సన్యాసం తీసుకుని, కాషాయం కట్టిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
వెండితెరపై గ్లామర్ తో మెరుపులు మెరిపించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సన్యానసం తీసుకుని కాషాయం కట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? సన్యాసం తీసుకునేంత వైరాగ్యం ఎందుకు వచ్చింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. స్టార్ డమ్ తో వెలుగు వెలిగిన తారలు ఎప్పుడు ఎలా పడిపోతారో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ కు గ్యారెంటీ ఉండదు. అలా సడెన్ గా మాయమైన తారలు ఎందరో. కొంత మంది అయితే పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నారు. ఇక ఒక హీరోయిన్ అయితే ఏకంగా సన్యాసం కూడా తీసుకుంది. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆమె రామ్ గోపాల్ వర్మ హీరోయిన్.
ఆమె మరెవరో కాదు టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి బర్ఖా మదన్. ప్రస్తుతం సినిమాలకి దూరంగా, డిఫరెంట్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే 1996లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది బర్ఖా. అక్షయ్ కుమార్, రేఖలతో కలిసి ఖిలాడియోం కా ఖిలాడి సినిమాలో నటించింది హీరోయిన్. ఇద్దరు స్టార్స్ తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బర్ఖా, చాలా తక్కువటైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అంతే కాదు బర్ఖా మదన్ మిస్ ఇండియా కూడా అవ్వాల్సింది. 1994లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆమె పార్టిస్పేట్ చేసింది. సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్‌లతో కూడా ఆమె పోటీపడింది. మోడలింగ్ చేస్తూనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బర్ఖా. 2003 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వచ్చిన భూత్ సినిమాతో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయ్యింది. ఈ సినిమాతో బర్ఖా మదన్ నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత బర్ఖా 20కి పైగా సినిమాలు, పలు టీవీ షోల్లోనూ నటించి మెప్పించింది.
20ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ 2012లో సడెన్ గా సినీ కెరీర్‌ను వదిలేసి బౌద్ధ సన్యాసం తీసుకుంది. ఆమె బౌద్ధ మతపు ప్రసంగాలవైపు ఆకర్షణకు గురయ్యింది. సాధారణ జీవితం వదిలి ధ్యాన మార్గాన్ని ఎంచుకుంది. బర్ఖా మదన్ భారతదేశంలోని ప్రసిద్ధ సెరా జే బౌద్ధ ఆశ్రమంలో ఆమె సన్యాసం స్వీకరించి, తన పేరును వెనరబుల్ గ్యాల్టెన్ సామ్టెన్ మార్చుకుంది.
ప్రస్తుతం బర్ఖా మదన్ హిమాలయ పర్వతాల్లోని ఆశ్రమాంలో ఉంటోంది. అక్కడే ధ్యానం చేసుకుంటూ..ప్రవచనాలు ఇస్తూ.. జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా ఆస్తులు, లగ్జరీ లైఫ్ స్టైల్ ను వదిలి సాత్విక జీవితం గుడుపుతున్న స్టార్ హీరోయిన్ గా అరుదైన రికార్డ్ ను ఆమె క్రియేట్ చేసింది.
బర్ఖా మదన్ ఎందుకు ఇలా చేసింది. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న టైమ్ లో ఆమె సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి. తన నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజాలను గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బర్ఖా మదన్ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..“నేను సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ లోపల ఏదో లోటు అనిపించేది. ఆ లోటును నెరవేర్చింది బుద్ధ ధర్మం. దాన్ని ఎంచుకోవడం నా జీవితాన్ని సార్థకం చేసింది.” అని అన్నారు.
బర్ఖా మదన్ మాదిరిగానే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ మధ్యలోనే ఆపేసి డిఫరెంట్ రూట్స్ ను ఎంచుకున్నారు. కాని ఒక గ్లామర్ హీరోయిన్ బౌద్ధ సన్యాసిగా మారడం మాత్రం చాలా అరుదైన సంఘటన. ఆమె జీవితం ఇప్పుడు గ్లామర్ ను నమ్ముకోలేదు. ఆధ్యాత్మిక మార్గాన్ని, ధ్యానాన్ని నమ్ముకున్నారు.