్యాక ఇళయరాజాను ముద్దుపెట్టుకున్న ఎస్పీబాలు.. అసలేం జరిగిందంటే

కిళక్కు వాసల్ సినిమాలోని 'పచ్చమల పూవు' పాట ఓ అద్భుతం. ఇళయరాజా, ఆర్.వి. ఉదయకుమార్, ఎస్పీబీ కాంబోలో వచ్చిన ఈ క్లాసిక్ సాంగ్.. రికార్డింగ్ అయ్యాక సాక్షాత్తూ బాలునే కదిలించింది. ఆయన్ను అంతగా భావోద్వేగానికి గురిచేసిన ఆ పాట వెనుక కథేంటో చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 18 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎస్పీ బాలు తన గాత్రంతో మాయ చేసిన పాట
Image Credit : our own

ఎస్పీ బాలు తన గాత్రంతో మాయ చేసిన పాట

కొన్ని పాటలు వింటుంటే సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. 'పచ్చమల పూవు, నీ ఉచ్చిమల తేను' అలాంటి పాటే. సంగీతం, సాహిత్యం, గాత్రం.. ఈ మూడూ కలిసి చేసిన మ్యాజిక్ ఇది. 40,000కు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలునే ఈ పాట మాయలో పడిపోయారంటే దాని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
26
కార్తీక్‌, రేవతి జంటగా `కిళక్కు వాసల్‌` మూవీ
Image Credit : Asianet News

కార్తీక్‌, రేవతి జంటగా `కిళక్కు వాసల్‌` మూవీ

1990లో వచ్చిన 'కిళక్కు వాసల్' సినిమాకు ఆర్.వి. ఉదయకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీక్‌, రేవతి జంటగా నటించారు. ఈ తమిళ మూవీ పల్లెటూరి జీవితం, ప్రేమ, సామాజిక నేపథ్యాన్ని సహజంగా చూపించింది. ఈ సినిమాలోని అన్ని పాటలూ హిట్టయినా, 'పచ్చమల పూవు' మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Related Articles

Related image1
బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?
Related image2
VD-Shouryuv: విజయ్‌ దేవరకొండ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్.. ఇలాంటి పోస్టర్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు
36
పల్లెటూరి ప్రేమని మనసుకి హత్తుకునేలా చేసిన పాట
Image Credit : Asianet News

పల్లెటూరి ప్రేమని మనసుకి హత్తుకునేలా చేసిన పాట

ఈ పాట బలం దాని సాహిత్యంలోని సింప్లిసిటీ, డెప్త్. దర్శకుడు ఆర్.వి. ఉదయకుమారే రాసిన ఆ పాటలోని పదాలు  పల్లెటూరి ప్రేమను నేరుగా మనసులోకి తీసుకెళ్తాయి. 'పచ్చమల పూవు' అనే మొదటి లైన్‌తోనే ప్రకృతి, ప్రేమ కలిసిన ఫీలింగ్ కలుగుతుంది.

46
మ్యాజిక్‌ చేసిన ఇళయరాజా మ్యూజిక్‌
Image Credit : facebook

మ్యాజిక్‌ చేసిన ఇళయరాజా మ్యూజిక్‌

ఈ పాటను ఓ క్లాసిక్‌గా మార్చింది ఇళయరాజా సంగీతమే. మెల్లని రిథమ్, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ఫ్లూట్, తక్కువ వాయిద్యాలతో పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించారు. ముఖ్యంగా, చరణం తర్వాత వచ్చే ఫ్లూట్ మ్యూజిక్ వినేవాళ్లను మరో లోకంలోకి తీసుకెళ్తుంది.
56
పాటకి ప్రాణం పోసిన ఎస్పీబాలు గొంతు
Image Credit : Asianet News

పాటకి ప్రాణం పోసిన ఎస్పీబాలు గొంతు

ఈ పాటకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు. ఆ మృదువైన గాత్రం, ప్రేమలోని తియ్యదనాన్ని, పల్లెటూరి స్వచ్ఛతను ఎంతో సహజంగా పలికించింది. అందుకే, ఈ పాటను ఆయన గొంతుతోనే రికార్డ్ చేయాలని దర్శకుడు ఆర్.వి. ఉదయకుమార్ చాలా రోజులు ఎదురుచూశారు.
66
 ఇళయరాజాకి ముద్దు పెట్టిన బాలసుబ్రమణ్యం
Image Credit : our own

ఇళయరాజాకి ముద్దు పెట్టిన బాలసుబ్రమణ్యం

పాట రికార్డింగ్ పూర్తయ్యాక, స్టూడియోలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత, ఎస్పీ బాలు లేచి దర్శకుడు ఆర్.వి. ఉదయకుమార్‌ను కౌగిలించుకుని మెచ్చుకున్నారు. ఆయన కళ్లలోని భావోద్వేగమే ఆ పాట గొప్పతనానికి సాక్ష్యం. తర్వాత తన స్నేహితుడు ఇళయరాజాను కూడా హత్తుకుని ముద్దు పెట్టారట. దానికి ఇళయరాజా సరదాగా 'పోరా పో' (వెళ్లు) అని అన్నారని చెబుతారు. 'పచ్చమల పూవు' కేవలం పాట కాదు, అదొక అనుభూతి, జ్ఞాపకం. ఇదిలా ఉంటే ఈ మూవీని తెలుగులో `చిలకపచ్చ కాపురం` పేరుతో రీమేక్‌ చేశారు. జగపతిబాబు, మీనా నటించారు. ఆ మ్యాజిక్‌ తెలుగులో వర్కౌట్‌ కాలేదు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Recommended image2
వారణాసిలో మహేష్ బాబు కొడుకు, గౌతమ్ ఘట్టమనేని కి రాజమౌళి ఏ పాత్ర ఇచ్చాడో తెలుసా?
Recommended image3
VD-Shouryuv: విజయ్‌ దేవరకొండ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్.. ఇలాంటి పోస్టర్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు
Related Stories
Recommended image1
బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?
Recommended image2
VD-Shouryuv: విజయ్‌ దేవరకొండ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్.. ఇలాంటి పోస్టర్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved