- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ సింపుల్ గా మనోజ్ నుంచి లక్ష రూపాయలు నొక్కేస్తుంది. బాలు, మీనా మధ్య మాత్రం దానికి సంబంధించిన గొడవ తీరదు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం...

గుండె నిండా గుడి గంటలు...
రోహిణీ కోసం విద్య ఫర్నీచర్ షోరూమ్ కి వస్తుంది. మాట్లాడాలి అని చెప్పి.. పక్కకు తీసుకొని వెళ్తుంది.అంతే.. విద్య ఏడ్వడం మొదలుపెడుతుంది. ఏమైంది? అని రోహిణీ అడిగితే.. ‘ మా అమ్మకు కడుపులో నొప్పి అంటే హాస్పిటల్ కి తీసుకువెళ్లాను. కడుపులో గడ్డ ఉంది..ఆపరేషన్ చేయాలి అంటున్నారు. ఆపరేషన్ కి 75వేలు కట్టాలంటున్నారు. చేతిలో రూపాయి కూడా లేదు. నువ్వు సర్దగలవా?’ అని విద్య ఏడుస్తూ అడుగుతుంది. ‘ నా దగ్గర కూడా లేవు.. పార్లర్ కోసం చాలా షాపింగ్ చేశాను. ఉన్నవి కూడా అయిపోయాయి’ అని రోహిణీ చెబుతుంది. దీంతో.. విద్య ఎలా అని ఏడుస్తుంటే.. ‘ ఎక్కడైనా ట్రై చేద్దాం.. నువ్వు కంగారుపడకు’ అని రోహిణీ అంటుంది. ఈ లోగా... రోహిణీని.. మనోజ్ పక్కకు పిలిచి.. ఆ డబ్బులు మనం ఇద్దాం.. కాకపోతే వడ్డీకి ఇద్దాం అని చెబుతాడు. సరే అని అంటుంది రోహిణీ. తర్వాత.. విద్యను పిలిచి.. డబ్బులు ఇస్తామని మనోజ్ చెబుతాడు. థ్యాంక్స్ చెబుతూ ఇద్దరూ బయటకు వస్తారు. తీరా.. బయటకు వచ్చిన తర్వాత.. చూస్తే.. ఇదంతా రోహిణీ ప్లాన్.
మనోజ్ దగ్గర నుంచి డబ్బు కొట్టేయడానికి విద్యతో కలిసి రోహిణీ వేసిన ప్లాన్. ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు. ఇది తెలియని మనోజ్... వడ్డీకి డబ్బులు ఇచ్చి.. ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు అని మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు మనోజ్ దగ్గర తీసుకున్న లక్ష రూపాయలను ఇంటి అద్దెకు కట్టమని.. మనోజ్ పంపే రూ.75వేలు చింటూ స్కూల్ ఫీజ్ కట్టమని రోహిణీ చెబుతుంది. అయితే.. ‘ చింటూ ఊర్లో ఉన్నప్పుడే నీకు చాలా సమస్యలు వచ్చేవి.. ఇప్పుడు ఏకంగా తెచ్చి ఇక్కడే పెట్టుకుంటున్నావ్ ఇంకెన్ని సమస్యలు వస్తాయో’ అని విద్య అంటే.. అవి నేను చూసుకుంటానులే అని రోహిణీ చెబుతుంది.
రాజేష్ కి డబ్బులు ఇచ్చి.. మీనాపై నిప్పులు చెరిగిన బాలు..
సీన్ కట్ చేస్తే.. రాజేష్ దగ్గరకు బాలు వస్తాడు. రావడమే.. రాజేష్ చేతిలో లక్ష రూపాయలు పెడతాడు. కానీ, ఆ డబ్బు తీసుకోవడానికి రాజేష్ ఒప్పుకోడు. ఫంక్షన్ చేయడం లేదు అని చెబుతాడు. ఎందుకు అని బాలు అడిగితే.. ఇంత ఖర్చు పెట్టి చేయను అని చెబుతాడు. కానీ, బాలు వదలడు. నిజం ఏంటో చెప్పమని ఫోర్స్ చేస్తాడు. దీంతో.. మీనా వచ్చిన విషయం చెబుతాడు. అయితే.. మీనా మాట్లాడిన దాంట్లో తనకు ఏ తప్పు కనపడలేదు అని.. రాజేష్ చెప్పినా.. బాలు వినడు. మీనా మీద కోపంతో ఊగిపోతాడు. తాను తెచ్చిన డబ్బు మాత్రం తీసుకోవాలని రాజేష్ ని బలవంత పెడతాడు. దీంతో..తప్పక రాజేష్ ఆ డబ్బు తీసుకుంటాడు.
ఇక, ఇంటికి వచ్చిన తర్వాత.. మీనా మీద బాలు నిప్పులు చెరుగుతాడు. ‘ నువ్వు ఎవరు సలహాలు ఇవ్వడానికి? ఎవరు ఇంట్లోనే ఫంక్షన్ చేసుకుంటుంటే వద్దు అని చెప్పడానికి నువ్వు ఎవరు?’ అని సీరియస్ అవుతాడు. మీకు, రాజేష్ అన్నయ్య ఇద్దరికీ అర్థం కాలేదు అనే విషయం నాకు అర్థమైంది.. అని మీనా అంటుంది. బాలు మాత్రం ఆగడు.మీనా అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా బాలు వినకుండా సీరియస్ అవుతాడు. ‘ నేను చనువు ఇచ్చాను కదా అని.. నువ్వు వెళ్లి నా ఫ్రెండ్ కి సలహా ఇవ్వడం తప్పే. నన్ను చవటను చేద్దాం అనుకుంటున్నావా? నీతో పాటు..పూలు అమ్ముకునే వాళ్ల ఇంటికి వెళ్లి..మీరు ఫంక్షన్లు చేసుకోవద్దు అని నేను చెబితే నీకు ఎలా ఉంటుంది?’ అని బాలు అడుగుతాడు. ‘ మీరు రూమ్ కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు తీసుకువెళ్లి.. నేను వాళ్లకు ఇస్తే.. మీరు అడిగితే అర్థం ఉంటుంది’ అని మీనా రివర్స్ లో అడుగుతుంది. ‘ అంటే.. రూమ్ కట్టుకోవడానికి నువ్వు పూలు అమ్మిన డబ్బులు మాత్రమే దాస్తున్నావా? నేను కష్టపడి సంపాదించినది ఏమీ లేదా’ అని బాలు అంటాడు. వీళ్లిద్దరూ వాదించుకుంటూ ఉంటే.. ప్రభావతి చాటుగా మాటలు వింటూ ఆనందపడుతుంది. ‘ రూమ్ కట్టాలని శపథం చేసింది నువ్వే’ అని బాలు అనడంతో.. మీనా హర్ట్ అవుతుంది. అంతేకాకుండా.. రాజేష్ కి అప్పు చేసి మరీ ఇచ్చాను అని మాటల్లో మాటగా చెబుతాడు. వీళ్ల గొడవ విని ప్రభావతి.. ‘ నేను రంగ ప్రవేశం చేయాల్సిన టైమ్ వచ్చేసింది..’ అనుకుంటూ ఆనందంగా వచ్చి వాళ్ల గొడవలో దూరుతుంది.
బాలుకి సపోర్ట్ చేసి.. మీనాని తిట్టిన ప్రభావతి...
కావాలనే మీనాని తిట్టడం మొదలుపెడుతుంది. గొడవ ఏంటి? అని ప్రభావతి అడుగుతుంది. అయితే.. బాలు ప్రభావతిని దూరనివ్వడు. పట్టించుకోకుండా.. మీనాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే.. ప్రభావతి కావాలని దూరిపోతుంది. ‘ నేను మొత్తం విన్నాను. నువ్వు దీనికి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోవడం వల్లే.. ఇప్పుడు డ్యాన్స్ చేస్తోంది..’ అని మీనాని ఉద్దేశించి బాలుతో అంటుంది. ‘ వాడి డబ్బు వాడు ఎవరికైనా ఇస్తాడు.. మధ్యలో నీకు ఎందుకు?’ అని బాలుకి సపోర్ట్ గా ప్రభావతి మాట్లాడుతుంది. అవేమీ పట్టించుకోని మీనా.. బాలుకి మాత్రం నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లపోతుంది. మీనా వెనకే బాలు కూడా వెళ్లిపోతూ.. ‘ నువ్వు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్.. నీ కడుపు నిండలేదా? మేం పెద్ద గొడవ పడి పై నుంచి దూకితే కానీ.. నీకు కడుపు నిండదా?’ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రభావతి మాత్రం.. ఇంకా పెద్దగా గొడవ పడితే బాగుండేది అని ఆలోచిస్తుంది.
తప్పు తెలుసుకున్న బాలు...
మరుసటి రోజు ఉదయం బాలు రాజేష్ వాళ్ల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్తూ.. వాళ్ల నాన్న సత్యంకి చెబుతాడు.మీనాని తీసుకువెళ్లవా అని సత్యం అడిగితే.. తీసుకువెళ్లను అని చెబుతాడు. కానీ ఈలోగా.. మీనా రెడీ అయ్యి వస్తుంది. అది చూసి బాలు కూడా షాకౌతాడు. సత్యం ముందు కాదనలేక.. మీనాని బాలు తీసుకొని వెళతాడు. మీ పరువు నిలపెట్టడానికి మాత్రమే వస్తున్నాను అని మీనా చెబుతుంది. కాసేపు వాదించుకొని ఇద్దరూ కలిసి.. రాజేష్ వాళ్ల ఇంటికి వెళతారు. తీరా అక్కడకు వెళితే.. రాజేష్ ఎలాంటి ఆర్భాటం లేకుండా.. సింపుల్ గా కనిస్తాడు. అది చూసి బాలు షాక్ అవుతాడు. షష్ఠి పూర్తి దంపతులను పక్కన వదిలేసి.. రాజేష్ స్నేహితులతో తాగి చిందులు వేస్తూ ఉంటాడు.అది చూసి బాలు షాక్ అవుతాడు. రాజేష్ కి అనవసరంగా డబ్బులు ఇచ్చి తప్పు చేశాను అని.. బాలు ఫీలౌతాడు. తాను చేసిన తప్పు తెలుసుకుంటాడు.

