- Home
- Entertainment
- చిరంజీవి, బాలయ్య, వెంకీ లకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న డైరెక్టర్..ఇంటికెళ్లి అడిగితే
చిరంజీవి, బాలయ్య, వెంకీ లకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న డైరెక్టర్..ఇంటికెళ్లి అడిగితే
80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్ ని తెలుగు డైరెక్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకి హీరోయిన్ తల్లి ఊహించని షాక్ ఇచ్చింది.

80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన నటి భానుప్రియ. ఆమె అద్భుతమైన క్లాసికల్ డాన్సర్. భానుప్రియ తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో నటించింది. భానుప్రియ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి అగ్ర హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించారు. కానీ కింగ్ నాగార్జునకు హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
నాగార్జునతో నటించే అవకాశం తనకు రాలేదని ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది. భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో తెలుగు డైరెక్టర్ వంశీతో అప్పట్లో వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్ వంశీ భానుప్రియని వివాహం చేసుకోవాలనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీని గురించి భానుప్రియ స్పందిస్తూ.. వంశీ గారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి వాస్తవమే. ఆ సమయంలో నేను చాలా చిన్న అమ్మాయిని. కాబట్టి ఆ సంగతులు నాకు అంతగా తెలిసేది కావు. కానీ వంశీ గారు ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్లు మా అమ్మకి చెప్పారు. కానీ మా అమ్మ రిజెక్ట్ చేసింది అని భానుప్రియ తెలిపింది.
భానుప్రియ తల్లి వంశీ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ వంశీకి వివాహం జరిగింది. తనకు పెళ్లి అయినప్పటికీ ఆయన భానుప్రియ పై మనసు పడ్డారు.
భానుప్రియ తెలుగులో ఖైదీ నెంబర్ 786, స్వర్ణకమలం, అల్లరి కృష్ణయ్య, పెదరాయుడు, అపూర్వ సహోదరులు, జ్వాలా లాంటి చిత్రాల్లో నటించారు. తాను కూడా డాన్సర్ కాబట్టి అప్పట్లో భానుప్రియ చిరంజీవితో పోటీపడి డాన్స్ చేయాలని ప్రయత్నించేవారట.