MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అప్పుల ఊబిలో లక్ష‌లాది మంది.. తెలుగు వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం. అస‌లేందుకిలా జ‌రుగుతోంది

అప్పుల ఊబిలో లక్ష‌లాది మంది.. తెలుగు వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం. అస‌లేందుకిలా జ‌రుగుతోంది

Debt: అప్పు అతిపెద్ద ముప్పు అని చెబుతుంటారు. ఆర్థిక క్రమ శిక్ష‌ణ లేక‌పోతే అప్పులు ఎక్కువుతాయ‌ని తెలిసిందే. ఇప్పుడు దేశంలో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నార‌ని ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 28 2025, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి?
Image Credit : Getty

అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి?

దేశంలో వ్యక్తులు తీసుకునే అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. గ‌త రెండేళ్ల‌లో ఈ అప్పుల శాతం భారీగా పెరిగింది. వీటిలో సగానికి పైగా ‘హౌసింగ్‌’ లోన్‌కి సంబంధం లేనివే ఉండ‌డం గ‌మ‌నార్హం. అంటే ఎక్కువ‌గా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, వినియోగ అవసరాల కోసం తీసుకునే రుణాలు ఉన్నాయి. దీంతో కుటుంబాలు ఆస్తులు కొనడానికి కాకుండా ఖర్చులను నెత్తిపై మోసుకునేందుకు అప్పు తీసుకుంటున్నాయన్నది స్పష్టమవుతోంది. అదే సమయంలో, ఆదాయానికి మించి లోన్–టు–వాల్యూ రుణాలు పెరగడంతో డిఫాల్ట్ ప్రమాదం కూడా పెరుగుతోంది.

25
ఏపీ–తెలంగాణలో అప్పుల భారమే ఎక్కువ
Image Credit : Pixabay

ఏపీ–తెలంగాణలో అప్పుల భారమే ఎక్కువ

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 7 మంది పెద్దల్లో ఒకరికి అప్పు ఉంది. కానీ, దక్షిణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఎక్కువ‌గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ – 43.7% మంది అప్పులో ఉండ‌గా..

తెలంగాణ – 37.2% మంది అప్పులో ఉన్నారు.

ఇక కేరళ, తమిళనాడు విష‌యానికొస్తే – దాదాపు 30% మంది అప్పుల ఊబిలో ఇరుక్కున్నారు. కాగా ఢిల్లీలో కేవ‌లం 3 నుంచి 4 శాతం మంది మాత్ర‌మే అప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అంటే, ఏపీ, తెలంగాణలో దాదాపు ప్రతి రెండో కుటుంబం అప్పుతో జీవిస్తోంది.

Related Articles

Related image1
50 మంది మృతికి కార‌ణ‌మైన తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది.. భారీ విప‌త్తు త‌ప్ప‌దా?
Related image2
మీన రాశిలోకి శని వక్రత్యాగం.. ఈ 5 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
35
రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగాయి
Image Credit : Pixabay

రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగాయి

పది సంవత్సరాల్లో రాష్ట్రాల అప్పులు రూ. 17.5 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 60 లక్షల కోట్లకు పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి పనుల కోసం అప్పు తీసుకుంటున్నా, చాలా రాష్ట్రాలు రోజువారీ ఖర్చులకే రుణాలు తీసుకునే స్థితికి వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఆ రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెంచుతుంది.

45
ఆందోళ‌నక‌రంగా ప‌రిస్థితి
Image Credit : Asianet News

ఆందోళ‌నక‌రంగా ప‌రిస్థితి

అప్పు ఒక సంఖ్య కాదు.. అది కుటుంబాల కష్టాలు, ఖర్చుల భారాన్ని సూచిస్తుంది. నెల చివరిలో ఖర్చులు తీరక అప్పులు పెరగడం, యువత సెక్యూరిటీ లేని రుణాల్లో చిక్కుకోవడం, రాష్ట్రాల బడ్జెట్‌పై భారమైపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాగే కొన‌సాగితే.. కుటుంబాల పొదుపులు తగ్గే ప్రమాదం ఉంద‌ని నిపుణులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రాలకు అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం తగ్గిపోవడం, ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరగడం వంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

55
మ‌రి ప‌రిష్కారం ఏంటి.?
Image Credit : Pixabay

మ‌రి ప‌రిష్కారం ఏంటి.?

స్ప‌ష్ట‌మైన అవగాహ‌న‌ను పెంచుకోవ‌డం ద్వారా అప్పుల‌ను తీర్చ‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మెరుగైన ఆర్థిక విద్య, మంచి రుణ నియంత్రణ, బాధ్యతతో కూడిన విధాన రూపకల్పన వంటి మార్పులతో రుణాలు తీర్చ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాద‌ని అంటున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
50 మంది మృతికి కార‌ణ‌మైన తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది.. భారీ విప‌త్తు త‌ప్ప‌దా?
Recommended image2
మీన రాశిలోకి శని వక్రత్యాగం.. ఈ 5 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved