MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

BB జోడీ సీజన్ 2 మొదటిసారి సందడి చేశారు రీతూ చౌదరి, డిమోన్ పవన్. ఈఇద్దరికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్ గురించి అందరికి తెలిసిందే. దాంతో BB జోడీలో తేలిగ్గా అవకాశం సాధించారు. మరి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 12 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
BB జోడీ సీజన్ 2 లో
Image Credit : Star Maa

BB జోడీ సీజన్ 2 లో

బిగ్ బాస్ సీజన్ అయిపోగానే.. అందులో కంటెస్టెంట్స్ తో ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడుతుంటారు. ఈమధ్య కాలంలో BB జోడీ పేరుతో ఓ షో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ను జంటలు గా మార్చి.. డాన్స్, పెర్ఫామెన్స్ లతో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈక్రమంలో ఈ షోలో పాపులర్ జంటలు.. బిగ్ బాస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన జంటలు కూడా కనిపిస్తుంటారు. ఈసారి BB జోడీ సీజన్ 2 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ రీతూ, డిమోన్ పవన్ సందడి చేశారు.

25
బుల్లితెర జంటల మధ్య హోరా హోరీ పోరు..
Image Credit : Star Maa

బుల్లితెర జంటల మధ్య హోరా హోరీ పోరు..

బుల్లితెరపై ప్రస్తుతం విజయవంతంగా ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో BB జోడీ సీజన్ 2 ఒకటి. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షోకు మొదటి ఎపిసోడ్ నుంచే మంచి స్పందన లభించింది. ప్రస్తుతానికి ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ రేస్ అమర్ దీప్–నైనిక జంట, మానస్–శ్రేష్టి వర్మ జంటల మధ్య జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జంటలు హోరా హోరీగా తమ ట్యాలెంట్ ను చూపిస్తూ.. పోటీపడుతున్నాయి.

Related Articles

Related image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Related image2
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
35
BB జోడీ లో రీతూ, డిమోన్ పవన్
Image Credit : Star Maa

BB జోడీ లో రీతూ, డిమోన్ పవన్

బిగ్ బాస్ లో బాగా ఫేమస్ జంటలను ఈ BB జోడీ లోకి దింపడం కామన్.. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో జంటగా సందడి చేసిన రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక డ్యాన్స్ కు డ్యాన్స్ .. డ్యాన్స్ తో పాటు మంచి ఎంటర్ టైమ్మెంట్ కూడా ఉంటుంది అని అంతా అనుకున్నారు. వీరిపై భారీగా అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ యావరేజ్ డ్యాన్స్ తో ఆడియన్స్ ను ఒక రకంగా నిరాశకు గురి చేసినట్టు తెలుస్తోంది. దాంతో పట్టుమని పది ఎపిసోడ్స్ కూడా ఉండకుండా.. కేవలం 5 ఎపిసోడ్లకే ఎలిమినేట్ కావాల్సివచ్చింది.

45
అభిమానులను నిరాశపరిచిన బిగ్ బాస్ జంట..
Image Credit : Starmaa

అభిమానులను నిరాశపరిచిన బిగ్ బాస్ జంట..

ఈ ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందులో రీతూ చౌదరి, పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయానని, ఇలాంటి మార్కులు వస్తాయని ముందుగానే ఊహించానని ఆమె చెప్పడం కనిపించింది. అంతేకాకుండా తమ కోరియోగ్రాఫర్ సరైన కాన్సెప్ట్ ఎంచుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కోరియోగ్రాఫర్ మాట్లాడుతూ, తమకు సరైన సమయం ఇవ్వలేదని, సమయం ఇచ్చి ఉంటే కాన్సెప్ట్ మరింత మెరుగ్గా వచ్చేదని అన్నారు. దాంతో ఈసారి రీతు, పవన్ ఎలిమినేషన్ తప్పదంటున్నారు.

55
రీతూ చౌదరి, డిమోన్ పవన్ రెమ్యునరేషన్ ?
Image Credit : Star Maa

రీతూ చౌదరి, డిమోన్ పవన్ రెమ్యునరేషన్ ?

ఇక ఈ షోలో పాల్గొన్నందుకు వీరికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం. ఇద్దరికీ కలిపి ఎపిసోడ్‌కు రూ.4 లక్షల వరకూ ఇచ్చారని టాక్. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. చెరో రెండు లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఐదు వారాలు కొనసాగినందున సుమారు రూ 20 లక్షల వరకు వీరు అందుకున్నట్టు తెలుస్తోంది.ఇద్దరికి ఇదే మొదటి డ్యాన్స్ షో కావడం.. అనుభవం లేకపోవడంతో.. సరిగ్గా చేయలేకపోయారట. ఇక నెక్ట్స్ టైమ్ తీసుకుంటే.. ఇరగదీస్తారంటూ.. అభిమానులు చర్చించుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image2
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved