MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా.? ఈ త‌ప్పుచేస్తే అధికారులు మీ ఇంటికి వ‌స్తారు

బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా.? ఈ త‌ప్పుచేస్తే అధికారులు మీ ఇంటికి వ‌స్తారు

Bank Rules: బ్యాంకులో డ‌బ్బు జ‌మ చేయ‌డం అనేది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. అయితే మ‌నీ డిపాజిట్ చేయ‌డానికి కూడా కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని మీకు తెలుసా.? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 24 2025, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి
Image Credit : Asianet News

రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి

బ్యాంకులో మీరు ఎంత డబ్బైనా జమ చేయవచ్చు. కానీ రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలనుకుంటే, తప్పనిసరిగా పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. ఈ నియమం వల్ల బ్యాంకులు అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను రికార్డు చేస్తాయి. అవసరమైతే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి. అందువల్ల, పెద్ద మొత్తంలో నగదు జమ చేయాలనుకునే వారు గుర్తింపు పత్రాల‌ను వెంట తీసుకెళ్లడం అవసరం

25
పొదుపు ఖాతా వార్షిక పరిమితి రూ. 10 లక్షలు
Image Credit : Social media

పొదుపు ఖాతా వార్షిక పరిమితి రూ. 10 లక్షలు

మీ సేవింగ్స్‌ అకౌంట్‌లో సంవత్సరానికి రూ. 10 లక్షలకు పైగా నగదు జమ అయితే, బ్యాంక్‌ స్వయంగా ఆ వివరాలను పన్ను శాఖకు నివేదిస్తుంది. ఇది చట్టవిరుద్ధం కాదు కానీ, మీరు జమ చేసిన డబ్బు మూలం స్పష్టంగా చూపించలేకపోతే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. జీతం, వ్యాపారం లేదా ఇతర చట్టబద్ధమైన ఆదాయం అని ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అకౌంటింగ్ లేకుండా పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేస్తే ఆదాయ‌పు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు.

Related Articles

Related image1
స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? బస్సు ఎక్కే ముందు వీటిని చెక్ చేసుకోండి
Related image2
ఫ్యామిలీ కోసం కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. ల‌క్ష‌న్న‌ర‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. EMI ఎంతంటే..
35
కరెంట్ ఖాతాలకు వేరే నియమాలు
Image Credit : iSTOCK

కరెంట్ ఖాతాలకు వేరే నియమాలు

వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి వృత్తిదారులు ఎక్కువగా కరెంట్ ఖాతాలను ఉపయోగిస్తారు. వారి కోసం డిపాజిట్ పరిమితి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ నగదు కరెంట్ అకౌంట్‌లో జమ అయితే, బ్యాంకు దానిని కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుంది. ఇది కూడా ఒక రిపోర్టింగ్ పరిమితి మాత్రమే, కానీ ఇంత మొత్తాన్ని మించితే మీ ఇన్‌క‌మ్ సోర్స్‌ను స్పష్టంగా చూపించాలి.

45
ATM, డిపాజిట్ మిషిన్ల పరిమితులు
Image Credit : Asianet News

ATM, డిపాజిట్ మిషిన్ల పరిమితులు

ఇప్పుడు చాలా మంది కేవ‌లం బ్యాంకుల్లోనే కాకుండా.. CDM (Cash Deposit Machine) లేదా ATM ద్వారా డబ్బు జమ చేస్తున్నారు. బ్యాంకు ప్రకారం ఈ యంత్రాలకూ రోజువారీ పరిమితులు ఉంటాయి.

* SBI ATM లేదా CDM ద్వారా రోజుకు రూ. 2 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు.

* HDFC బ్యాంక్‌లో కూడా రూ. 2 లక్షల వరకు రోజువారీ డిపాజిట్ పరిమితి ఉంది. ఈ పరిమితులు బ్యాంకు భద్రతా విధానాల ప్రకారం మారవచ్చు.

55
ఆదాయపు పన్ను శాఖ ఎందుకు పర్యవేక్షిస్తుంది?
Image Credit : ChatGPT

ఆదాయపు పన్ను శాఖ ఎందుకు పర్యవేక్షిస్తుంది?

పన్ను శాఖ ఉద్దేశ్యం చిన్న డిపాజిట్లను జరిమానా వేయడం కాదు. ముఖ్యంగా లెక్కల్లో చూపని నిధులు, నల్లధనం లావాదేవీలు గుర్తించడం కోసం మాత్రమే పర్యవేక్షణ ఉంటుంది. మీ డిపాజిట్లు ఒక నిర్దిష్ట పరిమితిని మించినప్పుడు, వారు నిధుల మూలాన్ని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన పత్రాలు.. శాల‌రీ స్లిప్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్, వ్యాపార రసీదులు వంటివి ఉంటే ఎలాంటి భయం ఉండదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? బస్సు ఎక్కే ముందు వీటిని చెక్ చేసుకోండి
Recommended image2
ఫ్యామిలీ కోసం కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. ల‌క్ష‌న్న‌ర‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. EMI ఎంతంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved