MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • అప్పుడే ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా, రెండో రోజు రామ్ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?

అప్పుడే ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా, రెండో రోజు రామ్ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?

Andhra King Taluka OTT Release : అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోందట ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా. రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుండగా.. ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇక ఈసినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2025, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ పోతినేనికి కాస్త ఊరట
Image Credit : Asianet News

రామ్ పోతినేనికి కాస్త ఊరట

రామ్ పోతినేని, భాగ్యలక్ష్మి బోర్సే హీరో, హీరోయిన్లుగా .. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. గతంలో రామ్ హిట్ సినిమాలకు వచ్చినంత ఓపెనింగ్స్ ఈసినిమాకు రాకపోయినా.. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందిపడుతున్న రామ్ కు ఈసినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కాస్త ఊరటనిచ్చాయి.

25
ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్
Image Credit : Asianet News

ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్

వీక్ డే అయిన గురువారం ఈసినిమా రిలీజ్ కావడం, ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో మొదటి రోజు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తక్కువగా కనిపించింది. హిట్ టాక్ ఉన్నప్పటికీ, ఇది ఓపెనింగ్స్‌పై గణనీయమైన ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. దాదాపు 70 కోట్ల రూపాయిల బడ్జెట్ తో రూపొందిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ అన్ని ప్రాంతాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కాగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 4 కోట్ల 50 లక్షల షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
చిరంజీవి సినిమాలో రజినీకాంత్ ? మెగా సూపర్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా?
Related image2
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
35
వరుస ఫెయిల్యూర్స్ తో తలనొప్పి
Image Credit : Asianet News

వరుస ఫెయిల్యూర్స్ తో తలనొప్పి

రామ్ ఇటీవల నటించిన ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. వాటితో పోలిస్తే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మొదటి రోజు ఓపెనింగ్స్ దాదాపు 30 శాతం తక్కువగా నమోదయ్యాయి. అయితే ఈసినిమాకి కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అదే రోజు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలు విడుదలై డిజాస్టర్స్‌గా మారాయి. దీంతో పోటీ తగ్గిపోయి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు అదనపు అడ్వాంటేజ్ లభించింది.

45
రెండో రోజు కలెక్షన్స్ వివరాలు
Image Credit : Asianet News

రెండో రోజు కలెక్షన్స్ వివరాలు

రెండో రోజున సినిమా హాల్ లెక్కలు పెరుగుతూ సుమారు 100 స్క్రీన్స్ అదనంగా ఆడ్ అయినట్టు తెలస్తోంది. . అలాగే హైదరాబాద్ లో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్కూల్స్ కు సెలవులు ఉండటం కూడా సినిమాకి కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాల దృష్ట్యా రెండో రోజు తొలి రోజు రేంజ్‌కే సమానంగా కలెక్షన్లు నమోదయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం రెండో రోజు ముగిసే సమయానికి సుమారు 6 కోట్ల కలెక్షన్స్ ను వసూలు సాధించినట్టు తెలుస్తోంది. ఇక వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు ఇదే స్థాయిలో పెర్ఫార్మెన్స్‌ను కొనసాగించగలిగితే, శనివారం , ఆదివారం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద మరింత బలమైన కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

55
ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్
Image Credit : Asianet News

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్

రిలీజ్ అయ్యి రెండు రోజులే అవుతున్నా.. అప్పుడే ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై సమాచారం వైరల్ అవుతోంది. ఈ మూవీని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వచ్చే నెల 25 నుంచే ఈసినిమా ఓటీటీలో అందుబాటులో ఉండబోతున్నట్టు సమాచారం. ఈలెక్కన హిట్ సినిమా అయినా.. చాలా త్వరగా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీలో సందడి చేయబోతున్నట్టు లెక్క. మరి ఈ సినిమా ఈ నెల రోజుల్లో ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
చిరంజీవి సినిమాలో రజినీకాంత్ ? మెగా సూపర్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved