- Home
- Entertainment
- రాజమౌళి, రవితేజ తో రొమాన్స్ చేయించిన అనుష్క, స్వీటీ గురించి జక్కన్న చెప్పిన టాప్ సీక్రేట్
రాజమౌళి, రవితేజ తో రొమాన్స్ చేయించిన అనుష్క, స్వీటీ గురించి జక్కన్న చెప్పిన టాప్ సీక్రేట్
ప్రస్తుతం దర్శఖుడిగా అంతర్జాతీయ గుర్తింపుతో దూసుకుపోతున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎదరుచూస్తుంటారు. అటువంటి స్టార్ డైరెక్టర్ ను ఒక ఆట ఆడేసుకుందట హీరోయిన్ అనుష్క శెట్టి.

ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు. ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అనేవారు, కాని ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనేరేంజ్ కు తెలుగు సినీ పరిశ్రమను తీసుకువచ్చారు రాజమౌళి. రాజమౌళి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. టాలీవుడ్ లో మాత్రమే ఆయన సినిమాలు చేసేప్పుడు పెద్ద హీరోతో మాత్రమే కాదు చిన్న హీరోలతో కూడా ఆయన సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి చూపించారు.
అంతే కాదు ఎంతో మంది హీరోయిన్లను, ఆర్టిస్ట్ లను స్టార్లు చేసి, వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చారు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి స్టాయి వేరు. ఆయన పాన్ వరల్డ్ సినిమాల దర్శకుడిగా మారిపోయిరు. ఈక్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అది ఇతరులెవరివల్లో వచ్చింది కాదు. స్వయంగా రాజమౌళి చెప్పిన విషయం వైరల్ అయ్యింది. అదేంటంటే స్టార్ హీరోయిన్ అనుష్క షూటింగ్ టైమ్ లో తనను ఎలా ఆట ఆడుకుందో సరదాగా చెప్పారు జక్కన్న.
ఓ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతు అసలు విషయం వెల్లడించారు. నేను చాలామందితో పనిచేశాను. అందరూ సీన్ చెప్పగానే చేసేస్తారు. కొంత మందికి ఆ సీన్ చేసి చూపించాలి. కాని అన్ని సీన్లు అలా అడగరు. కాని స్వీటీ ( అనుష్క) మాత్రం ప్రతీ సీన్ చేసి చూపించమంటుంది. క్లారిటీ కావాలని అంటుంది. విక్రమార్కుడు సినిమాలో అయితే చివరకు రవితేజతో చేయాల్సిన రొమాంటిక్ సీన్స్ కూడా నేను చేసి చూపించాల్సి వచ్చింది. అలా నా చేత రొమాన్స్ కూడా చేయించింది అంటూ.. సరగాగా నవ్వించారు రాజమౌళి. హీరోయిన్లను పెద్దగా రిపీట్ చేయని రాజమౌళి అనుష్కకు మాత్రం 3 సినిమాల్లో అవకాశం ఇచ్చాడు.
విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ జోడీగా నటించిన అనుష్క.. ఆతరువాత బాహుబలి రెండు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేసింది. రాజమౌళికి అనుష్కతో ప్రత్యేక అనుబంధం ఉంది. జక్కన్న ఫ్యామిలీలో ఒకరిలా కలిసిపోయింది అనుష్క. రాజమౌళికి ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో పాటు అనుష్క కూడా చాలా స్పెషల్.
ఇక ప్రస్తుతం అనుష్క సినిమాలు చేయడంలేదు. అప్పుడప్పుడు ఏదో ఒకటి అరా సినిమాల్లో కనిపిస్తోంది. 43 ఏళ్లు వచ్చినా అనుష్క బ్యాచిలర్ గానే ఉంది. పెళ్లిపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు.
ఇక రాజమౌళి మాత్రం ఈసారి పెద్ద ప్లానే వేశారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అమెజాన్ అడవుల్లో జరిగే అతి పెద్ద సాహసయాత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న.
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ రెండు షెడ్యుల్స్ కంప్లీట్ అయ్యాయి. సమ్మర్ బ్రేక్ తీసుకున్నారు టీమ్. త్వరలో ఈమూవీ మూడో షెడ్యుల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇతర పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో రాజమౌళి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.