MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి మళ్లీ టోపీ పెట్టిన రోహిణీ, రాజేష్ కి బ్రెయిన్ వాష్ చేసిన మీన

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి మళ్లీ టోపీ పెట్టిన రోహిణీ, రాజేష్ కి బ్రెయిన్ వాష్ చేసిన మీన

 Gunde Ninda Gudi Gantalu: లక్ష రూపాయల కోసం బాలు, మీనా మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ గొడవను మరింత పెంచాలని చూసిన ప్రభావతి ఆశలు గల్లంతయ్యాయి. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో టీవీ కంటే ముందుగా మీకోసం... 

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2026, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

మీనా డబ్బులు ఇవ్వనంటే ఇవ్వను అని తేల్చి చెప్పేస్తుంది. దీంతో.. ఏం చేయాలా అని ఆలోచిస్తూ బాలు.. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి రాజేష్ ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు.‘ నువ్వు డబ్బు ఇస్తాను అన్నావ్ అని.. ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్లాడు’ అని ఫ్రెండ్స్ చెబుతారు. దీంతో బాలు షాక్ అయ్యి.. ఇప్పుడు డబ్బులు కావాలి అని అంటాడు. దానికి వాళ్లు.. ‘ నీ దగ్గర లేకుండానే రాజేష్ కి మాట ఎలా ఇచ్చావ్?’ అని అడుగుతారు. ‘ ఇంటికి కోసం దాచిన డబ్బు ఇద్దాం అని అనుకున్నాను.. కానీ, మీనా ఇవ్వను అంటుంది అని ’ అసలు విషయం చెబుతాడు. దీంతో... వాళ్ల ఫ్రెండ్స్ బాలుకి చివాట్లు పెడతారు. ‘ ఒక అవసరం ఎదురు చూస్తున్నప్పుడు.. ఆ డబ్బుని మరో అవసరానికి ఇస్తాను అని ఎలా చెబుతావ్? మీనా చేసిందే కరెక్ట్ ’ అని మాట్లాడతారు. ‘ తిరిగి ఇస్తాను అన్నాడు కదా.. రూమ్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు.. షష్ఠి పూర్తి ఒక్కసారే వస్తుంది కదా.. అందుకే రాజేష్ కి ఇద్దాం అనుకున్నాను’ అని బాలు చెబుతాడు. ‘ అది నీ ఒక్కడి డబ్బు అయితే ఇవ్వొచ్చు.. కానీ మీ ఆవిడ భాగం కూడా ఉంది కదా.. మగాడు స్నేహితుల కోసం ఆలోచిస్తాడు.. ఆడది సంసారం కోసం ఆలోచిస్తుంది.. భార్య జీవితంలోకి వచ్చిన తర్వాత తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకూడదు’ అని బాలు కి మైండ్ వాష్ చేస్తారు. దీంతో.. డబ్బులు ఏం చేయాలా అని.. బాలు తెగ ఆలోచిస్తాడు. ఏదో ఒకటి చేసి కచ్చితంగా రాజేష్ కి డబ్బులు ఇస్తాను అని బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

24
బాలు, మనోజ్ కి ఒకటే సమస్య...
Image Credit : Jio Hotstar

బాలు, మనోజ్ కి ఒకటే సమస్య...

ఇక. రాత్రి రోహిణీ నిద్రపోతుంటే విద్య ఫోన్ చేస్తుంది.‘ ఇంటి అడ్వాన్స్ రూ. లక్ష రేపు కడితేనే ఇల్లు అద్దెకు ఇస్తాను లేకపోతే వేరే వాళ్లకు ఇస్తాను అంటున్నాడు’ అని చెబుతుంది. అయితే..రోహిణీ ఫోన్ మాట్లాడుతుండగా.. మనోజ్ వచ్చి.. ఆ మాటలు వెంటాడు. విషయం ఏంటి అని అడగడంతో.. తన ఫ్రెండ్ ఫోన్ చేసిందని.. లక్ష రూపాయలు సహాయం కావాలని అడుగుతోందని అబద్ధం చెబుతుంది. అయితే.. మనోజ్ కొంచెం కూడా మొహమాటం లేకుండా.. డబ్బులు ఇవ్వను అని తేల్చి చెబుతాడు. రోహిణీ ఎన్ని రకాలుగా అడిగినా..మనోజ్ ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి వెళ్లిపోతాడు.

ఇక బాలు.. డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటే.. అక్కడికి మనోజ్, రవి వస్తారు. మరోవైపు మీనా దగ్గరకు రోహిణీ, శ్రుతి వస్తారు. ఇక.. వీళ్లు డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తనకు అప్పుగా కావాలి అని.. రోహిణీ.. శ్రుతిని సహాయం అడుగుతుంది.. బాలు రవిని అడుగుతాడు.‘ ఆడంబరాల కోసం చేసే ఖర్చులకు డబ్బు ఇవ్వకూడదు’ అని ఇటువైపు రవి, అటువైపు శ్రుతి, మీనా అంటారు.చాలా సేపు వాళ్లు అక్కడ.. వీళ్లు ఇక్కడ వాదిస్తూ ఉంటారు.‘ వడ్డీకి డబ్బులు ఇవ్వమని’ శ్రుతి సలహా ఇస్తుంది. ఈ సలహా రోహిణీకి నచ్చుతుంది. కానీ.. బాలుకి నచ్చదు. ఫ్రెండ్ కి డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు అని అనుకుంటాడు.

రోహిణీ, మనోజ్ బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత.. రోహిణీ నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొట్టడంతో.. ఇక.. రోహిణీకి వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి మనోజ్ ఒప్పుకుంటాడు. దీంతో.. రోహిణీ డబ్బుల సమస్య తీరినందుకు సంతోషిస్తుంది. మనోజ్ కి చాలా ఈజీగా టోపీ పెట్టేస్తుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: బాలుతో మీనా గొడవ, మరింత ఎక్కువ చిచ్చు పెట్టిన ప్రభావతి
Related image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
34
రాజేష్ కి మీనా సలహా...
Image Credit : Jio Hotstar

రాజేష్ కి మీనా సలహా...

ఇక రాజేష్ తన ఫ్రెండ్స్ ని ఫంక్షన్ కి రమ్మని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. బాలు కోసం వచ్చావా అని రాజేష్ అడిగితే.. ‘ మీకోసమే వచ్చాను అన్నయ్య’ అని మీనా అంటుంది. ‘ బాలుకీ, నీకు ఏదైనా గొడవా?’ అని రాజేష్ అంటే.. ‘ గొడవలాంటిదే.. కానీ మా విషయంలో కాదు.. మీ విషయంలో..’ అని చెబుతుంది.రాజేష్ అర్థం కానట్లు చూస్తే.. మీనా మాట్లాడటం మొదలుపెడుతుంది.‘ గొడవ విషయం పక్కన పెట్టండి.. మీరు మీ అమ్మానాన్నకు షష్ఠి పూర్తి చేయాలని అనుకుంటున్నారు అంట కదా.. ఈరోజుల్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికే ఆలోచిస్తుంటే.. మీ ఆలోచన చాలా బాగుంది. ఈ ఫంక్షన్ వస్తుందని మీకు ముందే తెలుసుకదా.. మరి.. ముందు నుండే డబ్బులు ఎందుకు దాచి పెట్టలేదు? ’ అని అడుగుతుంది. ‘ ఎప్పుడూ ఏదో ఒక అవసరం వస్తూనే ఉంది..’ అని రాజేష్ చెబితే.. ‘ మరి ఫంక్షన్ ఎలా చేస్తారు?’ అని మీనా అడుగుతుంది. ‘ బాలునే లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు’ అని చెబుతాడు. ‘ ఇప్పుడంటే ఆయన ఇస్తాడు.. మీ అవసరాలు మీకు ఉంటూనే ఉంటాయి.. మరి.. తిరిగి ఎలా ఇస్తారు? అప్పు గానే కదా తీసుకుంటుంది’ అని మీనా అంటుంది. ‘ అప్పు అనే మాట మా మధ్య ఎప్పుడూ రాలేదు’ అని రాజేష్ అంటాడు. ‘మీ వాళ్లు ఎవరో ఘనంగా చేశారు అని మీరు కూడా అలానే చేయాలి అనుకుంటే అప్పుల పాలౌతారు. మీరు రాత్రిపగలు కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నారు.. మా ఆయన అదే చేస్తున్నారు.. నేను కూడా పూలు అమ్ముతున్నాను.. లక్ష సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామో మీకు తెలీదా? ఆ డబ్బంతా ఒక్క రోజులో ఖర్చు చేస్తే.. దానిని కూడ పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించారా? ఆయన మీకు డబ్బులు అప్పుగా ఇస్తున్నారా? చే బదులుగా ఇస్తున్నారా అని కనుక్కోవడానికి రాలేదు అన్నయ్య.. ఒకవేళ ఆ డబ్బు మీరు దాచుకున్న డబ్బు అయినా.. అది వృథా ఖర్చు అని చెప్పేదాన్ని. అవసరానికీ, ఆఢంబరానికీ చాలా తేడా ఉంది.. స్థోమత మర్చిపోయి ఖర్చు చేస్తే చాలా ఇబ్బంది పడతారు’ అని మీనా చెబుతుంది.

‘ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి.. మీరు ఇబ్బంది పడకూడదు అనే చెప్పాను. అంతేకానీ.. మీ స్నేహితుడు మీకు డబ్బులు ఇస్తుంటే.. ఇష్టంలేక మాట్లాడటానికి మాత్రం రాలేదు.. అదొక్కటి గుర్తు పెట్టుకోండి.. వస్తాను అన్నయ్య’ అని చెప్పేసి మీనా వెళ్లిపోతుంది. మీనా వచ్చి వెళ్లినట్లు బాలుకి చెప్పొద్దని రాజేష్.. తన ఫ్రెండ్స్ తో చెబుతాడు.

44
రోహిణీకి డబ్బులు ఇచ్చిన మనోజ్..
Image Credit : Jio Hotstar

రోహిణీకి డబ్బులు ఇచ్చిన మనోజ్..

ఇక.. రోహిణీకి.. మనోజ్ లక్ష రూపాయలు ఇస్తాడు. ఆ డబ్బులు ఇచ్చి.. వందసార్లు జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడే విద్య వస్తుంది. మాట్లాడాలి అని చెప్పి.. రోహిణీని దూరంగా తీసుకువెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. మళ్లీ బాలు, మీనా మధ్య పెద్ద గొడవ జరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2: తల్లి కోసం బిడ్డని చంపుకోవడానికి దీప రెడీ , కార్తీక్ కి ఫ్యూజులు అవుట్.. ఏం చేశాడంటే
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: బాలుతో మీనా గొడవ, మరింత ఎక్కువ చిచ్చు పెట్టిన ప్రభావతి
Recommended image3
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: బాలుతో మీనా గొడవ, మరింత ఎక్కువ చిచ్చు పెట్టిన ప్రభావతి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved