MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్‌

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. 5 ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ యాక్సెస్‌

TikTok: 2020లో నిషేధించిన టిక్‌టాక్ వెబ్‌సైట్ భారత వినియోగదారులకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ యాక్సెస్ అవుతోంది. అయితే, యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఇండియాలోకి రీఎంట్రీ పై ఇంకా అధికారిక సమాచారం లేదు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 22 2025, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి రానుందా?
Image Credit : Getty

టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి రానుందా?

చైనాకు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ (TikTok) మళ్లీ ఇండియాకు రానుందనే చర్చ సాగుతోంది. 2020లో భారత ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో దీనిని నిషేధించింది. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది భారతీయ యూజర్లకు టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతోంది. ఇది టిక్ టాక్ రీఎంట్రీకి సంకేతమా అన్న చర్చ మళ్లీ మొదలైంది. శుక్రవారం నుంచి పలువురు యూజర్లు ఈ వెబ్‌సైట్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

25
టిక్ టాక్ యాప్ మాత్రం ఇంకా అందుబాటులో లేదు
Image Credit : Freepik

టిక్ టాక్ యాప్ మాత్రం ఇంకా అందుబాటులో లేదు

ప్రస్తుతం భారత్ లో టిక్‌టాక్ వెబ్‌సైట్ మాత్రమే యాక్సెస్ అవుతుండగా, యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. కొన్ని రిపోర్టుల ప్రకారం, వెబ్‌సైట్ హోమ్‌పేజ్ ఓపెన్ అవుతున్నా, న్యూస్‌రూమ్ లేదా కెరీర్స్ పేజీలను క్లిక్ చేస్తే సర్వీస్ అందుబాటులో లేదని సందేశాలు కనిపిస్తున్నాయి. టిక్ టాక్ రీఎంట్రీ పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

Related Articles

Related image1
ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో ఆడటానికి భారత్ ఎన్ని సార్లు నో చెప్పింది?
Related image2
ఆసియా కప్ 2025: పాకిస్తాన్ తో ఆడకపోతే భారత్ కు కలిగే నష్టాలేంటి?
35
2020లో భారత్ లో టిక్‌టాక్ ను ఎందుకు నిషేధించారు?
Image Credit : Getty

2020లో భారత్ లో టిక్‌టాక్ ను ఎందుకు నిషేధించారు?

2020 జూన్‌లో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. ఇందులో టిక్‌టాక్, షేర్‌ఇట్, యూసీ బ్రౌజర్, క్యామ్‌స్కానర్ వంటి యాప్‌లు ఉన్నాయి. "భారత సార్వభౌమత్వం, భద్రత, రక్షణ, పబ్లిక్ ఆర్డర్‌కు విరుద్ధంగా యాక్టివిటీల్లో పాల్గొంటున్నాయి" అని కేంద్రం పేర్కొటూ ఈ యాప్ లపై నిషేధం విధించింది.

సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69A, సంబంధిత రూల్స్ ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేసింది.

45
భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణ
Image Credit : Getty

భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణ

ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతున్న సమయంలో టిక్ టాక్ వెబ్ సైట్ యాక్సెస్ అవుతుండటం గమనార్హం. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలపై టారిఫ్‌లు విధించిన తర్వాత, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో భేటీ అయ్యారు. అలాగే SCO సమ్మిట్‌కి మోడీని ఆహ్వానించారు.

చైనా రాయబారి కూడా భారత్‌తో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే టిక్‌టాక్ వెబ్‌సైట్ మళ్లీ ఇండియాలో కనిపించటం గమనార్హం.

55
అమెరికాలో సంక్షోభంలో టిక్‌టాక్
Image Credit : Getty

అమెరికాలో సంక్షోభంలో టిక్‌టాక్

టిక్‌టాక్‌పై నిషేధం కేవలం భారత్‌లోనే కాదు, అమెరికాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీలు కొనుగోలు చేస్తే నిషేధాన్ని వాయిదా వేయవచ్చని తెలిపారు. మరోవైపు, టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్ తన యూకే ఉద్యోగులను తగ్గిస్తూ, ఆపరేషన్లను AI ఆధారంగా కేంద్రీకరిస్తున్నట్టు ప్రకటించింది.

2017లో బైట్‌డాన్స్ ప్రారంభించిన టిక్‌టాక్, 2020లో భారత్‌లో శాశ్వత నిషేధానిక గురైంది. ఐదు ఏళ్ల తర్వాత వెబ్‌సైట్ మళ్లీ యాక్సెస్ అవుతున్నా, యాప్ తిరిగి వస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ పరిణామం మళ్లీ భారత వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
చైనా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో ఆడటానికి భారత్ ఎన్ని సార్లు నో చెప్పింది?
Recommended image2
ఆసియా కప్ 2025: పాకిస్తాన్ తో ఆడకపోతే భారత్ కు కలిగే నష్టాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved