Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Single Queens: సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ, పెళ్లి కంటే కెరీర్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా పెళ్లికి దూరంగా ఉన్న హీరోయిన్లు ఎవరో చూద్దాం

అనుష్క శెట్టి...
అనుష్క సినిమాల్లోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అనుష్క పెళ్లికి దూరంగానే ఉంది. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటుందని, ప్రభాస్ తో పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఓ ఎన్ఆర్ఐ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ..అనుష్క మాత్రం ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది. ఆమె వయసు 44 ఏళ్లు కాగా ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయింది. వరసగా సినిమాలు చేస్తూనే ఉంది.
త్రిష..
రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఏకైక నటి త్రిష. ఒకప్పుడు నిశ్చితార్థం వరకు వెళ్లి త్రిష పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికీ.. మంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ..పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది..
శృతి హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా వచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయలేదు. ప్రేమలో ఉన్నట్లు బహిరంగంగానే చెప్పే ఈ భామ, పెళ్లి అనే బంధం కంటే సహజీవనం, కెరీర్ మీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతోంది.
తమన్నా, పూజ హెగ్డే...
తమన్నా, పూజా హెగ్డేలు కూడా ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తింది లేదు. వీరిద్దరి వయసు కూడా మూడు పదులు దాటింది. వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు..

