MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.25 లక్షల వరకు రుణం.. సొంతింటి కలను నెరవేర్చే అద్భుతమైన పథకం

రూ.25 లక్షల వరకు రుణం.. సొంతింటి కలను నెరవేర్చే అద్భుతమైన పథకం

House Building Scheme: ఉద్యోగులకు తక్కువ వడ్డీతో రూ.25 లక్షల వరకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రుణం అందించే అద్భుతమైన పథకం ఒకటి ఉంది. అదే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 20 2025, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సొంతింటి కలను సాకారం చేసే పథకం
Image Credit : freepik

సొంతింటి కలను సాకారం చేసే పథకం

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే కల ఉంటుంది. అయితే పెరుగుతున్న ఆస్తి ధరలు, అధిక వడ్డీ రేట్లు కారణంగా ఈ కల చాలా మందికి అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారంగానే మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. అదే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం.

25
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకంలో రూ.25 లక్షల వరకు రుణ సౌకర్యం
Image Credit : Getty

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకంలో రూ.25 లక్షల వరకు రుణ సౌకర్యం

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గరిష్టంగా రూ.25 లక్షల వరకు అడ్వాన్స్ పొందవచ్చు. ఈ రుణాన్ని ఉద్యోగులు తమకు ఇప్పటికే ఉన్న బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణాలను తీర్చడానికి కూడా వినియోగించవచ్చు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం కింద వడ్డీ రేటు కేవలం 7.44% మాత్రమే ఉంటుంది. ఇది సాధారణ గృహ రుణాలతో పోలిస్తే చాలా తక్కువ.

Related Articles

Related image1
షుగర్ డాడీ.. ఎట్టకేలకు చాహల్ తో విడాకుల పై స్పందించిన ధనశ్రీ వర్మ
Related image2
మిస్సయ్యారు.. మళ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, విరాట్.. ఏం జరిగింది?
35
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం వివరాలు
Image Credit : freepik

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం వివరాలు

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం ప్రకారం గరిష్టంగా 34 నెలల బేసిక్ పే లేదా రూ.25 లక్షలు (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది) అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు.

  • ఇల్లును మరింత విస్తరించడం కోసం గరిష్టంగా రూ.10 లక్షలు లేదా 34 నెలల బేసిక్ పే లభిస్తుంది.
  • భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, ఇద్దరూ వేర్వేరుగా అడ్వాన్స్ పొందవచ్చు. అంటే మొత్తం రూ.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
  • బేసిక్ పేలో నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్, ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
45
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకానికి ఎవరు అర్హులు?
Image Credit : AI

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకానికి ఎవరు అర్హులు?

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ అర్హులు. అలాగే, కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చు. అఖిల భారత సర్వీసుల సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు కూడా ఇందులోకి వస్తారు. సస్పెండ్ అయిన ఉద్యోగులు కూడా కొన్ని షరతులతో రుణం పొందవచ్చు.

55
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రుణం లో తక్కువ వడ్డీ
Image Credit : Asianet News

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రుణం లో తక్కువ వడ్డీ

సాధారణ గృహ రుణాలపై వడ్డీ రేటు 9% నుంచి 11% వరకు ఉంటుంది. అయితే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకంలో వడ్డీ రేటు కేవలం 7.44% మాత్రమే. దీని వల్ల ఉద్యోగుల పై ఈఎంఐ భారం తగ్గుతుంది.

వడ్డీ రేటుపై రీఫండ్ సౌకర్యం

ఈ పథకం కింద రుణం తీసుకున్న ఉద్యోగులు కొన్ని షరతులతో వడ్డీపై రీఫండ్ కూడా పొందవచ్చు. అన్ని షరతులు పాటించినట్లయితే 2.5% రీఫండ్ లభిస్తుంది. ఇలా, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గృహ నిర్మాణ కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, రీఫండ్ సౌకర్యం వంటి అంశాలు ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఉంచుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
షుగర్ డాడీ.. ఎట్టకేలకు చాహల్ తో విడాకుల పై స్పందించిన ధనశ్రీ వర్మ
Recommended image2
మిస్సయ్యారు.. మళ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, విరాట్.. ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved