ఆ పని చేయమంటే ఎంత పెద్ద సినిమా అయినా వదిలేస్తా.. రష్మిక కామెంట్స్ పై ట్రోలింగ్
రష్మిక మందన్న ప్రస్తుతం నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో రష్మిక వరుస విజయాలు అందుకుంది.

రష్మిక మందన్న ప్రస్తుతం నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో రష్మిక వరుస విజయాలు అందుకుంది. ఈ చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వేలకోట్లు వసూలు చేశాయి. రీసెంట్ గా రష్మిక కుబేర చిత్రంతో కూడా మంచి విజయం అందుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక సిగరెట్ స్మోకింగ్ సీన్లపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. సాధారణంగా కమర్షియల్ చిత్రాలలో నటించే రష్మిక, స్క్రిప్ట్ ఎంపికలో కొన్ని స్పష్టమైన నియమాలను పాటిస్తానని పలు సందర్భాల్లో వెల్లడించారు. ముఖ్యంగా, ధూమపానం చేసే పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని ఆమె తెలిపారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ నాకు స్మోకింగ్ అంటే అసహ్యం. అందుకే అలాంటి సీన్లు ఉండే పాత్రలను నేను ఎంచుకోను. స్మోకింగ్ సన్నివేశాల్లో నటించడం వల్ల ప్రేక్షకులని తప్పుదారి పట్టించడం అవుతుంది. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కూడా నా విలువలకు వ్యతిరేకంగా ఉన్న పాత్రలని ఎంచుకోను అని తెలిపారు.
ఈ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె స్మోకింగ్ వద్దని చెప్పిన తర్వాత, గతంలో ఆమె నటించిన ఓ సినిమాలో సిగరెట్ తాగుతున్న దృశ్యం మళ్లీ వైరల్ అయింది. దీనిని ఆధారంగా చేసుకుని కొంతమంది నెటిజన్లు రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం అంటూ విమర్శలు చేస్తున్నారు.
గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తాను రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు అనే అసభ్యమైన ప్రశ్నకూ రష్మిక శాంతంగా స్పందించారు. “నిజ జీవితంలో నేనెప్పుడూ స్మోక్ చేయను. స్మోకింగ్ చేస్తున్న వారిని దగ్గరలో ఉండనివ్వను,” అని స్పష్టం చేసిన విషయం గుర్తుచేస్తున్నారు.
వైన్ తాగడం, కొత్త వంటకాలు ట్రై చేయడం వంటి విషయాల్లో ఓపెన్ మైండ్ ఉన్నా, స్మోకింగ్ విషయంలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటా అని గతంలో రష్మిక తెలిపింది.ఈ వివాదం నేపథ్యంలో రష్మిక అభిమానులు ఆమెను సమర్థిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం కొనసాగుతోంది. రష్మిక ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.