MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే

జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే

GST reform: ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ మార్పులతో రోజువారీ వినియోగంలోని 90% వస్తువులు చవక కానున్నాయి. 12%, 28% స్లాబ్‌లు రద్దు చేయడంతో ధరలు తగ్గనున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 22 2025, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 జీఎస్టీ అంటే ఏమిటి?
Image Credit : istock

జీఎస్టీ అంటే ఏమిటి?

జీఎస్టీ అంటే వస్తువులు, సేవల పన్ను. భారతదేశంలో వస్తువులు, సేవలపై విధించే ఒక పరోక్ష పన్ను. గతంలో ఉన్న వివిధ రకాలైన కేంద్ర, రాష్ట్ర పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. 

భారత్ లో 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. 1947 తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా ఇది గుర్తింపు పొందింది. "ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్‌" అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది.

జీఎస్టీ నాలుగు స్లాబ్‌లతో అమలు అవుతోంది, అవి 5%, 12%, 18%, 28%. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 28% పైన అదనపు పన్ను వసూలు చేశారు. ఉదాహరణకు, సిగరెట్లు, లగ్జరీ కార్లు, హైఎండ్ బైకులు. కానీ ఈ వ్యవస్థ క్లిష్టంగా ఉందని విమర్శలు వచ్చాయి. 

ఉదాహరణకు.. ప్రీ-ప్యాకేజ్డ్ సాల్టెడ్ పాప్‌కార్న్‌పై 12% పన్ను విధిస్తుండగా, కారామెల్‌కు 18% పన్ను విధిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే సాధారణ చపాతీకి 5% పన్ను ఉంటే, పొరలు ఉన్న పరాటాకు 18% పన్ను విధించారు. ఇలా పలు విషయాల్లో జీఎస్టీ నాలుగు స్లాబ్‌ల అంశంపై విమర్శలు వచ్చాయి.

DID YOU
KNOW
?
జీఎస్టీ
గతంలో ఉన్న వివిధ రకాలైన కేంద్ర, రాష్ట్ర పన్నులు అంటే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సేవా పన్ను ఇలాంటి వాటిని ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జూలై 1, 2027లో జీఎస్టీని తీసుకొచ్చారు.
25
జీఎస్టీ లో ప్రతిపాదిత సంస్కరణలు ఏమిటి?
Image Credit : Getty

జీఎస్టీ లో ప్రతిపాదిత సంస్కరణలు ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలోనే అతిపెద్ద పన్ను సంస్కరణను ఇప్పుడు ప్రతిపాదించింది. దీంతో 28% పన్ను స్లాబ్ రద్దు కానుంది. కార్లు, ఎయిర్‌కండీషనర్లు, ఫ్రిజ్ వంటి ఉత్పత్తులు చవక అవుతాయి. 

12% పన్ను స్లాబ్ కింద ఉన్న 99% ఉత్పత్తులు 5%కి వస్తాయి. వీటిలో వెన్న, పండ్ల రసాలు, డ్రైఫ్రూట్స్ ఉన్నాయి. చిన్న కార్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గుతుంది. 2023లో జీఎస్టీ ద్వారా భారత ప్రభుత్వం $224 బిలియన్లను వసూలు చేసింది. 

కొత్త సంస్కరణలతో $20 బిలియన్ ఆదాయం తగ్గవచ్చని IDFC ఫస్ట్ బ్యాంక్ అంచనా వేసింది. 40 శాతంగా ఉన్న స్పెషల్ స్లాబ్ లో పొగాకు ఉత్పత్తులు, మద్యం, లగ్జరీ ఉత్పత్తులు ఉన్నాయి.

Related Articles

Related image1
ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే
Related image2
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?
35
జీఎస్టీ మార్పులతో వేటి ధరలు తగ్గుతాయి?
Image Credit : our own

జీఎస్టీ మార్పులతో వేటి ధరలు తగ్గుతాయి?

జీఎస్టీలో ఈ మార్పులతో వ్యక్తిగత సంరక్షణ వస్తువులైన హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ లతో పాటు జామ్, జ్యూస్, చిప్స్, పాస్తా, నూడిల్స్, నెయ్యి, వెన్న, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల పన్ను తగ్గుతుంది. 

నిర్మాణ సామగ్రి (సిమెంట్)పై పన్ను తగ్గుతుంది. అలాగే, ఎయిర్‌కండీషనర్లు, టెలివిజన్లు, ఫ్రిజ్‌లు, వాటర్ ఫిల్టర్స్, వాషింగ్ మిషన్లు కూడా చవక అవుతాయి. దీని ద్వారా సామ్‌సంగ్‌, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయంగా ఉన్న రోజువారీ వినియోగ వస్తువుల తయారీదారులకు లాభం కలుగుతుంది.

45
జీఎస్టీ స్లాబ్ మార్పులు: ఆర్థిక ప్రభావం ఏమిటి?
Image Credit : Asianet News

జీఎస్టీ స్లాబ్ మార్పులు: ఆర్థిక ప్రభావం ఏమిటి?

ప్రస్తుతం జీఎస్టీ కలెక్షన్లలో 67% వాటా 18% స్లాబ్ నుంచే వస్తోంది. అది అలాగే కొనసాగుతుంది. అయితే పన్ను తగ్గింపుతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

అదే సమయంలో వినియోగం పెరుగుతుంది. వినియోగం భారత జీడీపీకి 60% వాటా ఇస్తుంది. IDFC ఫస్ట్ అంచనాల ప్రకారం, వచ్చే 12 నెలల్లో భారత జీడీపీ 0.6 శాతం పాయింట్లు పెరగవచ్చు.

55
జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం లభించాలి
Image Credit : Getty

జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం లభించాలి

ఈ ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం అవసరం. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఇందులో ఉంటారు. రాష్ట్రాల ఆదాయంపై ఇది ప్రభావం చూపవచ్చు. 

జీఎస్టీ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గతంలో రాష్ట్రాలు క్యాసినో, లాటరీ, ఆన్‌లైన్ గేమింగ్‌ వంటి అంశాలపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇప్పుడు కమిటీ సూచించిన మార్పులు అమలులోకి వస్తే, దాదాపు 90% రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం లభించనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత పార్లమెంటు
భారత దేశం
నరేంద్ర మోదీ
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే
Recommended image2
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved