పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప షాక్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సత్యరాజ్ ఏమన్నాడు. కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ తమిళ సినీ నటుడు, బాహుబలి కట్టప్ప, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా పవన్ కు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే అటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
రీసెంట్ గా పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జరిగిన "మురుగన్ మానాడు" అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, హిందుత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను ప్రస్తావించారు.
పవన్ తన ప్రసంగంలో "నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే, నాస్తికులు ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి.
తమిళనాడు మంత్రులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, పవన్ మతం పేరిట చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై నటుడు సత్యరాజ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోం. ఇది హిందుత్వాన్ని విస్తరించాలనే దురుద్దేశంతో కూడుకున్న ప్రచారం” అని విమర్శించారు.
“పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అవుతుంది. తమిళ ప్రజలు చాలా తెలివైనవారు. తమిళనాట మీ మత ఆటలు సాగవు తమిళనాడు ప్రజలు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను సహించరని సత్యరాజ్ స్పష్టంగా హెచ్చరించారు.
"మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలనుకోవడం తమిళ ప్రజలకి నచ్చదు. మేము మూర్ఖులం కాదు. " అంటూ ఘాటుగా స్పందించారు. ” ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తపరిచారు. సత్యరాజ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లో ఈ వాఖ్యలు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి.
ఇక సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ అంశం సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. హిందుత్వం, నాస్తికత్వం, సనాతన ధర్మం వంటి అంశాల చుట్టూ తమిళనాడులో మతపరమైన రాజకీయాలు తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేకులు కొందరు అంటున్నారు.
తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పవన్ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి విమర్శలు ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్, తమిళ ప్రజల మద్దతు పొందే లక్ష్యంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కించాయి. తమిళనాడులో పెరియార్ భావజాలం ,సెక్యులర్ విధానాలు ఎక్కువగా ఆచరణలో పెట్టేనాయకులు పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా ఎవరెవరు స్పందిస్తారోన చూడాలి.