MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది

ఆ దరిద్రం ఎందుకులే అని చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్.. మంచి పని చేసింది

చిరంజీవి సినిమాని ఓ సీనియర్ హీరోయిన్ రిజెక్ట్ చేశారు. ఆమె ఎవరు ? ఆ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 08 2025, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Facebook/chiranjeevi konidela

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఘరానా మొగుడు చిత్రం వరకు తిరుగులేదు అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత చిరంజీవికి కొన్నేళ్లు కష్టాలు ఎదురయ్యాయి. చిరంజీవి ఎలాంటి చిత్రంలో నటించినా అది ఫ్లాప్ అవుతూ ఉండేవి. ఒకటి రెండు చిత్రాలు హిట్ అయినప్పటికీ చిరంజీవికి విమర్శలు తప్పలేదు. ఆ టైంలో ఏం జరిగింది. చిరంజీవిపై విమర్శలకు కారణం ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఘరానా మొగుడు చిత్రాన్ని నిర్మించిన దేవి వరప్రసాద్ రెండేళ్లు ఎదురు చూసి మళ్ళీ చిరంజీవితోనే సినిమా ప్రారంభించారు. 

25
Image Credit : our own

ఘరానా మొగుడు తర్వాత ముఠామేస్త్రి, ఎస్పీ పరుశురాం లాంటి ఫ్లాపులు చిరంజీవికి ఎదురైనప్పటికీ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రతి చిత్రానికి అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చేవి. ఆ ధైర్యంతోనే నిర్మాత దేవి వరప్రసాద్.. డైరెక్టర్ ఇవివి సత్యనారాయణతో బడ్జెట్ గురించి ఆలోచించకుండా సినిమా తీయమని స్వేచ్ఛ ఇచ్చారట. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ చిత్రమే అల్లుడా మజాకా. 

Related Articles

Related image1
చిరంజీవి విలన్, వేశ్యగా శ్రీదేవి, హీరోగా శోభన్ బాబు.. దారుణాలన్నీ ఉన్న ఆ మూవీ ఏంటో తెలుసా ?
Related image2
అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టినప్పటికీ ఫస్ట్ ప్లేస్ మహేష్ బాబుదే.. నాలుగు చిత్రాలతో టాప్ లో సూపర్ స్టార్
35
Image Credit : Facebook/Chiranjeevi konidela

తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా హీరో తన అత్తగారికి బుద్ది చెప్పే కథే ఈ చిత్రం. ఈవీవీ సత్యనారాయణ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే పెట్టారు. కానీ డబుల్ మీనింగ్ డైలాగుల డోసు, అసభ్యకర సన్నివేశాలు ఎక్కువ కావడంతో అల్లుడా మజాకా ఒక బూతు సినిమా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కమర్షియల్ గా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ మహిళా సంఘాలు చిరంజీవిపై చిత్ర యూనిట్ పై దుమ్మెత్తి పోశాయి. 

45
Image Credit : Asianet News

ముఖ్యంగా ఈ చిత్రంలో అత్తగా నటించిన లక్ష్మీ, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు, డ్యాన్సులు చాలా వల్గర్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోయారు. అత్త పాత్రలో ముందుగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీని అనుకున్నారు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ముందుగా వాణిశ్రీని సంప్రదించారు. అప్పటికే వాణిశ్రీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో చిరంజీవికి అత్తగా నటించింది. పైగా అల్లుడా మజాకా మూవీలో ఉండే సన్నివేశాలు శృతి మించేలా ఉన్నాయని వాణిశ్రీ కథ విన్నప్పుడే పసిగట్టారు. ఆ దరిద్రం ఎందుకులే అని ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసేశారు.  

55
Image Credit : Asianet News

ఆ విధంగా వాణిశ్రీ ఒక బూతు సినిమా నుంచి తప్పించుకుని మంచి పని చేశారు. ఈ మూవీతో వచ్చిన విమర్శల వల్ల చిరంజీవి కూడా బాగా హర్ట్ అయ్యారట. చిరంజీవి ఆ తర్వాత నటించిన బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. చివరికి 1997లో చిరంజీవి హిట్లర్ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
చిరంజీవి విలన్, వేశ్యగా శ్రీదేవి, హీరోగా శోభన్ బాబు.. దారుణాలన్నీ ఉన్న ఆ మూవీ ఏంటో తెలుసా ?
Recommended image2
అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టినప్పటికీ ఫస్ట్ ప్లేస్ మహేష్ బాబుదే.. నాలుగు చిత్రాలతో టాప్ లో సూపర్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved