MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5 కోట్లు బడ్జెట్ పెడితే, 90 కోట్లు సంపాదించిన చిన్న సినిమా ఏదో తెలుసా?

5 కోట్లు బడ్జెట్ పెడితే, 90 కోట్లు సంపాదించిన చిన్న సినిమా ఏదో తెలుసా?

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించి ఆశ్చర్చపరుస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు 10 రెట్లు లాభాలను అందిస్తున్నాయి. తాజాగా ఓ చిన్న సినిమా భారీ విజయంతో కాలర్ ఎగరేస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 16 2025, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Social Mediia

ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నిర్మించినా, కంటెంట్ బలంగా ఉండటంతో పెద్ద వసూళ్లు సాధిస్తున్నాయి. తాజాగా, కన్నడంలో విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ (Su From So) అనే సినిమా కూడా అదే కోవలోకి చేరింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. 

DID YOU
KNOW
?
చిన్న సినిమా పెద్ద విజయం
కన్నడంలో విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
25
Image Credit : Social Media

సు ఫ్రమ్ సో మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్ పి. శెట్టి నిర్మించారు. జె.పి. దుమినాద్ అనే కొత్త డైరెక్టర్, ఈసినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రారంభంలో పెద్దగా ప్రచారం లేకపోయినా, విడుదలైన వెంటనే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా ఒక్కసారి పుంజుకుని మంచి వసూళ్లను సాధించింది.

Related Articles

Related image1
ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క తెలుగు సీరియల్ ? తారక్ అందులో ఏ పాత్ర చేశాడంటే?
Related image2
ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వెండితెరపై కృష్ణుడి పాత్రలు చేసిన హీరోలు ఎవరెవరంటే?
35
Image Credit : Facebook / dulquer salmaan

5.5 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా 90 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్ లో రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యకరం.కన్నడలో మాత్రమే కాదు తెలుగు, మలయాళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మలయాళంలో ఈసినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సబందించిన వేఫేరర్ సంస్థ మలయాళ హక్కులను సొంతం చేసుకొని ఆగస్ట్ 1న కేరళలో విడుదల చేసింది. అక్కడ కూడా సినిమా మంచి స్పందన సాధించింది.

45
Image Credit : Su From So

తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సు ఫ్రమ్ సో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ యూత్ ను బాగా ఆకట్టుకుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, కథనం, న్యూయేజ్ స్టోరీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో వసూళ్లు ఊపందుకున్నాయి.

55
Image Credit : @rajbshetty/ Instagram

ఇప్పటి వరకు ఈసినిమా 90 కోట్ల మార్క్ను దాటింది. ఇక రాబోయే రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చిన్న బడ్జెట్ సినిమాలు కంటెంట్ బలంతో బాక్సాఫీస్ వద్ద ఎలా విజయం సాధించగలవో 'సు ఫ్రమ్ సో' మరోసారి నిరూపించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క తెలుగు సీరియల్ ? తారక్ అందులో ఏ పాత్ర చేశాడంటే?
Recommended image2
ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వెండితెరపై కృష్ణుడి పాత్రలు చేసిన హీరోలు ఎవరెవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved