MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు, ఎన్టీఆర్ పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు..రగిలిపోయిన సీనియర్ హీరో

బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు, ఎన్టీఆర్ పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు..రగిలిపోయిన సీనియర్ హీరో

తన కొడుకు బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ తనకి అన్యాయం చేశారని సీనియర్ హీరో ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ హీరో ఎవరు, అతడికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 02 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Facebook

అప్పట్లో చిత్ర పరిశ్రమలో చాలా మందికి నందమూరి తారక రామారావు అభిమాన నటుడు. ఆయన్ని అందరూ అన్నగారు అని అభిమానంగా పిలిచేవారు. ఎన్టీఆర్ అంటే చాలామంది భయపడేవారు కూడా. అదే సమయంలో కృష్ణ లాంటి హీరోలు ఎన్టీఆర్ ని విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కొన్ని సినిమాలు కూడా చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ ని చంద్రమోహన్ కూడా ఒక సందర్భంలో తీవ్రంగా వ్యతిరేకించారు.

26
Image Credit : Sr NTR

దానికి కారణం ఎన్టీఆర్ తనకు చేసిన అన్యాయమే అని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తప్పు అని తెలిసి కూడా ఎన్టీఆర్ అలా చేయడం తనని బాధించింది అని చంద్రమోహన్ తెలిపారు. ఇంతకీ చంద్రమోహన్ కి, ఎన్టీఆర్ కి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రమోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1975లో ఎన్టీఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రం ఖరారైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముళ్లుగా మురళీమోహన్, నేను నటించాలి. ముందుగా ఒక సాంగ్ తో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు

Related Articles

Related image1
రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన శిరీష్‌ రెడ్డి.. క్షమాపణలు కోరుతూ నోట్‌, దిల్‌ రాజు నష్టనివారణ చర్యలు
Related image2
అల్లు అర్జున్ అంతటి స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిన హీరో ఎవరు..అతడి ముఖం మీదే చెప్పిన దిల్ రాజు
36
Image Credit : our own

నేను సాంగ్ షూటింగ్ కోసం రిహార్సల్స్ కూడా చేశాను. మరుసటి రోజు సాంగ్ షూటింగ్ ఉంది. ఉదయాన్నే షూటింగ్ కి వెళ్లాను. షూటింగ్ కి వెళ్ళగానే నాకు ఆశ్చర్యపోయే సంఘటన ఎదురైంది. నాలాగే మేకప్,కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక వ్యక్తి కనిపించారు. ఏదో తేడాగా జరుగుతోందని నాకు అనుమానం మొదలైంది. ఎవరా వ్యక్తి నాలాగా మేకప్ వేసుకుని ఉన్నాడు అని అడిగాను. అతను ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ అని తెలిపారు. నా అనుమానం ఇంకా పెరిగింది.

ఏం జరిగిందని ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. కొంతసేపటికి నిర్మాత పితాంబరం నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇంటికి వెళ్లిపోండి సాయంత్రం మీతో నేను మాట్లాడతాను. చిన్న పొరపాటు జరిగింది అని అన్నారు. ఏం జరిగిందో చెప్పండి అని అడిగాను.. లేదు సార్ ఇంటికి వచ్చి నేనే చెబుతాను అని నన్ను పంపించేశారు. ఆరోజు సాయంత్రం పీతాంబరం నా దగ్గరికి వచ్చి పొరపాటు జరిగింది సార్.

46
Image Credit : Nandamuri Balakrishna /Facebook

ఎన్టీఆర్ గారు తన కొడుకు బాలకృష్ణని తమ్ముడిగా చూడాలి అనుకున్నారు. చివరి నిమిషంలో మీ పాత్ర బాలకృష్ణకు వెళ్ళింది. ఎన్టీఆర్ గారికి నచ్చ చెప్పడానికి మేము చాలా ప్రయత్నించాం. ఈ సినిమాలో బాలకృష్ణని నా తమ్ముడి పాత్రకి తీసుకోండి. చంద్రమోహన్ కి నా మాటగా చెప్పండి.. నా తదుపరి చిత్రంలో చంద్రమోహన్ కి మంచి వేషం ఇస్తాం అని చెప్పండి అని అన్నారు. దీనితో చంద్రమోహన్ కి విపరీతమైన కోపం వచ్చిందట. 

56
Image Credit : Youtube

ఒక ఆర్టిస్ట్ ని షూటింగ్ వరకు రప్పించి మేకప్ వేసుకునే ముందు అవమానించడం ఏంటి? ఏదైనా ఉంటే నేను ఇంట్లో ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా. షూటింగ్ కి రప్పించి అవమానిస్తారా అని చంద్రమోహన్ మండిపడ్డారు. లేదు సార్ మీకు తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్ గారు మంచి వేషం ఇస్తాను అని చెప్పారు. వేషం గీషం  నాకేం అవసరం లేదు.. అసలు ఎన్టీఆర్ గారి పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు అంటూ చంద్రమోహన్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారట. అన్నదమ్ముల అనుబంధం చిత్రం ప్రారంభమయ్యే సమయానికి నాకు టాలీవుడ్ లో ఒక రేంజ్ వచ్చింది.. పాపులారిటీ పెరిగింది.. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాను.

66
Image Credit : our own

అలాంటి నన్ను షూటింగ్ వరకు పిలిపించి అవమానించడంతో జీవించుకోలేకపోయాను అని చంద్రమోహన్ తెలిపారు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు ఆ తర్వాత నాకేమీ ఆయన అవకాశాలు ఇవ్వలేదు. ఆ టైం కి ఏదో ఒక మాట అనేశారు అంతే. ఆయన కొడుకుని తమ్ముడుగా చూడాలనుకోవడం తప్ప ఏమీ లేదు. కాకపోతే ఆ పని ముందే చేసి ఉండాల్సింది. నన్ను షూటింగ్ వరకు రప్పించి అవమానించడమే నాకు బాధ కలిగించింది అని చంద్రమోహన్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
నందమూరి తారక రామారావు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన శిరీష్‌ రెడ్డి.. క్షమాపణలు కోరుతూ నోట్‌, దిల్‌ రాజు నష్టనివారణ చర్యలు
Recommended image2
అల్లు అర్జున్ అంతటి స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిన హీరో ఎవరు..అతడి ముఖం మీదే చెప్పిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved