Birth Date: మీ పుట్టిన తేదీ ప్రకారం మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా?
న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదో గుర్తించవచ్చు. మరి, మీ లో ఉన్న ఆ స్పెషల్ హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసుకుందామా...

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరు చాలా సృజనాత్మకతతో ఉంటారు. మరి కొందరు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలా మనలో ఒక స్పెషల్ క్వాలిటీ, టాలెంట్ ఉండటానికి మనం పుట్టిన తేదీ కూడా ఒక కారణం అని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదో గుర్తించవచ్చు. మరి, మీ లో ఉన్న ఆ స్పెషల్ హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసుకుందామా...
నెంబర్ 1:
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎన్ని సమస్యలు ఎదురైనా సంకల్ప బలంతో ముందుకు దూసుకుపోతారు. సవాళ్లను కూడా మంచి అవకాశాలుగా మార్చుకుంటారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించుకోవడానికి వారు చాలా కష్టపడతారు. వీరిలో సహజంగా దృఢనిశ్చయం ఉంటుంది.
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు ఎంతో సున్నితమైన మనసు కలిగినవారు. సహజమైన అవగాహనతో ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించే స్వభావం వీరికి ఉంది. ఇతరులతో సంబంధాలు బలంగా ఉండేలా చూస్తారు.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు సమస్యలపై సృజనాత్మక దృష్టితో పరిష్కారాలు కనుగొంటారు. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ స్పష్టతనిచ్చే మార్గాలను తేల్చగల శక్తి వీరిలో ఉంటుంది. జవాబు దొరకనిదే వీరు వదిలిపెట్టరు.
నెంబర్ 4
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారు లోతైన ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. వినూత్న ఆలోచనలతో కొత్త దారులు వెతుకుతుంటారు. కళ, విజ్ఞానం, లేదా సమస్య పరిష్కారంలో కొత్త కోణాలు వీరి ప్రత్యేకత.
నెంబర్ 5
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించినవారు చాలా బాగా మాట్లాడగలరు. పదాలు, భావాలు, సంభాషణలో అసాధారణ నైపుణ్యం కలిగినవారు. వారితో మాట్లాడిన తరువాత వారి మాటలు మదిలో నిలిచిపోతాయి. ఇతరులను ఆకర్షించే తీరు వీరికి సహజం.
నెంబర్6
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించినవారు సమతుల్యత, సమన్వయం వీరి ప్రత్యేకత. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా వ్యవహరించే నైపుణ్యం ఉంటుంది. వారిచేత నిర్వహించే పనుల్లో అందం, సమరస్యం సహజంగా కనిపిస్తుంది.
నెంబర్ 7
ఏ నెలలో అయినా సరే 7, 16, 25 తేదీల్లో జన్మించినవారు ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు. లోతైన ఆత్మచింతనతో జీవితం మీద విభిన్న దృక్కోణం పెంచుతారు. జ్ఞానం, మార్గదర్శనం కోసం వారిని ఆదర్శంగా తీసుకుంటారు.
నెంబర్ 8
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించినవారు స్థిరత్వం, పట్టుదల వీరి బలాలు. కష్టపడటం వీరి జీవనశైలి. ఏ పని అయినా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఎదురుదెబ్బలు వచ్చినా ముందుకు సాగటంలో వీరికి మరెవరూ సాటిరారు.
నెంబర్ 9
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించినవారు
ధైర్యంగా ఎదురు నిలవగలవారు. న్యాయం కోసం గళమెత్తే వీరు నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం. సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉంటూ ధైర్యంగా ముందుకు సాగుతారు.