శృతీ హాసన్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు, గందరగోళంలో అభిమానులు
ఈమధ్య స్టార్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లకు రక్షణ లేకుండాపోయింది. ఎప్పుడు సైబర్ దాడి జరుగుతుందో తెలియక స్టార్స్ టెన్షన్ పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు షాక్ ఇచ్చారు హ్యాకర్లు.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హాసన్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని ప్రకటించారు. మంగళవారం తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని ఆమె ప్రకటించారు. శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దాంతో స్టార్ హీరోయిన్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో పడ్డారు.
శృతి హాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చారు. ''డియర్ ఫ్యాన్స్... నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ పోస్ట్ అవుతున్నవి నేను చేస్తున్నవి కావు. కాబట్టి, దయచేసి ఆ పేజీలో చేసే పోస్టులు నావి కావని గుర్తించండి. ఖాతాను పునరుద్ధరించే వరకు ఎవరూ ఆ పోస్ట్ లకు స్పందించవద్దు" అని పేర్కొన్నారు.
శృతి హాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చారు. ''డియర్ ఫ్యాన్స్... నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ పోస్ట్ అవుతున్నవి నేను చేస్తున్నవి కావు. కాబట్టి, దయచేసి ఆ పేజీలో చేసే పోస్టులు నావి కావని గుర్తించండి. ఖాతాను పునరుద్ధరించే వరకు ఎవరూ ఆ పోస్ట్ లకు స్పందించవద్దు" అని పేర్కొన్నారు.
రీసెంట్ గా పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈక్రమంలో తాజాగా శృతి హాసన్ ఖాతా కూడా హ్యాకర్ల చేతికి చిక్కడ గమనార్హం. మంగళవారం శృతి హాసన్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో అసాధారణ పోస్టులు కనిపించాయి. వాటిలో బిట్‌కాయిన్ లాంటి ఇతర ప్రచార సంబంధిత సమాచారం ఉన్న ఫొస్టులు ఉండటంతో.. అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. దాంతో ఫ్యాన్స్ లో గందరగోళం క్లియర్ చేయడం కోసం ఆమె స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
శృతి హాసన్ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కమల్ హాసన్ నట వారసత్వం తీసుకున్న ఈ హీరోయిన్, సొంతంగా తనకు తాను ఎదిగింది. శృతి హాసన్ హీరోయిన్ మాత్రమే కాదు , సింగర్, మ్యుూజిక్ డైరెక్టర్ , కంపోజర్, పాప్ స్టార్ గా కూడా. ఇటు సినిమాలు చేస్తూనే శృతీ హాసన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అంతే కాదు తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడుఅప్ డేట్స్ ను అందిస్తుంటుంది, తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
ఇక మంగళవారం( జూన్ 23) ఉదయం వరకు కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ ను పెట్టారు. వాతావరణం ఇంత చల్లగా ఉంది, వర్షం వస్తున్నప్పుడు , ఇంత సంతోషంగా, ఉత్సాహంగా, సానుకూలంగా ఉండేది నేనొక్కదాన్నేనా?... ఇలాంటి వాతావరణం నాతో నేను ఏదైనా రాయాలనిపిస్తుంది, మనసులను కదిలించాలనిపిస్తుంది" అనే పోస్టును ఆమె షేర్ చేసింది.
ఈ నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్ విషయం వెలుగులోకి రావడం, అలాగే ఆమె ఆ పోస్టు తరువాత ఈ అకౌంట్ లో వచ్చిన అసాధారణ కంటెంట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
ఇక జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు డి. ఇమాన్ అకౌంట్ కూడా 2024 మార్చిలో హ్యాకయ్యింది. ఆ తరువాత అకౌంట్ ను తిరిగి పునరుద్ధరించారు. అంతకుముందు నటి, రాజకీయ నాయకురాలైన ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా పేజ్ కూడా, రెండు మూడు సార్లు హ్యాక్ అయ్యింది. ఇలా సెలబ్రిటీల అకౌంట్లపై సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం శృతి హాసన్ అకౌంట్ ను సరిచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆమె అభిమానులు కూడా ఆమె సూచనలను పాటిస్తున్నారు. శృతీహాసన్ ఎక్స్ లో వచ్చే పోస్ట్ లకు పెద్దగా ఎవరు స్పందించడంలేదు. శృతి హాసన్ ఖాతా తిరిగి పునరుద్ధరించిన వెంటనే ఆమె మరింత సమాచారం వెల్లడించే అవకాశం ఉంది.